iDreamPost
android-app
ios-app

గుంటూరు కారం నుంచి ‘ఓ మై బేబీ’ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్!

  • Published Feb 02, 2024 | 9:55 PM Updated Updated Feb 02, 2024 | 9:55 PM

Oh My Baby Full Video Song: త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘గుంటూరు కారం ’ ఈ మూవీలో ‘ఓ మై బేబీ’ సాంగ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది.

Oh My Baby Full Video Song: త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘గుంటూరు కారం ’ ఈ మూవీలో ‘ఓ మై బేబీ’ సాంగ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది.

  • Published Feb 02, 2024 | 9:55 PMUpdated Feb 02, 2024 | 9:55 PM
గుంటూరు కారం నుంచి ‘ఓ మై బేబీ’ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్!

తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ‘నీడ’ చిత్రంలో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు. ఆ తర్వాత పలు చిత్రాల్లో బాల నటుడిగా అందరి దృష్టిని ఆకర్శించాడు. కొంతకాలం నటనకు స్వస్తి చెప్పి చదువుపై దృష్టి పెట్టారు. ‘రాజకుమారుడు’ చిత్రంతో హీరోగా మారిన మహేష్ బాబు.. క్లాస్, మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మహేష్ బాబు. ఈ చిత్రంలో సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి మరోసాంగ్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. వివరాల్లోకి వెళితే..

ఈ సంవత్సరం సంక్రాంతి కానుగా త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘గుంటూరు కారం’ మంచి కలెక్షన్లతో దూసుకు వెళ్లింది. ఈ చిత్రంలో ఇప్పటి వరకు చూడని సరికొత్త మహేష్ బాబు కనిపించాడని అభిమానులు తెగ సంబరపడిపోయారు.  మహేష్ బాబు సరసన అందాల భామ శ్రీలీల, మీనాక్షి చౌతరి నటించారు. వాస్తవానికి ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా మహేష్ బాబు ‘గుంటూరుకారం’, వెంకటేష్ ‘సైంధవ్’, నాగార్జున నటించిన ‘నాసామిరంగ’ తో పాటు యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ‘హనుమాన్’ మూవీ రిలీజ్ అయ్యాయి.  గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు యాక్టీంగ్ మాత్రమే కాదు.. తన డ్యాన్స్ తో అభిమానుల్లో ఫుల్ జోష్ పెంచారు. నిన్న ఈ మూవీ నుంచి ‘కుర్చి మడత పెట్టి’ ఫుల్ సాంగ్ వీడియో రిలీజ్ అయ్యింది.

గుంటూరు కారం నుంచి తాజాగా యూత్ ఫుల్ మెలోడీ అయిన‘ఓ మై బేబీ’ఫుల్ సాంగ్ వీడియోని విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ పాటలో మహేష్ బాబు, శ్రీలీలపై చక్కటి విజువల్స్ తో అద్భుతంగా తెరకెక్కించారు. నిన్న రిలీజ్ అయిన ‘కుర్చీ మడత పెట్టి’సాంగ్ కి 40 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.230 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, రావు రమేష్, జయరాం, మురళీకృష్ణ, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. హారిక అండ్ హసన్ క్రియేషన్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetCasibomgrandpashabetJojobet Girişbigbossgrandpashabet