Krishna Kowshik
సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ థియేటర్లలో మాస్ రెస్పాన్స్ కూడగట్టుకున్న సంగతి విదితమే. రూ. 100 కోట్లను కలెక్ట్ చేసింది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్
సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ థియేటర్లలో మాస్ రెస్పాన్స్ కూడగట్టుకున్న సంగతి విదితమే. రూ. 100 కోట్లను కలెక్ట్ చేసింది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్
Krishna Kowshik
యంగ్ అండ్ టాలెంటెడ్ గయ్ సిద్దు జొన్నల గడ్డ మరో హిట్ అందుకున్నాడు. డీజె టిల్లుకు కొనసాగింపుగా వచ్చింది టిల్లు స్క్వేర్. అనుపమ పరమేశ్వరన్, నేహా శెట్టి క్యామియో అఫియరెన్స్‌తో రచ్చ లేపింది సినిమా. మార్చి 29న ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేసేసింది. చిన్న సినిమాగా వచ్చి ప్రభంజనం సృష్టించింది. తొమ్మిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టుకుంది. సితార ఎంటర్ టైన్ మెంట్, ఫార్చున్ ఫర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. రామ్ మిరియాల, అచ్చు రాజమణి అందించిన మ్యూజిక్‌కు మరోసారి ఊగిపోతున్నారు ఫ్యాన్స్. మాలిక్ రామ్ దర్శకత్వం వహించిన టిల్లు స్వ్కేర్ ఇప్పటికీ ధియేటర్లలో సందడి చేస్తుంది.
కాగా, ఈ సినిమా సక్సెస్ మీట్ ఇటీవల నిర్వహించారు. ఏప్రిల్ 8న హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ముఖ్య అతిధిగా జూనియర్ ఎన్టీఆర్, హీరో విశ్వక్ సేన్, దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే టిల్లు స్క్వేర్ చిత్ర యూనిట్ పాల్గొంది. జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ చూసి మెస్మరైజ్ అయిపోయారు ఫ్యాన్స్. తన మాటలతో ఈ షో వన్ మ్యాన్ షోలా క్రియేట్ చేశాడు. అది సిద్దు ఈవెంటా లేక తారక్ సక్సెస్ ఈవెంటా అనేంతలా మారిపోయింది. సక్సెస్ మీట్‌కు తారక్ వస్తున్నాడని తెలిసి.. భారీ ఎత్తున ఫ్యాన్స్ అక్కడకు చేరుకున్నారు. అసలు ఈ ఈవెంట్‌కు వచ్చిందే ఆయన్ను చూసేందుకు. కానీ కొంత మంది అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించి.. యంగ్ టైగర్‌కు, అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఇబ్బంది కలిగించారు. దీంతో ఎన్టీఆర్‌కు తృటిలో పెను ప్రమాదం నుండి
ఈవెంట్ ముగించుకుని బయటకు.. తన కారు వద్దకు వెళుతున్న తారక్, త్రివిక్రమ్‌లను తోసేశారు అభిమానులు. బౌన్సర్లు అడ్డుకుంటున్నప్పటికీ కూడా ఓ అభిమాని దూసుకుంటూ వచ్చి.. అతడి కాళ్లపై పడే ప్రయత్నం చేశాడు. దీంతో తారక్ పడబోయాడు. వెంటనే బౌన్సర్లు అడ్డుకున్నారు. భారీగా ఫ్యాన్స్ చేరుకోవడం, వీరిని కారులో ఎక్కించే ప్రయత్నంలో కాస్త అలజడి నెలకొంది. తోపులాట చోటుచేసుకుంది. దీంతో కాస్త ఉక్కిరి బిక్కరికి గురయ్యాడు కూడా తారక్. బౌన్సర్లు అలాగే అభిమానుల్ని అడ్డుకుంటూ కారు వద్దకు తీసుకెళ్లారు. దీంతో తృటిలో ప్రమాదం తప్పినట్లయ్యింది. జూనియర్ యంగ్ టైగర్‌ను తెరపై చూసి రెండేళ్లు కావడంతో అభిమానులు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. దీంతో ఆయన ఎక్కడ కనబడితే అక్కడ మూకుమ్మడిగా వచ్చి.. ఆయన్ను చుట్టుముట్టేస్తున్నారు. ఇక తారక్ నటిస్తోన్న దేవర అక్టోబర్ 10న విడుదల కానుంది.
Scary visuals of #JrNTR and #Trivikram getting mobbed by fans post #TilluSquare event. pic.twitter.com/Fxwv09NRMr
— Gulte (@GulteOfficial) April 10, 2024