iDreamPost
android-app
ios-app

Allu Arjun-Trivikram: బన్నీ-త్రివిక్రమ్ ప్రాజెక్ట్​కు ముహూర్తం ఫిక్స్! జాన్వీ, అలియాల్లో ఒకరు హీరోయిన్!

  • Published Aug 07, 2024 | 6:00 AM Updated Updated Aug 07, 2024 | 6:00 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-స్టైలిష్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబో మూవీ కోసం ఆడియెన్స్​ ఎంతో ఈగర్​గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది? ఇందులో బన్నీ సరసన నటించే హీరోయిన్ ఎవరు? లాంటి వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. వాళ్లకు అదిరిపోయే న్యూస్.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-స్టైలిష్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబో మూవీ కోసం ఆడియెన్స్​ ఎంతో ఈగర్​గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది? ఇందులో బన్నీ సరసన నటించే హీరోయిన్ ఎవరు? లాంటి వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. వాళ్లకు అదిరిపోయే న్యూస్.

  • Published Aug 07, 2024 | 6:00 AMUpdated Aug 07, 2024 | 6:00 AM
Allu Arjun-Trivikram: బన్నీ-త్రివిక్రమ్ ప్రాజెక్ట్​కు ముహూర్తం ఫిక్స్! జాన్వీ, అలియాల్లో ఒకరు హీరోయిన్!

ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్​కు క్రేజ్ నెక్స్ట్ లెవల్​లో ఉంటుంది. కొందరు హీరోలు, దర్శకులు కలసి చేసే ప్రాజెక్టులకు భారీగా బజ్ నెలకొంటుంది. ఇంకొందరు హీరోలు, హీరోయిన్లు కలసి చేసే మూవీస్​ మీద అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. ఇలా కాంబినేషన్లలో వచ్చే చిత్రాలు ఆడియెన్స్​ను అలరించడం, బాక్సాఫీస్ వద్ద బిగ్ రేంజ్​లో కలెక్షన్స్ రాబడితే వాటిని మళ్లీ రిపీట్ చేయాలనే డిమాండ్లు పెరుగుతాయి. అలా తెలుగు నాట చూసుకుంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-స్టైలిష్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబో మూవీ కోసం ఆడియెన్స్​ ఎంతో ఈగర్​గా వెయిట్ చేస్తున్నారు. వీళ్లిద్దరి కలయికలో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురంలో’ లాంటి బ్లాక్​బస్టర్స్ వచ్చాయి. ఈ మూడు కూడా హిలేరియస్ ఎంటర్​టైనర్స్​గా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలు అయ్యాయి.

బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్​లో వచ్చే నాలుగో చిత్రం వాటికి మించిన రేంజ్​లో ఉండాలని అభిమానులు, ప్రేక్షకులు ఆశిస్తున్నారు. చాన్నాళ్లుగా వీరి కలయికలో చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇద్దరూ తమ కమిట్మెంట్స్​తో బిజీ అయిపోవడంతో కుదరలేదు. మొత్తానికి ఇప్పుడు దీనికి టైమ్ కుదిరింది. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో మూవీకి సంబంధించి క్రేజీ అప్​డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీళ్ల కాంబోలో నయా ఫిల్మ్​ ఓకే అయిందని, సెప్టెంబర్​లో కొబ్బరి కాయ కొడతారని తెలుస్తోంది. ఆల్రెడీ ముహూర్తం పెట్టేశారని.. వచ్చే నెలలో పూజా కార్యక్రమాలతో సినిమాను స్టార్ట్ చేసి ఆ తర్వాత రెగ్యులర్​ షూటింగ్​కు వెళ్తారని సమాచారం.

బన్నీ-త్రివిక్రమ్ మూవీకి హీరోయిన్​ను కూడా దాదాపుగా ఫైనలైజ్ చేశారని టాక్ నడుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ క్వీన్స్ జాన్వీ కపూర్, అలియా భట్​లో ఒకర్ని హీరోయిన్​ రోల్​కు తీసుకోనున్నారని పుకార్లు వస్తున్నాయి. జాన్వీ ఆల్రెడీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’తో టాలీవుడ్​లో ఎంట్రీకి సిద్ధమైపోయింది. జాన్వీకి ఇక్కడ మంచి క్రేజ్ ఉండటంతో ఆమె వైపే మూవీ టీమ్ మొగ్గు చూపిస్తోందని అంటున్నారు. అల్లు అర్జున్ పక్కన జాన్వీ బాగా సెట్ అవుతుందని, వాళ్లది క్యూట్ పెయిర్ అవుతుందని భావిస్తున్నారట. అయితే అలియా కూడా పోటీలోనే ఉందని, ఆమెకు ఛాన్స్ దక్కే అవకాశాల్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఏదేమైనా బన్నీ-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఓకే అవడం, త్వరలో షూటింగ్ మొదలవనుందనే న్యూస్ అభిమానుల్లో మాత్రం ఫుల్ జోష్ నింపింది. అయితే ఈ ప్రాజెక్ట్​పై అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఏదీ చెప్పలేం.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş