iDreamPost
android-app
ios-app

దేవర మూవీపై తారక్ లీకులు.. కాలర్ ఎగరేసేలా చేస్తుంది అంటూ..

  • Published Apr 08, 2024 | 9:30 PM Updated Updated Apr 08, 2024 | 9:41 PM

Jr NTR- Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో దేవర సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలాగే దేవర ప్లాట్ కూడా రివీల్ చేశాడు.

Jr NTR- Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో దేవర సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలాగే దేవర ప్లాట్ కూడా రివీల్ చేశాడు.

  • Published Apr 08, 2024 | 9:30 PMUpdated Apr 08, 2024 | 9:41 PM
దేవర మూవీపై తారక్ లీకులు.. కాలర్ ఎగరేసేలా చేస్తుంది అంటూ..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం టిల్లు స్క్వేర్ మేనియా నడుస్తోంది. ఆఖరికి జూనియర్ ఎన్టీఆర్ కూడా టిల్లు మాయలో పడిపోయాడు. సక్కెస్ మీట్ కి రావడమే కాకుండా టిల్లు స్క్వేర్ గురించి, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ గురించి అద్బుతమైన కామెంట్స్ చేశాడు. అలాగే దేవర గురించి కూడా జూనియర్ ఎన్టీఆర్ కొన్ని లీకులు ఇచ్చాడు. ఇప్పుడు తారక్ స్పీచ్ విన్న తర్వాత ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. నెట్టింట మొత్తం తారక్ స్పీచ్ తెగ వైరల్ అవుతోంది. ఎప్పుడూ లేనిది రాబేయే సినిమా గురించి తారక్ లీక్స్ ఇవ్వడం మాత్రమే కాకుండా.. దేవర సినిమా కాలర్ ఎగరేసుకునేలా చేస్తుందంటూ చెప్పుకొచ్చాడు.

జూనియర్ ఎన్టీఆర్ టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా సిద్ధు జొన్నలగడ్డ సక్సెస్ గురించి, సిద్ధు పడే కష్టం గురించి తారక్ అద్భుతంగా చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో నిత్యం సినిమా గురించి ఆలోచిస్తే, ఏదో సాధించాలి అనే తపనతో ఉడే టెక్నీషియన్స్ లిస్ట్ లో సిద్ధు పేరు ఉంటుంది అంటూ తారక్ చెప్పుకొచ్చాడు. సిద్ధు ఇంకా ఇలాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు చేయాలని కోరుకున్నాడు. అలాగే టిల్లు క్యారెక్టర్ అనేది కేవలం సినిమా మాత్రమే కాదని.. అలాంటి ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేసినందుకు డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ టీమ్ కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాడు. టిల్లు స్క్వేర్ సినిమా చూస్తూ తాను ఇంక నేను నవ్వలేను బాబోయ్ అనేలా ఉంది అంటూ తారక్ చెప్పడంతో టిల్లు టీమ్ మొత్తం పడిన కష్టాన్ని మర్చిపోయి ఆనందం వ్యక్తం చేశారు.

ఇంక పనిలో పని తారక్ దేవర సినిమా గురించి కూడా కామెంట్స్ చేశాడు. సిద్ధు గురించి మాట్లాడుతూ దేవర సినిమా ప్లాట్ గురించి చెప్పాడు. దేవర సినిమాలో ఎక్కువ శాతం భయం ఉంటుంది అన్నాడు. అంటే మూవీలో మెయిన్ ప్లాట్ అంతా భయం బ్యాక్ డ్రాప్ లోనే తిరుగుతూ ఉంటుంది అన్నాడు. ఈ డైలాగ్ వినగానే అందరికీ గతంలో దేవర గురించి డైరెక్టర్ చేసిన కామెంట్స్ గుర్తొస్తున్నాయి. నిజంగానే తారక్ క్యారెక్టర్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది అని ఫిక్స్ అయిపోతున్నారు. దేవరలో ఉండే ఒక డైలాగ్ ప్రస్తావన తీసుకొచ్చాడు. కానీ, తారక్ డైలాగ్ మాత్రం చెప్పలేదు. కానీ, సినిమా గురించి మాత్రం నెక్ట్స్ లెవల్లో హైప్ క్రియేట్ చేశాడు.

తారక్ తన స్పీచ్ చివర్లో ఇంకో మాట కూడా చెప్పాడు. దేవర సినిమా చూశాక ఫ్యాన్స్ ఎలా ఫీలవుతారో చెప్పుకొచ్చాడు. “ఇతి కాస్త ఎక్కువ అయ్యింది అనుకోవద్దు. చొక్కా ఉంటుంది.. దానికి ఒక కాలర్ అనేది ఉంటుంది. మీరు దేవర సినిమా చూశాక కాలర్ ఎగరేసుకునేలా ఉంది అనుకుంటారు. కాస్త ఆలస్యం అయ్యిందని డీలా పడకండి. మీరు కాలర్ ఎగరేసుకునేలా సినిమాని తీస్తున్నాం” అంటూ తారక్ చెప్పుకొచ్చాడు. ఇంకేముంది ఈ స్పీచ్ విన్న తర్వాత తారక్ ఫ్యాన్స్ గాల్లో తేలుతున్నారు. ఇప్పటివరకు దేవర గురించి ఊహించుకున్న అన్నీ ఎలివేషన్స్ తారక్ మాటలతో నిజమైపోయాయి. అక్టోబర్ 10న థియేటర్లలో రచ్చ చేసేందుకు ఫ్యాన్స్ సిద్ధమైపోతున్నారు. దేవర గురించి తారక్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetavrupabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet