iDreamPost
android-app
ios-app

OTT Release: ఈ వారం OTTల్లోకి 17 సినిమాలు.. ఆ 2 చాలా స్పెషల్..!

  • Published Apr 22, 2024 | 9:39 AM Updated Updated Apr 22, 2024 | 9:39 AM

కొత్త వారం వచ్చేసింది. ఈ వీక్‌ ఓటీటీల్లోకి వచ్చే సినిమాల కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. ఈ వారం 17 సినిమాలు విడుదల కానున్నాయి. ఆ వివరాలు..

కొత్త వారం వచ్చేసింది. ఈ వీక్‌ ఓటీటీల్లోకి వచ్చే సినిమాల కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. ఈ వారం 17 సినిమాలు విడుదల కానున్నాయి. ఆ వివరాలు..

  • Published Apr 22, 2024 | 9:39 AMUpdated Apr 22, 2024 | 9:39 AM
OTT Release: ఈ వారం OTTల్లోకి 17 సినిమాలు.. ఆ 2 చాలా స్పెషల్..!

మరో వారం ప్రారంభం అయ్యింది అంటే చాలు ఇంతకు ముందైతే సినిమా లవర్స్‌.. కొత్త సినిమాల విడుదల కోసం ఎదురు చూసేవారు. మరి ఇప్పుడో.. అంతా ఓటీటీలమయం. వాటికున్న క్రేజ్‌ దృష్టా ప్రతి వారం కొత్త సినిమాలు ఓటీటీల్లో విడుదల అవుతున్నాయి. మూవీ లవర్స్‌ థియేటర్‌కు వెళ్లే పని లేకుండా.. ఇంట్లోనే కూర్చుని.. కొత్త సినిమాలను మనకు నచ్చిన సమయంలో ఎంజాయ్‌ చేయవచ్చు. అందుకే ఇప్పుడు ప్రేక్షకులు కూడా ప్రతి వారం ఓటీటీల్లోకి వచ్చే కొత్త సినిమాల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి మూవీ లవర్స్‌ కోసం ఈ వారం 17 కొత్త సినిమాలు ఓటీటీల్లోకి రానున్నాయి.

ఈ వారం లవ్‌ మీ, లవ్‌ మౌళి వంటి చిన్న సినిమాలు థియేటర్లలో రావాల్సి ఉంది. కానీ ఐపీఎల్ హడావుడి వల్ల ఈ సినిమాల రిలీజ్‌ వాయిదా పడ్డాయి. దీంతో విశాల్ హీరోగా చేసిన ‘రత్నం’ అనే డబ్బింగ్ మూవీ తప్పితే పేరున్న తెలుగు సినిమాలేవి.. ఈవారం థియేటర్లలోకి రావట్లేదు. మరోవైపు ఓటీటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అదలా ఉంచితే.. ఇక ఈ వారం ఓటీటీల్లో 17 వరకు సినిమాలు, సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో మూడు నాలుగు సినిమాలు, సిరీస్‌లు మాత్రమే కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా వారాంతలో కొన్ని చిత్రాలు సడెన్‌గా రిలీజ్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. ఇక మరి ఈ వారంలో స్ట్రీమింగ్‌కు రెడీ అయిన సినిమాల్లో ‘టిల్లు స్క్వేర్’, భీమా సినిమాల మీద మాత్రమే ప్రేక్షకులకు కాస్త ఆసక్తి ఉంది.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఏప్రిల్ 22-28 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • బ్రిగంటి (ఇటాలియన్ సిరీస్) – ఏప్రిల్ 23
  • ఫైట్ ఫర్ ప్యారడైజ్ (జర్మన్ సిరీస్) – ఏప్రిల్ 23
  • డెలివర్ మీ (స్వీడిష్ సిరీస్) – ఏప్రిల్ 24
  • సిటీ హంటర్ (జపనీస్ చిత్రం) – ఏప్రిల్ 25
  • డెడ్ బాయ్ డిటెక్టివ్స్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 25
  • టిల్లు స్క్వేర్ (తెలుగు సినిమా) – ఏప్రిల్ 26
  • గుడ్ బాయ్ ఎర్త్ (కొరియన్ సిరీస్) – ఏప్రిల్ 26
  • ద అసుంత కేస్ (స్పానిష్ సిరీస్) – ఏప్రిల్ 26

అమెజాన్ ప్రైమ్

  • దిల్ దోస్తీ డైలమా (హిందీ సిరీస్) – ఏప్రిల్ 25

హాట్‌స్టార్

  • భీమా (తెలుగు మూవీ) – ఏప్రిల్ 25
  • థ్యాంక్యూ, గుడ్ నైట్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 26
  • క్రాక్ (హిందీ సినిమా) – ఏప్రిల్ 26

జియో సినిమా

  • ద జింక్స్ పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 22
  • వుయ్ ఆర్ హియర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 27

బుక్ మై షో

  • కుంగ్ ఫూ పాండా 4 (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 26

ఆపిల్ ప్లస్ టీవీ

  • ద బిగ్ డోర్ ప్రైజ్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 24

లయన్స్ గేట్ ప్లే

  • ద బీ కీపర్ (ఇంగ్లీష్ చిత్రం) – ఏప్రిల్ 26

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetparktimebetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetlunabetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş