iDreamPost
android-app
ios-app

వెంకీ త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇదే

  • Published Dec 06, 2025 | 5:00 PM Updated Updated Dec 06, 2025 | 5:00 PM

టాలీవుడ్ లో కొన్ని స్పెషల్ కాంబినేషన్స్ ఉంటాయి. ఆ హీరో ఆ దర్శకుడు కలిసి సినిమా తీస్తున్నారంటే ఇక కచ్చితంగా బొమ్మ బ్లాక్ బస్టర్ అని అందరి మైండ్స్ లో స్ట్రాంగ్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ ఎప్పుడెప్పుడు వాళ్ళా కాంబినేషన్ లో సినిమా వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి ఎన్నో కాంబినేషన్స్ లో మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్ వెంకటేష్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ ది ఒకటి.

టాలీవుడ్ లో కొన్ని స్పెషల్ కాంబినేషన్స్ ఉంటాయి. ఆ హీరో ఆ దర్శకుడు కలిసి సినిమా తీస్తున్నారంటే ఇక కచ్చితంగా బొమ్మ బ్లాక్ బస్టర్ అని అందరి మైండ్స్ లో స్ట్రాంగ్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ ఎప్పుడెప్పుడు వాళ్ళా కాంబినేషన్ లో సినిమా వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి ఎన్నో కాంబినేషన్స్ లో మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్ వెంకటేష్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ ది ఒకటి.

  • Published Dec 06, 2025 | 5:00 PMUpdated Dec 06, 2025 | 5:00 PM
వెంకీ త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇదే

టాలీవుడ్ లో కొన్ని స్పెషల్ కాంబినేషన్స్ ఉంటాయి. ఆ హీరో ఆ దర్శకుడు కలిసి సినిమా తీస్తున్నారంటే ఇక కచ్చితంగా బొమ్మ బ్లాక్ బస్టర్ అని అందరి మైండ్స్ లో స్ట్రాంగ్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ ఎప్పుడెప్పుడు వాళ్ళా కాంబినేషన్ లో సినిమా వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి ఎన్నో కాంబినేషన్స్ లో మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్ వెంకటేష్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ ది ఒకటి. ఆల్రెడీ వెంకటేష్ ప్రస్తుతం మన శంకర వర ప్రసాద్ లో క్యామియో చేస్తున్నారు. అలాగే వెంకీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ ఉంటుందని కూడా అనౌన్స్ చేసేసారు. ఒకసారి వెంకటేష్ ఫ్రీ అయ్యాక ఫోటోషూట్ కంప్లీట్ చేసుకుని ఫస్ట్ లుక్ ను రివీల్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు రెండు మంచి టైటిల్స్ వినిపిస్తున్నాయి. మొదటిది ‘బంధుమిత్రుల అభినందనలతో’ , రెండోది ‘వెంకటరమణ కేరాఫ్ ఆనందనిలయం’. ఈ రెండు టైటిల్స్ రిజర్వ్ చేసి ఉంచారట. త్వరలోనే టీం మొత్తం డిస్కస్ చేసి ఓ టైటిల్ ను ఫిక్స్ చేయనున్నారట. ఆరు నెలల్లో ఈ సినిమాను కంప్లీట్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారట త్రివిక్రమ్. ఎందుకంటే ఆ తర్వాత త్రివిక్రమ్ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్స్ గురించి తెలియనిది కాదు. ఇటు వెంకటేష్ కూడా దృశ్యం 3 లాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. సో ఇద్దరికీ ఉన్న టైం లోనే సినిమాకు కంప్లీట్ చేసేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట.

ఫ్యామిలీ ఆడియన్స్ కు వెంకటేష్ సినిమాలంటే ఎంత ఇష్టమో తెలియనిది కాదు. అలాంటిది ఇప్పుడు ఈ హిట్ కాంబో రిపీట్ అవుతుంది అంటే అందరు ఎగ్జైటెడ్ గానే ఉన్నారు. ఇక ఈసారి త్రివిక్రమ్ ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తారా లేదా అనేది చూడాలి. అంతా బాగానే ఉంటె మరో హిట్ కన్ఫర్మ్. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.