iDreamPost
android-app
ios-app

Mahesh Babu: ‘గుంటూరు కారం’ కోసం స్పెషల్ బీడీ.. సీక్రెట్ బయటపెట్టిన మహేష్!

  • Published Jan 16, 2024 | 2:42 PM Updated Updated Jan 16, 2024 | 5:08 PM

గుంటూరు కారం మూవీలో మహేష్ తాను తాగిన బీడీలకు సంబంధించి.. ఎవ్వరికీ తెలియని సీక్రెట్ ను రివీల్ చేశాడు. ఆ బీడీలను స్పెషల్ గా తయ్యారు చేయించామని చెప్పుకొచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

గుంటూరు కారం మూవీలో మహేష్ తాను తాగిన బీడీలకు సంబంధించి.. ఎవ్వరికీ తెలియని సీక్రెట్ ను రివీల్ చేశాడు. ఆ బీడీలను స్పెషల్ గా తయ్యారు చేయించామని చెప్పుకొచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Jan 16, 2024 | 2:42 PMUpdated Jan 16, 2024 | 5:08 PM
Mahesh Babu: ‘గుంటూరు కారం’ కోసం స్పెషల్ బీడీ.. సీక్రెట్ బయటపెట్టిన మహేష్!

ఓ సినిమాలో పాత్ర పండాలి అంటే అందుకోసం నటీ, నటులు ఎంత దూరమైనా, ఎంత కష్టమైనా పడతారు. తెరమీద ప్రేక్షకులకు నేచురల్ గా కనిపించాలన్నది సదరు నటీ, నటులు తాపత్రయం. అయితే ఇందుకోసం కొన్ని అలవాటు లేని అలవాట్లను సైతం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే? తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇక ఈ మూవీలో మహేష్ ఎక్కువగా బీడీ కాల్చుతూ కనిపిస్తాడు. అయితే స్మోకింగ్ అలవాటే లేని మహేష్ ఇన్ని బీడీలు ఎలా కాల్చాడు అన్నదే అందరికి వచ్చిన సందేహం. అయితే ఆ బీడీలకు సంబంధించిన సీక్రెట్ ను బయటపెట్టాడు సూపర్ స్టార్. ఈ సినిమా కోసం స్పెషల్ గా వాటిని తయ్యారు చేయించారని, వాటిల్లో పోగాకు ఉండదని షాకింగ్ విషయాలు వెల్లడించాడు.

‘గుంటూరు కారం’ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కింది ఈ చిత్రం. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ భారీ వసూళ్లతో దుమ్మురేపుతోంది. తొలిరోజు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. తర్వాత రోజును టాక్ మారి సక్సెస్ ట్రాక్ ఎక్కింది. దీంతో మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ. 164 కోట్ల రూపాయాలను వసూల్ చేసిందని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. మహేష్ వన్ మ్యాన్ షోతో గుంటూరు కారాన్ని ఘాటెక్కించాడు. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు మహేష్ బాబు, శ్రీలీల. యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరించిన ఈ ఇంటర్వ్యూలో గుంటూరు కారం సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను రివీల్ చేశారు మహేష్. అందులో ఒకటి బీడీ గురించి. అవును మహేష్ ఈ మూవీలో ఎక్కువగా బీడీ తాగుతూ కనిపించిన విషయం తెలిసిందే.

ఇక ఇదే విషయాన్ని సుమ అడగ్గా.. మహేష్ సమాధానం ఇస్తూ..”నాకు స్మోకింగ్ అలవాటు లేదు. పైగా నేను స్మోకింగ్ ను ఎంకరేజ్ చేయను. ఇక ఈ మూవీలో తొలిరోజే నిజమైన బీడీ తెచ్చి ఇచ్చారు. అది కాల్చడంతో విపరీతమైన మైగ్రేన్ తలనొప్పి వచ్చేసింది. దీంతో నా వల్ల కాదు త్రివిక్రమ్ గారు అని చెప్పగానే. అందరూ ఆలోచించగా.. సెట్లో వాళ్లు స్పెషల్ బీడీని తెచ్చి ఇచ్చారు. ఆ బీడీ పూర్తిగా ఆయుర్వేదంతో తయ్యారు చేసింది. లవంగం ఆకులతో దాన్ని తయ్యారు చేశారు. అందులో పొగాకు లేదు. పూర్తిగా ఆయుర్వేదానికి సంబంధించిన బీడీ అది” అంటూ స్పెషల్ బీడీకి సంబంధించిన సీక్రెట్ ను రివీల్ చేశారు సూపర్ స్టార్. పక్కనే ఉన్న హీరోయిన్ శ్రీలీల ఇది విని..”అలా వచ్చిన ఆయుర్వేద బీడీని మళ్లీ ప్యాకెట్ లో చుట్టిపెడతారు” అంటూ నవ్వులు చిందించింది. సో అదన్న మాట గుంటూరు కారం స్పెషల్ బీడీ కథ. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş