iDreamPost
android-app
ios-app

Siddu Jonnalagadda: టిల్లుగాడి ప్లానింగే వేరు.. పూర్తిగా పంథా మార్చేశాడుగా!

  • Published Apr 27, 2024 | 4:20 PM Updated Updated Apr 27, 2024 | 4:20 PM

టిల్లు స్క్వేర్ మూవీతో సూపర్ సక్సెస్ కొట్టాడు యంగ్ హీరో, స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ. అయితే ఈ చిత్రం తర్వాత తన ప్లానింగ్ ను పూర్తిగా మార్చేశాడు. అతడి నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చూస్తే.. షాక్ అవ్వాల్సిందే.

టిల్లు స్క్వేర్ మూవీతో సూపర్ సక్సెస్ కొట్టాడు యంగ్ హీరో, స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ. అయితే ఈ చిత్రం తర్వాత తన ప్లానింగ్ ను పూర్తిగా మార్చేశాడు. అతడి నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చూస్తే.. షాక్ అవ్వాల్సిందే.

  • Published Apr 27, 2024 | 4:20 PMUpdated Apr 27, 2024 | 4:20 PM
Siddu Jonnalagadda: టిల్లుగాడి ప్లానింగే వేరు.. పూర్తిగా పంథా మార్చేశాడుగా!

సిద్ధూ జొన్నలగడ్డ.. టిల్లు స్వ్కేర్ మూవీతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఈ మూవీతో రూ. 100 కోట్ల వసూళ్లను రాబట్టి తన స్టామినా ఏంటో మరోసారి పరిశ్రమకు తెలియజేశాడు. ఈ మూవీ కోసం రెండేళ్లు నిరీక్షించాడు సిద్ధూ. అందుకు తగ్గట్లుగానే ఫలితం వచ్చింది. అయితే ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఏ మూవీలు పడితే ఆ మూవీలు ఒప్పుకోవడం లేదు టిల్లుగాడు. కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అతడి నెక్ట్స్ ప్రాజెక్ట్ లు చూస్తే.. తన పంథా పూర్తిగా మార్చేశాడని స్పష్టంగా తెలుస్తుంది. ఇది తెలిసిన అభిమానులు టిల్లుగాడి ప్లానింగ్ నెక్ట్స్ లెవల్ అంటూ మెచ్చుకుంటున్నారు.

టిల్లు స్క్వేర్ మూవీతో సూపర్ సక్సెస్ కొట్టాడు యంగ్ హీరో, స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ. ఈ చిత్రం వంద కోట్లు కలెక్ట్ చేయడంతో.. అతడి నెక్ట్స్ ప్రాజెక్ట్ లపై భారీగా అంచనాలు పెరిగాయి. దీంతో సిద్ధూ సైతం కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. టిల్లు ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో ‘జాక్’, నీరజ కోనని దర్శకురాలిగా పరిచయం చేస్తూ ‘తెలుసు కదా’ అనే మూవీలు చేస్తున్నాడు. ఇక ఈ మూవీలతో పాటుగా టిల్లు క్యూబ్ స్క్రీప్ట్ పనులు కూడా పూర్తి కాగానే షూటింగ్ ప్రారంభిస్తారు. అయితే ఈ చిత్రానికి మ్యాడ్ మూవీ ఫేమ్ కళ్యాణ్ శంకర్ ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా.. పై చిత్రాలకంటే ముందే నందిని రెడ్డి దర్శకత్వంలో సిద్దూ ఓ మూవీ చేయాల్సి ఉంది. కథ కూడ ఓకే అయిపోయింది.. ఇక షూటింగ్ కు వెళ్దాం అనుకునే లోపల ఆమె దర్శకత్వం వహించిన ‘అన్నీ మంచిశకునములే’ ఫ్లాప్ కావడంతో.. ఈ క్రేజీ కాంబోకు బ్రేకులు పడ్డాయి. ఇదిలా ఉండగా.. కథల ఎంపిక విషయంలో టిల్లుగాడు చాలా కఠినంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి మెుహమాటం లేకుండా కథలను ఎంచుకుంటున్నాడు. అయితే ఇప్పటి వరకు తన మాడ్యూలేషన్, డైలాగ్ డెలివరీ, బాష, యాసతో అలరించిన టిల్లు.. జాక్ మూవీ కోసం పూర్తిగా మారిపోయాడు. ఫ్యామిలీ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించే బొమ్మరిల్లు భాస్కర్ టిల్లును చూపించే విధానం కూడా కొత్తగా ఉంటుందని టాక్. కానీ టిల్లు బ్రాండ్ పై భారీగా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న సిద్ధూ.. నెక్ట్స్ వచ్చే సినిమాల్లో పాత్రలతో మెప్పించాల్సిన బాధ్యత అతడిపై మోయలేనంతగా ఉంది. మరి కథల ఎంపికలో పూర్తిగా పంథా మార్చి వరుస మూవీలతో ముందుకు వెళ్తున్న సిద్ధూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomgrandpashabetşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet giriş