iDreamPost
android-app
ios-app

Devara: దేవరలో టిల్లు ఉన్నాడా? బిగ్ సర్ఫ్రైజ్ అంటున్న సిద్దూ! పోస్ట్ వైరల్..

  • Published Apr 03, 2024 | 5:27 PM Updated Updated Apr 03, 2024 | 5:46 PM

సిద్దూ షేర్ చేసిన ఓ పిక్ కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. యంగ్ టైగర్ తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసి.. బిగ్ సర్ఫ్రైజ్ కమింగ్ సూన్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో దేవరలో టిల్లుగాడు ఉన్నాడా? అంటూ ప్రశ్నలు బయలుదేరాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

సిద్దూ షేర్ చేసిన ఓ పిక్ కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. యంగ్ టైగర్ తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసి.. బిగ్ సర్ఫ్రైజ్ కమింగ్ సూన్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో దేవరలో టిల్లుగాడు ఉన్నాడా? అంటూ ప్రశ్నలు బయలుదేరాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

Devara: దేవరలో టిల్లు ఉన్నాడా? బిగ్ సర్ఫ్రైజ్ అంటున్న సిద్దూ! పోస్ట్ వైరల్..

ఇండస్ట్రీలో పది సినిమాలు చేసినా రాని పేరు, క్రేజ్ ఒకే ఒక్క సినిమాతో వస్తుంది. అలా ‘డీజే టిల్లు’తో పరిశ్రమను తనవైపు చూసేలా చేసుకున్న హీరో సిద్దూ జొన్నలగడ్డ. 2022లో వచ్చిన ఈ మూవీతో యూత్ హీరోగా ఎనలేని క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు ఈ యంగ్ హీరో. ఈ చిత్రంలో టిల్లు పాత్రలో జీవించేశాడు సిద్దూ. అప్పట్లో భారీ హిట్ గా నిలిచి.. కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఇక ఇప్పుడు టిల్లు స్వ్కేర్ సినిమాతో ప్రేక్షకులను తన యాక్టింగ్ తో మరోసారి మెస్మరైజ్ చేశాడు. మార్చి 29న విడుదలైన ఈ చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో సిద్దూ షేర్ చేసిన ఓ పిక్ కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. యంగ్ టైగర్ తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసి.. బిగ్ సర్ఫ్రైజ్ కమింగ్ సూన్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

సిద్దూ జొన్నలగడ్డ.. కెరీర్ స్టార్టింగ్ లో చిన్న పాత్రలతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. గుంటూరు టాకీస్ లో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ మూవీ అతడికి అనుకున్నంతగా పేరు మాత్రం తీసుకురాలేదు. అయితే 2022లో వచ్చి డీజే టిల్లు మూవీ సిద్దూ లైఫ్ నే మార్చేసింది. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో.. పేరుతో పాటుగా యూత్ లో క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఇక లేటెస్ట్ గా టిల్లు స్వ్కేర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మార్చి 29న విడుదల అయిన ఈ చిత్రం భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే దాదాపు రూ. 85 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇదిలా ఉండగా.. టిల్లు స్క్వేర్ మూవీ సూపర్ హిట్ కావడంతో.. చిత్ర యూనిట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పార్టీ ఇచ్చాడు. గత రాత్రి ఎన్టీఆర్ ఇంట్లో ప్రొడ్యూసర్ నాగవంశీ, సిద్దూ జొన్నలగడ్డ, హీరో విశ్వక్ సేన్ కలిసి పార్టీ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ క్రమంలోనే తారక్ తో దిగిన పిక్ ను షేర్ చేస్తూ.. బిగ్ సర్ఫ్రైజ్ కమింగ్ సూన్ అని క్యాప్షన్ ఇచ్చాడు సిద్దూ. దీంతో దేవరలో టిల్లు ఉన్నాడా? ఉంటే ఏ క్యారెక్టర్ చేస్తున్నాడు? ఇవేవీ కాకుంటే.. వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుందా? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే? టిల్లు చెప్పేదాక ఆగాల్సిందే. కాగా.. దేవర మూవీ శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటోంది. మరి సిద్దూ చెప్పబోయే ఆ బిగ్ సీక్రెట్ ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Siddhu Jonnalagadda (@siddu_buoy)

 

View this post on Instagram

 

A post shared by Vishwak Sen (@vishwaksens)

ఇదికూడా చదవండి: 16 ఏళ్లకే జాతీయ అవార్డ్.. 21 ఏళ్లకే మరణం.. ఓ స్టార్ హీరోయిన్ విషాద గాథ

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisHoliganbetJojobet