iDreamPost
android-app
ios-app

Tillu Square: టిల్లు స్క్వేర్ డే 2 కలెక్షన్స్.. వామ్మో రెండు రోజుల్లోనే ఇన్ని కోట్లా?

  • Published Mar 31, 2024 | 12:49 PM Updated Updated Mar 31, 2024 | 12:49 PM

శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన టిల్లు స్క్వేర్ సినిమా రెండు రోజుల్లోనే సినిమా బడ్జెట్ మొత్తాన్ని రికవరీ చేసింది. ఆ వివరాలు..

శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన టిల్లు స్క్వేర్ సినిమా రెండు రోజుల్లోనే సినిమా బడ్జెట్ మొత్తాన్ని రికవరీ చేసింది. ఆ వివరాలు..

  • Published Mar 31, 2024 | 12:49 PMUpdated Mar 31, 2024 | 12:49 PM
Tillu Square: టిల్లు స్క్వేర్ డే 2 కలెక్షన్స్.. వామ్మో రెండు రోజుల్లోనే ఇన్ని కోట్లా?

స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ-అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ‘టిల్లు స్క్వేర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 23.7 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసిన టిల్లు.. రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించాడు. 50 కోట్ల రూపాయల క్లబ్ కు చేరువగా వచ్చేశాడు. ఇక ఇదే జోరు కొనసాగిస్తే.. మరో నాలుగు రోజుల్లో నిర్మాత నాగవంశీ చెప్పినట్లుగానే టిల్లు స్క్వేర్ వంద కోట్లు వసూలు చేయడం పక్కా అంటున్నారు సినీ విశ్లేషకులు. తొలి రోజు 23.7 కోట్లు కలెక్ట్ చేసిన టిల్లు గాడు రెండో రోజు కూడా అదే దారిలో పయనించి.. కలెక్షన్ల వర్షం కురిపించాడు.

శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన టిల్లు స్క్వేర్ చిత్రం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 45.3 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించి రూ. 50 కోట్ల క్లబ్‌ వైపు దూసుకెళ్తుంది. రెండ రోజూ కూడా టిల్లు స్క్వేర్ రూ.20 కోట్లకి పైగా వసూళ్లు సాధించడం విశేషం. ఇక ఈ ఆదివారం నాడు కూడా ఇదే జోరు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. తొలి రోజు సినిమా బడ్జెట్‌లో 50 శాతం రికవరీ చేసిన టిల్లు గాడు రెండో రోజుతో మొత్తం రాబట్టి.. లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సినిమా బడ్డెట్ మొత్తం రెండు రోజుల్లోనే వసూలు చేయడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇక నిర్మాత నాగవంశీ చెప్పినట్లు కొన్ని రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరడం పక్కా అంటున్నారు.

Tillu Square Day 2 Collections

ఇక టిల్లు స్క్వేర్ సినిమాలో నేహా శెట్టి కూడా క్యామియోలో కనిపించి సర్‌ప్రైజ్ ఇచ్చింది. అలానే సిద్ధు తండ్రి పాత్రలో మురళీధర్ గౌడ్ మరోసారి అదరగొట్టారు. ఇక ఈ సినిమాలో టిల్లు చెప్పిన వన్ లైనర్స్, రిఫరెన్స్‌లు థియేటర్లో టపాసుల్లా పేలాయి. ఇక తనదైన డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్, ఎక్స్‌ప్రెషన్స్‌తో సిద్ధూ మరోసారి మ్యాజిక్ చేశాడు. ఇక ఈ సినిమాకి అనుపమ పరమేశ్వరన్ అందాలు మెయిన్ అట్రాక్షన్‌గా నిలిచాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇన్నాళ్లు డీసెంట్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన అనుపమ ఈ సినిమాలో మాత్రం లిప్‌లాక్‌లు, రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది.

టిల్లు స్క్వేర్ సాధించిన భారీ విజయంతో.. ఈ సినిమా పార్ట్ 3ని కూడా మూవీ టీమ్ అనౌన్స్ చేసేసింది. టిల్లు క్యూబ్ అనే టైటిల్ దీనికి పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పార్ట్ 3కి సంబంధించి పూర్తి డిటైల్స్‌ను ప్రకటిస్తామని నిర్మాత నాగ వంశీ చెప్పారు. టిల్లు గాడు ఎన్ని సార్లు వచ్చినా జనాలు థియేటర్లకి వస్తారని, ఆ రేంజ్‌లో ఈ క్యారెక్టర్ అందరికీ కనెక్ట్ అయిందన్నారు నాగవంశీ.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet