iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల సూపర్ క్రష్! ఈమెతో మాములుగా ఉండదు!

  • Published Mar 30, 2024 | 2:10 PM Updated Updated Mar 30, 2024 | 2:10 PM

కొంత మంది బ్యూటీస్ వెంటనే యూత్ గుండెల్లో స్థానం సంపాదిస్తున్నారు. ఇదిగో ఈ ఫోటోలో చిన్నారిలా. ఇప్పుడో స్టార్ హీరోయిన్, ఈమె కుర్రాలకు మామూలు క్రష్ కాదు.. మామూలుగా ఉండదు ఆమెతో.. ఎవరో చెప్పగలరా..?

కొంత మంది బ్యూటీస్ వెంటనే యూత్ గుండెల్లో స్థానం సంపాదిస్తున్నారు. ఇదిగో ఈ ఫోటోలో చిన్నారిలా. ఇప్పుడో స్టార్ హీరోయిన్, ఈమె కుర్రాలకు మామూలు క్రష్ కాదు.. మామూలుగా ఉండదు ఆమెతో.. ఎవరో చెప్పగలరా..?

  • Published Mar 30, 2024 | 2:10 PMUpdated Mar 30, 2024 | 2:10 PM
ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల సూపర్ క్రష్! ఈమెతో మాములుగా ఉండదు!

తెలుగు ఇండస్ట్రీలో కొత్త అందాలకు కొదవ లేదు. పాత నీరు కనుమరుగు అయిపోతుంది అనుకున్న సమయంలో న్యూ బ్యూటీస్ ఎంట్రీ ఇచ్చి.. తమ అందచందాలతో, పెర్ఫామెన్స్‌తో ప్రేక్షకుల మదిని దోచేడమే కాదూ గుడి కట్టుకునేలా చేస్తున్నారు. ప్రతి ఏడాది ఎంతో మంది అమ్మాయిలు పరిశ్రమలోకి అడుగుపెడుతూనే ఉన్నారు. కొంత మంది మాత్రమే నేమ్, ఫేమ్ దక్కుతుంది. అయితే కొత్త భామలను ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. ఆయన పరిచయం చేసిన చాలా మంది అమ్మాయిలు.. టాలీవుడ్‌లో దున్నేయడమే కాకుండా బాలీవుడ్‌లో సత్తా చాటారు. రేణు దేశాయ్ నుండి కేతిక శర్మ వరకు ఎంతో మంది ముద్దుగుమ్మలు ఆయన చేతుల మీదుగానే హీరోయిన్‌గా తెరంగేట్రం ఇచ్చారు . ఇదిగో ఈ ఫోటోలో చిన్నారి కూడా ఆ జాబితాలో వస్తుంది.

పూరి జగన్నాథ్ సినిమాతో తెలుగు నాట అడుగుపెట్టిన ఈ చిన్నది.. ఇప్పుడు కుర్రాళ్ల గుండెల్లో మోత మోగించేస్తుంది. ఆమెతో వ్యవహారం మామూలుగా ఉండదు. ఇంతకు ఆమె ఎవరో గుర్తు పట్టారా..? తెలుగులో పట్టుమని పది సినిమాలు కూడా చేయలేదు కానీ.. ఆమె పేరు చెబితే.. యూత్‌కు హడల్ మాత్రమే కాదు, ఏ మూలనో ఓ క్రష్ కూడా. తల్లి డాక్టర్, తండ్రి బిజినెస్ మాన్ కానీ.. తను కొత్త రంగాన్ని ఎంచుకుని మనల్ని ఎంటర్ టైన్ చేస్తుంది ఈ సోయగం. మోడల్‌గా కెరీర్ స్టార్ చేసి.. అందాల పోటీలకు వెళ్లి.. టైటిల్ జస్ట్ మిస్సయ్యింది. అయితేనేం తెలుగు నాట అంతకంటే ఎక్కువ మంది హృదయాలను కొల్లగొట్టింది. ఇంతకు ఈ క్యూట్ లిటిల్ గర్ల్ ఎవరంటే..రాధిక అలియాస్ నేహా శెట్టి. టిల్లులో సిద్దు జొన్నలగడ్డను మోసం చేసి.. చిర స్థాయిలో ఆ పేరు తలచుకుంటేనే వణుకు వచ్చేలా చేసింది.

రియల్ లైఫ్‌లో ఎవరైనా అమ్మాయి మోసం చేస్తే ఆమె పేరు ఏదైనా కానీ.. ఆమె రాధికనే. అంతలా ఆమె పేరు ముద్రించేసుకున్నారు తెలుగు కుర్రాళ్లు. ఈమె కూడా కన్నడ కస్తూరీయే. 2015లో మిస్ సౌత్ ఇండియా రన్నరప్‌గా ఎన్నికైంది. ఆ తర్వాత ఓ కన్నడ చిత్రంలో నటించగా.. మంచి మార్కులే పడ్డాయి. వెంటనే పూరీ కళ్లల్లో పడింది. కొడుకుతో చేస్తున్న మెహబూబా చిత్రానికి ఆమె ఎంపిక కావడం.. టీటౌన్‌కు పరిచయం కావడం చకచకా జరిగిపోయాయి. అమ్మడులో మస్త్ టాలెంట్ ఉంది. వెంటనే తెలుగు నేర్చేసుకుంది. ఆరు నెలలు గ్యాప్ తీసుకుని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ కోర్స్ తీసుకుంది. మూడేళ్లు గ్యాప్ ఇచ్చి సందీప్ కిషన్ గల్లీ రౌడీ చిత్రంలో మెరిసిందీ బ్యూటీ. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ చిత్రంలో చిన్న క్యారెక్టర్ చేసింది. కానీ ఆమెను ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ ను చేసింది మాత్రం డిజే టిల్లు.

2022లో విడుదలైన ఈ చిత్రంతో ఆమె రాధికగా ఇంప్రెస్ చేసింది. సిద్దుకు పోటీగా మెప్పించింది అనడంలో ఎటువంటి సంకోచం అవసరం లేదు. ఆ తర్వాత బెదురులంక, రూల్స్ ఆప్ రంజన్ చిత్రాల్లో యాక్ట్ చేసినా.. రాధిక పాత్ర అంత గుర్తింపు రాలేదు. తాజాగా టిల్లు స్క్వేర్ మూవీలో గెస్ట్ రోల్ చేసి అదరగొట్టింది. ఈ సినిమాలో ఆమె ఎంట్రీ ఇస్తుంటే థియేటర్స్ విజిల్స్, అరుపులు, కేకలు వేస్తున్నారు ఫ్యాన్స్. మళ్లీ అదే అందంతో మెస్మరైజ్ చేసేసింది ఈ చందనపు భామ. అలాగే విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. పలుమార్లు వాయిదా పడ్డా.. మే 17న థియేటర్లలో ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తోంది. మరీ ఈ సినిమాతో అయినా ఈ రాధిక.. ఆ ముద్రను పోగోట్టుకుంటుందేమో చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş