iDreamPost
android-app
ios-app

సినీ పెద్దలు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని కూడా విచారించాలి: పూనమ్ కౌర్!

  • Published Sep 17, 2024 | 6:05 PM Updated Updated Sep 17, 2024 | 6:05 PM

Poonam Kaur About Director Trivikram: ప్రస్తుతం మీడియా సోషల్ మీడియాలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పలువురు సెలెబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటె తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది నటి పూనమ్ కౌర్.

Poonam Kaur About Director Trivikram: ప్రస్తుతం మీడియా సోషల్ మీడియాలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పలువురు సెలెబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటె తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది నటి పూనమ్ కౌర్.

  • Published Sep 17, 2024 | 6:05 PMUpdated Sep 17, 2024 | 6:05 PM
సినీ పెద్దలు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని కూడా విచారించాలి: పూనమ్ కౌర్!

ప్రస్తుతం మీడియా , సోషల్ మీడియాలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదంపై పలువురు సెలెబ్రిటీలు కూడా స్పందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో జానీని మాస్టర్ అని పిలవద్దు.. అలా పిలవాలంటే కనీస గౌరవం ఉండాలంటూ.. చెప్పుకొచ్చింది నటి పూనమ్ కౌర్. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ వివాదం మళ్ళీ తెరపైకి తీసుకొచ్చింది. త్రివిక్రమ్ పై తానూ ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్నారా.. అంటూ మా అసోసియేషన్ ను ప్రశ్నిస్తూ ట్వీట్ చేసింది పూనమ్. గతంలో తానూ డైరెక్టర్ త్రివిక్రమ్ పై మా అసోసియేషన్ లో ఉన్న పెద్ద వాళ్లకు కంప్లైంట్ చేసినట్లు.. కనీసం ఇప్పుడైనా ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయంపై చర్యలు తీసుకోవాలంటూ పోస్ట్ చేసింది. తెలుగు శాటిలైట్ ఛానెల్స్ అయిన టీవీ9, ఎన్టీవీ వంటి సంస్థలు కూడా పూనమ్ ట్వీట్ పై కథనాలను ప్రసారం చేయడంతో ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అయ్యింది.

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ టాపిక్ హాట్ హాట్ గా ఉండగా.. సరిగ్గా ఇప్పుడే పూనమ్ త్రివిక్రమ్ విషయంలో మరోసారి ఫైర్ అవుతూ ట్వీట్ చేసింది. టాలీవుడ్ పెద్దలకు గతంలో ఇచ్చిన కంప్లైంట్ పై.. ఇప్పుడు త్రివిక్రమ్ ను ప్రశించాలని.. కోరుతున్నట్లుగా చెప్పుకొచ్చింది. అయితే , అదే ట్వీట్ లో పొలిటికల్ సఫరింగ్ అంటూ కూడా ఎదో రాసుకొచ్చింది. కానీ , సరిగా అది ఏ అంశానికి సంబంధించిన విషయం అనే దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. కేవలం మా అసోసియేషన్ పెద్దలు త్రివిక్రమ్ ను విచారించాలని చెప్పుకొచ్చింది. సరిగ్గా జానీ మాస్టర్ గురించి పోస్ట్ పెట్టిన… కొద్దీ గంటల్లోనే ఈ పోస్ట్ కూడా పెట్టడంతో.. ప్రస్తుతం ఈ ట్వీట్ అనేక ప్రశ్నలకు దారితీస్తుంది.

గతంలో కూడా నటి పూనమ్ కౌర్.. త్రివిక్రమ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. త్రివిక్రమ్ ఎలాంటి వారో.. ఆయన స్వభావం ఏంటో తనకు తెలుసనీ, మగవారి ఇగో కోసం ఆయన సపోర్ట్ చేస్తారని.. ఇతరుల జీవితాలను త్రివిక్రమ్ నాశనం చేస్తారంటూ పూనమ్ ఫైర్ అయింది. అప్పట్లో ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కలకలం రేపాయి. పెద్ద పెద్ద మీడియా ఛానెల్స్ కూడా ఈ న్యూస్ ను కవర్ చేశాయి. కానీ కొన్నాళ్ళకు అంతా సైలెంట్ అయిపోయారు. మరి.. పూనమ్ తాజా ట్వీట్ తో అంశాలు తెరపైకి వస్తాయో, .. ఎలాంటి వారిని కదిలిస్తుందో.. కనీసం ఇప్పుడైనా పూనమ్ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో పూనమ్ త్రివిక్రమ్ పై చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet