iDreamPost
android-app
ios-app

భలే ఛాన్స్ కొట్టేసిన మ్యాడ్ డైరెక్టర్.. టిల్లు క్యూబ్ కూడా..

  • Published Apr 22, 2024 | 3:21 PM Updated Updated Apr 22, 2024 | 3:21 PM

చిన్న సినిమాలతో ఇండస్ట్రీకి బిగ్ హిట్స్ ఇస్తున్నారు యంగ్ డైరెక్టర్స్. బాక్సాఫీసు వద్ద గల్ల పెట్టి నింపి.. స్టార్ హీరో చిత్రాలతో పాటు బడా బ్యానర్లలో సినిమాలు తెరకెక్కించే అవకాశాలు కొట్టేస్తున్నారు.

చిన్న సినిమాలతో ఇండస్ట్రీకి బిగ్ హిట్స్ ఇస్తున్నారు యంగ్ డైరెక్టర్స్. బాక్సాఫీసు వద్ద గల్ల పెట్టి నింపి.. స్టార్ హీరో చిత్రాలతో పాటు బడా బ్యానర్లలో సినిమాలు తెరకెక్కించే అవకాశాలు కొట్టేస్తున్నారు.

  • Published Apr 22, 2024 | 3:21 PMUpdated Apr 22, 2024 | 3:21 PM
భలే ఛాన్స్ కొట్టేసిన  మ్యాడ్ డైరెక్టర్.. టిల్లు క్యూబ్ కూడా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్ల హవా కొనసాగుతోంది. చిన్న సినిమాలతో హిట్స్ ఇచ్చి.. తెలుగు పరిశ్రమకు మరింత ఊపిరి పోస్తున్నారడంలో ఎటువంటి సందేహం లేదు. ఫస్ట్ లేదా సెకండ్ మూవీస్‌తో  మంచి హిట్స్ అందుకుని టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నారు. దీంతో వారి ఫేట్ మారిపోతుంది. స్టార్ హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ కొట్టేస్తున్నారు. సుజిత్, బుచ్చిబాబు, బలగం వేణు, షణ్ముఖ్ ప్రశాంత్, శ్రీకాంత్ ఓదెల, శౌరవ్, కార్తీక్ వర్మ దండు, మల్లిక్ రామ్, కళ్యాణ్ శంకర్ వంటి దర్శకులు ఈ కోవలోకే వస్తారు. ఇటీవల చిన్న సినిమా వచ్చి రూ. 100 కోట్లను కొల్లగొట్టిన చిత్రం టిల్లు స్క్వేర్. సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ మూవీ.. మార్చి 29న రిలీజ్ బాక్సాఫీసును షేక్ చేసేసింది.

డీజే టిల్లుకు కొనసాగింపు ఈ చిత్రం వచ్చిన సంగతి విదితమే. టిల్లు స్క్వేర్ చేసిన హడావుడికి మరో సారి హిట్ అందించారు ప్రేక్షకులు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. టిల్లు క్యూబ్‌గా రాబోతుంది. ఇప్పుడు దీనికి కూడా దర్శకుడు మారుతున్నాడు. టిల్లు ఫ్రాంచేజీ మొదలైన నాటినుండి ప్రతి ప్రాజెక్టుకు డైరెక్టర్ మారిపోతున్నాడు. డీజే టిల్లుకు విమల్ కృష్ణ మెగా ఫోన్ పట్టగా.. టిల్లు స్క్వేర్‌కు మల్లిక్ రామ్ డైరెక్ట్ చేశాడు. హిట్ బాట పట్టించాడు. ఇప్పుడు టిల్లు క్యూబ్‌కు కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించబోతున్నాడు. మ్యాడ్ సినిమాతో అలరించిన ఈ యంగ్ డైరెక్టర్‌కు ఈ సీక్వెల్ తెరకెక్కించే అవకాశం దక్కింది.

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మ్యాడ్ మూవీ.. మంచి హిట్ అందుకుంది. జూనియర్ ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన ఈ మూవీలో సంగీత్ శోభన్, రామ్ నితిన్ కూడా హీరోలుగా నటించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్య్చూన్ ఫోర్ సినిమాస్‌పై హరిక సూర్యదేవర, సాయి సౌజన్య తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కబోతుంది. మ్యాడ్స్ స్క్వేర్ ఎనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. ఇటీవలే షూటింగ్ స్టార్ అయ్యింది. ఈ చిత్రానికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు కళ్యాణ్ శంకర్. ఈ సినిమా పూర్తైన వెంటనే.. టిల్లు క్యూబ్ తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్య్చూన్ ఫోర్ సినిమాస్‌పై మరో ఛాన్స్ కొట్టేశాడు కళ్యాణ్. మొత్తానికి భలే ఛాన్స్ కొట్టేశాడు ఈ టాలెంట్ డైరెక్టర్.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet