iDreamPost
android-app
ios-app

టిల్లు స్క్వేర్ డే4 కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే

  • Published Apr 02, 2024 | 12:21 PM Updated Updated Apr 14, 2024 | 4:43 PM

Tillu Square: దేశవ్యాప్తంగా సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్వ్కేర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కాగా, ఈ సినిమా థియేటర్లలో విడుదలైన రెండు రోజుల వ్యవధిలోనే పెట్టిన బడ్జెట్ ని వసూలు చేసి సరికొత్త రికార్డ ను క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమా నాలుగవ రోజు ఎంత కలెక్షన్స్ రాబెట్టిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Tillu Square: దేశవ్యాప్తంగా సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్వ్కేర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కాగా, ఈ సినిమా థియేటర్లలో విడుదలైన రెండు రోజుల వ్యవధిలోనే పెట్టిన బడ్జెట్ ని వసూలు చేసి సరికొత్త రికార్డ ను క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమా నాలుగవ రోజు ఎంత కలెక్షన్స్ రాబెట్టిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

  • Published Apr 02, 2024 | 12:21 PMUpdated Apr 14, 2024 | 4:43 PM
టిల్లు స్క్వేర్ డే4 కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధ జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్న సిద్ధూ లేటెస్ట్ గా ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశాడు. కాగా, ఈ సినిమాకు మొదటిరోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ రావడంతో పాటు.. ప్రేక్షకుల్లో భారీ రెస్పాన్స్ లభిస్తుంది. కాగా, టిల్లు స్క్వేర్ సినిమాతో.. సిద్ధూకి మరో హిట్ ఖాతాలో పడిందనే చెప్పవచ్చు. ఇక ఈ మూవీకి థియేటర్లలో విడుదలైన నుంచి కలెక్షన్స్ పరంగా దుమ్ము రేపుతుంది. ఈ క్రమంలోనే.. తొలిరోజే ఈ సినిమా రూ. 23 కోట్లకు పైగా వసూలు చేయగా.. డే 2 లో ఆ కలెక్షన్స్ మరింత రికార్డును బ్రేక్ చేసాయి. ఇక డే3 కలెక్షన్స్ విషయానికొస్తే.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా భారీగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. దాదాపు ఈ మూడు రోజులా వ్యవధిలో.. రూ.68.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సెంచరీ దిశగా దూసుకుపోతుంది. మరి, టిల్లు స్క్వేర్ డే4 కలెక్షన్స్ ఎంత వసూలు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ఎక్కడ చూసిన టిల్లు స్క్వేర్ సినిమా హవానే నడుస్తుంది. అంతలా ప్రేక్షకుల ఆదారణ పొందిన టిల్లు స్క్వేర్ తొలి 3 రోజుల్లో పెట్టిన బడ్జెట్ ని వసూలు చేసి మరో సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇక డే4 అనగా సోమవారం నాటికి టిల్లు స్క్వేర్ సినిమా రూ. 78 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ క్రమంలోనే టిల్లు స్క్వేర్ సినిమా రూ. 100 కోట్ల క్లబ్ వైపు శరవేగంగా దూసుకెళ్తుంది. ఇక టిల్లు స్క్వేర్ సినిమా జోర్ చూస్తుంటే.. రానున్న రోజుల్లో నిర్మాత నాగవంశీ చెప్పినట్లు వంద కోట్లు కాదు కదా.. రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు చేసిన ఆశ్చర్యపోనక్కర లేదు. ఇలా సినిమా బడ్జెట్ మొత్తం రెండు, మూడు రోజుల వ్యవధిలో వసూలు చేసి రికార్డు సృష్టించడం అనేది ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

tillu square day 4 collections

ఇక సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు మల్లిక్ రామ్ కాంబోలో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపబ హీరోయిన్ గా నటించింది. కాగా, ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేహా శెట్టి, ప్రిన్స్, మురళిధర్ కీలక పాత్రలు నటించారు.అలాగే టిల్లు స్క్వేర్ సినిమాకి శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, థమన్ సంగీతాన్ని అందించారు. అయితే ఈ సినిమాకి డైలాగ్స్ ను కూడా సిద్ధునే అందించడం విశేషం. కాగా, ఈ సినిమాకు మూడో పార్ట్ కూడా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక త్వరలో ఈ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు.మరి, టిల్లు స్క్వేర్ డే4 రూ. 78 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio