iDreamPost
android-app
ios-app

Tillu Square: టిల్లు స్క్వేర్ 3వ రోజు కలెక్షన్స్.. సెంచరీ దిశగా దూసుకుపోతున్న సిద్ధు

  • Published Apr 01, 2024 | 10:33 AM Updated Updated Apr 01, 2024 | 11:29 AM

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోంది. మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోంది. మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..

  • Published Apr 01, 2024 | 10:33 AMUpdated Apr 01, 2024 | 11:29 AM
Tillu Square: టిల్లు స్క్వేర్ 3వ రోజు కలెక్షన్స్.. సెంచరీ దిశగా దూసుకుపోతున్న సిద్ధు

‘డీజే టిల్లు’ మూవీతో భారీ హిట్ కొట్టిన సిద్దు జొన్నలగడ్డ ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ అనే సినిమాను చేశాడు. టీజర్, ట్రైలర్, పాటలతో సినిమా మీద భారీ అంచానలు పెంచారు మేకర్స్. ఇక శుక్రవారం నాడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ డే.. ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. తొలి రోజే 23 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేయగా.. డే 2 కలెక్షన్స్తో రెండు రోజుల్లోనే సినిమాకు పెట్టిన బడ్జెట్ ని వసూలు చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఆదివారం నాడు కూడా సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది. మరి ‘టిల్లు స్క్వేర్’ 3 రోజుల్లో ఎంత వసూలు చేసింది అంటే..

సూపర్ హిట్ మూవీ డీజే టిల్లుకి సీక్వెల్‌గా రూపొందిన ‘టిల్లు స్క్వేర్’ సినిమాకు ఆరంభం నుంచీ అదిరిపోయే స్పందన వస్తోంది. తొలి రెండు రోజుల్లో సుమారు 48 కోట్ల మేర వసూలు చేసిన టిల్లు స్క్వేర్ ఆదివారం నాడు కూడా అదరకొట్టింది. మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా వరల్డ్ వైడ్‌గా కూడా భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇలా మూడు రోజుల్లోనే రూ. 68.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సెంచరీ దిశగా దూసుకుపోతుంది టిల్లు స్క్వేర్.

Tillu Square 3rd Day Collections

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ రూపొందించిన చిత్రమే ‘టిల్లు స్క్వేర్’. ఈ మూవీలో అనుపమ హీరోయిన్‌గా నటించింది. ఇన్నాళ్లు డీసెంట్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన అనుపమ ఈ సినిమాలో లిప్ లాక్, రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చి పోయి నటించింది. ఈ జోడి కెమిస్ట్రీ ప్రేక్షకులను మెప్పించింది.

ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య టిల్లు స్క్వేర్ సినిమాను నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, థమన్ మ్యూజిక్ ఇచ్చారు. నేహా శెట్టి, ప్రిన్స్, మురళిధర్ కీలక పాత్రలు చేశారు. వన్ లైనర్ డైలాగ్స్, తన బాడీ లాంగ్వేజ్ తో సిద్ధు ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాకు మూడో పార్ట్ కూడా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. టిల్లు క్యూబ్ టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.