iDreamPost
android-app
ios-app

గుంటూరు కారంని వెంటాడుతున్న అవాంతరాలు! ఇప్పుడు సుమ రూపంలో!

  • Published Jan 06, 2024 | 9:49 AM Updated Updated Jan 09, 2024 | 6:16 PM

Disturbances on Guntur Kaaram Movie: తెలుగు ఇండస్ట్రీలో మాలట మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో గతంలొో అతడు, ఖలేజా మూవీలు వచ్చాయి. చాలా గ్యాప్ తర్వాత మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ గా ‘గుంటూరు కారం’ రాబోతుంది.

Disturbances on Guntur Kaaram Movie: తెలుగు ఇండస్ట్రీలో మాలట మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో గతంలొో అతడు, ఖలేజా మూవీలు వచ్చాయి. చాలా గ్యాప్ తర్వాత మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ గా ‘గుంటూరు కారం’ రాబోతుంది.

  • Published Jan 06, 2024 | 9:49 AMUpdated Jan 09, 2024 | 6:16 PM
గుంటూరు కారంని వెంటాడుతున్న అవాంతరాలు! ఇప్పుడు సుమ రూపంలో!

కొన్ని సినిమాల ప్రారంభ ముహూర్త విశేషాలు అనుకోవాలి మరి. ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక అవాంతరం వెంటాడుతూనే ఉంటుంది. అందుకు గుంటూరు కారం సినిమానే పెద్ద ఉదాహరణ. అసలీ సినిమా హీరో రేంజ్ ఏంటి, దర్శకుడి స్థాయి ఏంటి, బ్యానర్‌ అండ్‌ ప్రొడ్యూసర్‌ లెవెల్‌ ఏంటి….? ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో కొన్ని పెద్ద కాంబినేషన్‌లు గురించి చెప్పాలంటే గుంటూరు కారం టీం గురించి మొదటి వరసలోనే చెప్పాలి. వన్‌ ఆఫ్ ది బెస్ట్‌ అనమాట.  కానీ, మొదటనుంచి చూస్తే ఏదో ఒక ప్రాబ్లమ్‌ గుంటూరు కారం సినిమా కార్యక్రమాలను అడ్డుకుంటూనే ఉంది. రెండోది, మహేష్‌ బాబు కెరీర్‌లో ఇంతవరకూ ఎన్నడూ లేనంత రీతిలో సినిమా మీద అనేక విషయాలకు సంబంధించి ట్రోలింగ్‌ దారుణంగా జరిగింది. మహేష్‌ బాబుకి కథ నచ్చలేదని, అందుకే మళ్ళీ మరమ్మత్తులో పడ్డారని, తమన్‌ని మ్యూజిక్ డైరెక్టర్‌గా అసలు పెట్టడమే మహేష్‌కి నచ్చలేదని, కానీ దర్శకుడు త్రివిక్రమ్‌ అల వైకుంఠపురం సక్సెస్‌ని చూపించి ఒప్పించాడని ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అడుగడుగునా ఏదో అపశ్రుతి దొర్లుతున్నట్టుగా వార్తలు సోషల్‌ మీడియాలో చెలరేగిపోతూ వచ్చాయి.

ఇంతకన్నా ఇబ్బందికరమైన వ్యవహారం ఏంటంటే….మాస్‌ సాంగ్‌ రిలీజ్‌ చేసిన తర్వాత అదో పెద్ద రాద్దాంతంగా మారింది. మహేష్‌కి ఆ పాట నచ్చలేదని, షూటింగ్‌ నుంచి కూడా వెళ్ళిపోయాడని విపరీతంగా మాట్లాడుకున్నారు. అనేక ప్లాట్‌ఫార్మ్‌ల మీద రాశారు కూడా. ఇంక అంతకన్నా ప్రహసనం సరస్వతిపుత్ర రామజోగయ్య శాస్త్రి మహేష్‌ అభిమానుల మీద నోరు పారేసుకోవడం. దానికి వాళ్ళు గట్టిగా ప్రతిఘటించడం. తారస్థాయి చెప్పాలంటే నిర్మాత నాగవంశీ యానిమల్‌ సినిమా షాట్‌ క్లిప్‌ని అభిమానులనుద్దేశించి పోస్ట్ చేశారని ఆయన మీద అభిమానులు విరుచుకుపడడం….ఇదంతా మహేష్‌ బాబు ఉండే సాఫ్ట్ ఇమేజ్‌కి పూర్తిగా విరుద్ధమైన విషయం. కానీ ఎవ్వరూ ఏదీ ఆపలేకపోయారు. సరికదా మరికొంత ఆజ్యం పోశారన్నట్టుగా తయారైంది. ఇప్పుడు క్లైమాక్స్ మరీ బాధాకరం. యూసఫ్‌గూడా పోలీస్‌ గ్రౌండ్‌లో ఈరోజు అంటే జనవరి 6న ప్లాన్‌ చేసిన గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి పోలీసు నుంచి పర్మిషన్లు రాకపోవడం. ఏ కంపెనీ అయితే ఈ ఈవెంట్‌ చేయవలసి ఉందో ఆ కంపెనీ గతంలో చేసిన రచ్చవల్ల ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి పర్మిషన్లు గల్లంతయ్యాయి. తుంటిమీద కొడితే పళ్ళు రాలాయంటే ఇదే.  దాంతో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయ్యింది. త్వరలోనే కొత్త తేదీని అనౌన్స్ చేయనుంది చిత్ర బృందం.

guntur kaaram mahesh

ఈవెంట్ రద్దు కావడం మాత్రమే కాక.. యాంకర్ కూడా మారిందని టాక్. గుంటూరు కారం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి సుమ యాంకర్ గా అంగీకరించారు. కానీ ఇప్పుడది పోస్ట్ పోన్ అయ్యింది. మరో 2,3 రోజుల్లో ప్రీ రిలిజ్ ఈవెంట్ ఉంటుంది అంటున్నారు. కానీ అప్పటికి సుమ బిజీగా ఉండటంతో.. యాంకర్ కూడా మారనుంది. దీనిపై మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. ఎక్కడ మహేష్‌ బాబు..ఎవరా ఈవెంట్‌ కంపెనీ? పర్మిషన్లకి ఎప్పుడెళ్ళారు…అంతా అస్తవ్యస్తం. ముందస్తుగా పర్మిషన్లు కోసం ఆర్జీ పెట్టుకుని ఉంటే అన్నీ ముందుగానే తేలిపోయి ఉండేవి. అది జరగలేదు. మహేష్‌ బాబులాటి సూపర్‌ స్టార్ విషయంలో జరగాల్సిన తప్పిదమేనా ఇది అని నెటిజన్లు అప్పుడే విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టేశారు. నిజమే కదా. అభిమానులు తెల్లవారేసరికి ఈ వార్తకి గొల్లుమన్నారు. ఇప్పుడు కొత్త జాగాలను వెతుక్కునే పనిలో పడ్డారు. కట్టిన ఫ్లెక్సీలు, వినయల్స్…పబ్లిసిటీ మెటీరియల్‌ అంతటినీ హుటాహుటిన కొత్త స్థలానికి తరలించాలి. ఏదో ఒకటి దొరికితే చాల్రా బాబు…బ్రతుకు జీవుడా అన్నట్టు అయిపోయింది పరిస్థితి. గుంటూరు కారం టైటిల్‌ ఎఫెక్టేనా ఇది అనుకుంటున్నారంతా. కారం ఘాటు మామ్మూలుగా లేదుగా.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet