iDreamPost
android-app
ios-app

అనుపమకి అవమానం! దిగజారుతున్న సంస్కారానికి ఇది నిదర్శనం!

  • Published Apr 10, 2024 | 1:37 PM Updated Updated Apr 10, 2024 | 1:37 PM

Anupama Parameswaran Issue: ప్రస్తుతం సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నా.. మగవారి దురహంకారం ఇంకా కొనసాగుతూనే ఉంది. సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా ఇలాంటి అవమానాలు ఎదుర్కొంటున్నారు.

Anupama Parameswaran Issue: ప్రస్తుతం సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నా.. మగవారి దురహంకారం ఇంకా కొనసాగుతూనే ఉంది. సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా ఇలాంటి అవమానాలు ఎదుర్కొంటున్నారు.

అనుపమకి అవమానం! దిగజారుతున్న సంస్కారానికి ఇది నిదర్శనం!

నేటి సమాజంలో మగవారితో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు మగవారితో సమానంగా ముందుకు సాగుతున్నారు. విద్య, వైద్య, ఆరోగ్య, రాజకీయ, వ్యాపార రంగాల్లో తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు. దేశంలో మహిళలు ఎంతగా అభివృద్ది చెందుతున్నా.. కొన్ని విషయాల్లో మాత్రం మగవాళ్లు తమ నైజాన్ని చూపిస్తున్నారు. మహిళల పట్ల చిన్న చూపు చూస్తూ వారిని అవమానిస్తున్నారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అనుమపను కొంతమంది ఫ్యాన్స్ స్టేజ్ పైనే అవమానించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక హీరోయిన్ అని కాదు.. కనీసం ఓ ఆడబిడ్డకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకుండా తోటి కళాకారుల ముందు అవహేళన చేయడం దిగజారుతున్న సంస్కారానికి ఇది నిదర్శనం అని విమర్శలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

మార్చి 29న టిల్లు స్క్వేర్‌ రిలీజ్ అయి మంచి హిట్ టాక్ సంపాదించడమే కాదు.. వంద కోట్లు రాబట్టింది. ఈ చిత్ర యూనిట్ సెలబ్రెషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిలుగా విచ్చేశారు. ఈ సందర్భంగా అనుపమ స్టేజ్ పైకి వచ్చి మాట్లాడుండగా ఆడియన్స్ వొద్దూ..వొద్దూ.. అంటే కేకలు వేశారు. అది గమనించిన అనుమప వెళ్లిపోవాలా? అంటూ సైగ చేసింది. మాట్లవొచ్చా? వద్దా.. కనీసం రెండు నిమిషాలు, ఒక్క నిమిషం అంటూ ఆడియన్స్ ని అడింది. దానికి అదే సమాధానం రావడంతో సరే వెళ్లిపోతా అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఆ సమయంలో యాంకర్ సుమ కూడా ఆడియన్స్ కి సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు.. కానీ ఫలించలేదు.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Shame on Anupama

ఈ వీడియో పై కొంతమంది నెటిజన్లు స్పందిస్తూ.. ఇండస్ట్రీలో కెరీర్ ముందుకు సాగాలంటే ఎలాంటి పాత్రల్లో అయినా నటించాల్సి ఉంటుంది. గతంలో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించిన అనుపమ ‘టిల్లు స్క్వేర్‌ ’ కాస్త గ్లామర్ గా కనిపించి బోల్డ్ గా నటించింది. అంత మాత్రాన ఆమె మరీ అంత అశ్లీలంగా ఏమీ రెచ్చిపోలేదు. తన పాత్రకు తగ్గ న్యాయం చేసింది. గతంలో ఎంతోమంది నటీణులు అలాంటి పాత్రల్లో నటించారు. కానీ అనుపమనే టార్గెట్ చేసుకొని అలా స్టేజ్ పై అనుపను ఘోరంగా అవమానించడం సిగ్గుతో తలదించుకునే విషయం అంటున్నారు. హీరోయిన్ విషయం పక్కన పెడితే ఒక అడపిల్లను స్టేజ్ పై అలా అవమానించడం ఎంత వరకు న్యాయం? అంటున్నారు. తమ ఇంటి ఆడబిడ్డలకు అలాంటి అవమానం జరిగితే వారి మనసు ఎంత బాధపడుతుందో అన్న కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తించడం దిగజారుతున్న సంస్కారానికి ఇది నిదర్శనం అంటున్నారు. ఇది అనుపమకు జరిగిన అవమానం కాదు.. ఆడపిల్లల పట్ల సమాజంలో ఇంకా చిన్నచూపు ఉందని అనడానికి నిదర్శన అంటున్నారు.

మాలీవుడ్ లో ప్రేమమ్ చిత్రంతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన అనుపమ పరమేశ్వరన్. నితిన్ హీరోగా నటించిన ‘అఆ’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది. కెరీర్ బిగినింగ్ లో అనుపమ గ్లామర్ రోల్స్ కాకుండా పర్ఫామెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రల్లో నటించింది. దీంతో ఇండస్ట్రీలో మనుగడ కష్టంగా మారడంతో కాస్త గ్లామర్ డోస్ పెంచింది. ఇటీవల డీజే టిల్లుకు సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్‌ మూవీలో బోల్డ్ గా నటించింది. దీంతో అభిమానులు ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ లాంటి సెలబ్రెటీలు వేడుకలో అనుపమను ఇలా అవమానించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.