iDreamPost
android-app
ios-app

వీడియో: టిల్లు పాటకు కోహ్లీ డ్యాన్స్.. అట్లుంటది టిల్లుగాడి రేంజ్!

Virat Dance For DJ Tillu Song: ఉప్పల్ వేదికగా హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ బ్యాటుతోనే కాకుండా.. డీజే టిల్లు పాటకు స్టెప్పులేసి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు.

Virat Dance For DJ Tillu Song: ఉప్పల్ వేదికగా హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ బ్యాటుతోనే కాకుండా.. డీజే టిల్లు పాటకు స్టెప్పులేసి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు.

వీడియో: టిల్లు పాటకు కోహ్లీ డ్యాన్స్.. అట్లుంటది టిల్లుగాడి రేంజ్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం అన్ని జట్లు పోటా పోటీగా ఆడుతున్నాయి. ఇప్పటికే కొన్ని జట్లకు దాదాపుగా బెర్తు ఖాయం కూడా అయ్యింది. ఆర్సీబీ జట్టుకు మాత్రం ఈ ఏడాది ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపుగా అసాధ్యం అన్నట్లుగా ఉంది పరిస్థితి. అయితే ఆర్సీబీ అదృష్టం ఎలా ఉన్నా కూడా.. విరాట్ కోహ్లీ మాత్రం ప్రేక్షకులను అలరించడంలో ముందు ఉంటాడు. తన బ్యాటుతోనే కాకుండా ఫీల్డింగ్ లో కూడా మైదానంలో చిరుతలా తిరుగుతూ ఉంటాడు. ఇంక డాన్స్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కోహ్లీకి ఒక సెపరేట్ వైబ్ ఉంటుంది. స్టాండ్స్ లో ఉన్న ఆడియన్స్ ని ఉర్రూతలూగిస్తూ ఉంటాడు. తాజాగా ఉప్పల్ స్టేడియంలో కూడా అదే చేశాడు.

సాధారణంగా కోహ్లీకి వీరాభిమానులు ఊరికే రాలేదు. అతను బ్యాటుతో పరుగుల వరద పారిస్తూ రన్నింగ్ మిషన్ అనే బిరుదు సొంతం చేసుకున్నాడు. ఆ ఒక్కటే కాకుండా.. మైదానంలో కోహ్లీ చేసే హంగామా అంతా ఇంతా కాదు. జట్టులో ఉన్న కుర్రాళ్లను ఉత్సాహపరుస్తాడు. ప్రత్యర్థులను ఉడికిస్తాడు. ఇంక గ్యాలరీలో ఉన్న ఆడియన్స్ ని అయితే తన గెస్చర్స్, తన డాన్స్ స్కిల్స్ తో ఉత్సాహ పరుస్తాడు. కోహ్లీ గనుక బౌండరీ లైన్ మీద ఉన్నాడు అంటే అక్కడున్న ప్రేక్షకులు అంతా ఫుల్ జోష్ లో ఉంటారు. ఉప్పల్ వేదికగా జరిగిన ఆర్సీబీ- సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో కూడా అదే జరిగింది. కోహ్లీ తెలుగు పాటకు స్టెప్పులేశాడు.

హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తోంది. విరాట్ కోహ్లీ బౌండరీ లైన్ మీద ఉన్నాడు. మధ్యలో కాస్త గ్యాప్ వచ్చినప్పుడు డీజే టిల్లు మూవీలో నుంచి డీజే టిల్లు కొట్టు.. టిల్లు కొట్టు సాంగ్ వచ్చింది. ఇంకేముంది.. విరాట్ కోహ్లీ అలా ఓ స్టెప్పేసి ఆడియన్స్ ని ఉత్సాహ పరిచాడు. విరాట్ ఎప్పుడూ మంచి వైబ్ లో ఉంటాడు. అనడానికి ఇది కూడా ఒక మంచి ఉదాహరణ. అలాగే ఆడియన్స్ ని తన వైపునకు తిప్పుకోవడం విరాట్ కి తెలిసినట్లుగా మరో క్రికెటర్ కు తెలియదనే చెప్పాలి. అయితే టిల్లు పాటకు విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి టిల్లుగాడి రేంజ్ అంటే అలాగే ఉంటుంది. అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు టిల్లు స్క్వేర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యింది. థియేటర్లలోనే కాకుండా.. ఓటీటీలో కూడా దుమ్ము దులుపుతోంది.

ఇంక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్ లో తడబడింది. టాపార్డ్ మాత్రమే కాకుండా.. దాదాపుగా బ్యాటర్లు అంతా విఫలమయ్యారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, క్లాసెన్, మార్కరమ్ వంటి స్టార్స్ అంతా విఫలమయ్యారు. అభిషేక్ శర్మ ప్రయత్నించినా కూడా నిలదొక్కుకోలేకపోయాడు. ఆర్సీబీ మాత్రం అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ తో అదరగొట్టింది. మొత్తానికి హైదరాబాద్ జట్టును బలంగానే కొట్టింది. మరి.. టిల్లు పాటకు కోహ్లీ స్టెప్పులేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.