iDreamPost
android-app
ios-app

Mahesh Babu-Guntur Kaaram: సినిమాపై నెగిటివిటీని మహేశ్ ఎలా పోగొట్టాడు! మ్యాజిక్ చేశాడు!

  • Published Jan 17, 2024 | 8:07 PM Updated Updated Jan 17, 2024 | 8:07 PM

ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచే ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది గుంటూరు కారం మువీ. ఎక్కడో ఉంటుందనుకున్న సినిమా ఇప్పుడు రికార్డులు క్రియేట్‌ చేస్తుంది. ఇదంతా మహేష్‌ మ్యాజిక్‌ అంటున్నారు. ఎలా అంటే..

ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచే ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది గుంటూరు కారం మువీ. ఎక్కడో ఉంటుందనుకున్న సినిమా ఇప్పుడు రికార్డులు క్రియేట్‌ చేస్తుంది. ఇదంతా మహేష్‌ మ్యాజిక్‌ అంటున్నారు. ఎలా అంటే..

  • Published Jan 17, 2024 | 8:07 PMUpdated Jan 17, 2024 | 8:07 PM
Mahesh Babu-Guntur Kaaram: సినిమాపై నెగిటివిటీని మహేశ్ ఎలా పోగొట్టాడు! మ్యాజిక్ చేశాడు!

సంక్రాంతి అంటేనే స్టార్‌ హీరోల సినిమాలు కచ్చితంగా ప్రేక్షకులను పలకరిస్తాయి. అలానే ఈ సారి పొంగల్‌కి ముగ్గురు స్టార్‌ హీరోల సినిమాలు, తేజ సజ్జా అనే యంగ్‌ హీరో సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద తలపడ్డాయి. నాలుగు సినిమాలు రిలీజ్‌ అని ప్రకటించినా.. వీటిల్లో అన్నింటికన్నా ఎక్కువ క్రేజ్‌ సంపాదించుకున్న సినిమా మహేష్‌ బాబు-త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన గుంటూరు కారం మూవీ. విడుదలకు ముందు నుంచే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్‌, పాటలు వాటిని మరింత పెంచాయి. ఇక ఇన్నీ భారీ అంచానాల మధ్య విడుదలైన ఈ సినిమా.. వాటిని తలకిందులు చేస్తూ.. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచే డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది.

సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రమే కాక.. రివ్యూవర్స్‌ సైతం గుంటూరు కారం భారీ డిజాస్టర్‌ అని తేల్చేశారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు.. ఇదేం సినిమా.. పాత స్టోరీనే మళ్లీ తీశారు అని కామెంట్స్‌ చేశారు. కొందరైతే బ్రహ్మోత్సవం, అజ్ఞాతవాసి వంటి ఫ్లాప్‌ సినిమాలతో పోల్చారు. సోషల్‌ మీడియాలో కూడా సినిమా మీద విపరీతైమన ట్రోల్స్‌ వచ్చాయి. మహేష్‌ కెరీర్‌లోనే ఇంత నెగిటివిటీని మూటగట్టకున్న సినిమా మరోటి లేదంటే అతిశయోక్తి కాదు.

ఇక పబ్లిక్‌ టాక్‌, రివ్యూలు చూసిన ప్రతి ఒక్కరు.. గుంటూరు కారం సినిమా భారీ డిజాస్టర్‌ అని తేల్చేశారు. దాంతో ఈ సినిమా ఎక్కడో ఆగిపోతుంది అని అంతా భావించారు. నెగిటివిటీ టాక్‌ చూసి బయ్యర్లు భయపడ్డారు. కట్‌ చేస్తే.. ఇప్పుడు గుంటూరు కారం కలెక్షన్ల విషయంలో రికార్డులు సృష్టిస్తోంది. ఐదు రోజుల వ్యవధిలోనే కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తోంది.

అట్టర్‌ ఫ్లాప్‌ అనుకున్న గుంటూరు కారం సినిమా ఇప్పుడు క్రియేట్‌ చేస్తోన్న సరికొత్త రికార్డులకు ప్రధాన కారణం ఈ సినిమా హీరో, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు. సినిమాపై వచ్చిన భారీ నెగిటివిటీని పొగొట్టి.. కలెక్షన్ల సునామీ సృష్టించడానికి కారణం మహేష్‌ బాబు క్రేజే కారణం అంటున్నారు ఇండస్ట్రీ నిపుణులు. ఆయనకున్న క్రేజ్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌ వంటి అంశాలు గుంటూరు కారం సినిమాను నిలబెట్టాయి. సినిమాలో వన్‌ మ్యాన్‌ షో చేసిన మహేష్‌ బాబు.. రిజల్ట్‌ విషయంలో కూడా అలానే తన మేనియా చూపించాడు.

మహేష్‌ బాబు అంటేనే. వివాదాలకు దూరంగా ఉంటాడు.. తన పనేదో తాను చేసుకుని పోతాడు. ఎవరి గురించి తప్పుగా, తక్కువ చేసి మాట్లాడిన దాఖలాలు లేవు. సూపర్‌ స్టార్‌ అయినా సరే ఎంతో సింపుల్‌గా ఉంటాడు. ఈ లక్షణాలన్నింటి వల్లే.. అందరూ హీరోల అభిమానులకు మహేష్‌ బాబు అంటే ఇష్టం. ఈ క్రేజ్‌ కారణంగానే గుంటూరు కారం సినిమా మీద భారీ ఎత్తున నెగిటివిటీ వచ్చినా సరే.. కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్‌ చేస్తోంది అంటున్నారు. మరి దీనితో మీరే ఏకీభవిస్తారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet