మురారి సినిమాలో మహేష్ బాబు ఫ్యామిలీకి ఏదో శాపం పెట్టినట్టు డీజే టిల్లుకి హీరోయిన్ దొరకడమే పెద్ద సవాల్ గా మారుతోంది. ఒకరు రావడం మళ్ళీ మారడం తీరా చూస్తే వాళ్ళూ వెళ్లిపోవడం ఇదో నిత్య కృత్యంగా మారిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తక్కువ అంచనాలతో రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న డీజే టిల్లుకి దాన్ని మించిన సీక్వెల్ తీయాలనే సంకల్పంతో ఉన్నాడు హీరో సిద్దు జొన్నలగడ్డ. దానికోసమే రాజీపడకుండా ఏకంగా దర్శకుడిని కూడా మార్చుకున్నారు. […]