గత ఏడాది తమిళంలో విడుదలై మంచి స్పందన దక్కించుకున్న వినోదయ సితం తెలుగు రీమేక్ కు రంగం సిద్ధమయ్యింది. ఎవరో చేస్తే ఇదేమి పెద్ద న్యూస్ కాదు కానీ పవన్ కళ్యాణ్ సాయి తేజ్ కాంబినేషన్ అనగానే ఎక్కడ లేని అంచనాలు పెరిగిపోతాయి. ఇది చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందే సినిమా. అయినా కూడా మూడు నిర్మాణ సంస్థలు ఇందులో భాగస్వామ్యం పంచుకోబోతున్నాయని ఇన్ సైడ్ టాక్. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్స్ మీడియా […]
మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దాటిన తర్వాత ఆయన ప్రయాణిస్తున్న బైక్ ప్రమాదవశాత్తు కింద పడడంతో సాయిధరమ్తేజ్ తీవ్ర గాయాల పాలయ్యారు. ఆయన బైక్ వేగంగా నడపడంతో టుడే రోడ్డు ప్రమాదం జరిగిందని ఒకసారి, లేదు రోడ్డు మీద ఇసుక లాంటి పదార్థం ఉంది కాబట్టి వేగంగా వెళుతున్న బైక్ అదుపు తప్పి పడిపోయాడని ఒకసారి ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. […]
రెండు నెలల క్రితం ప్రమాదానికి గురైన హీరో సాయి తేజ్ క్షేమంగా కోలుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దీపావళి పండగ సందర్భంగా మొత్తం ఫ్యామిలీ హీరోలతో కలిసి చిరంజీవి పోస్ట్ చేసిన గ్రూప్ ఫోటోతో అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడు ఫ్యాన్స్ దృష్టి తిరిగి సాయి తేజ్ ఎప్పుడు షూటింగ్స్ లో పాల్గొంటాడా అనేదాని మీద ఉంది. మెగా కాంపౌండ్ నుంచి అందుతున్న న్యూస్ మేరకు హీన పక్షం మరో మూడు నుంచి ఆరు నెలల […]
కేవలం వారం గ్యాప్ లో బాక్సాఫీస్ ని పలకరించిన అన్నదమ్ములు సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ ఇద్దరూ అనూహ్యంగా ఒకే రకమైన ఫలితాన్ని దక్కించుకోవడం అభిమానులకు షాక్ గా ఉంది. దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన రిపబ్లిక్ ఎంత విస్తృతమైన ప్రమోషన్లు చేసినా సరే థియేట్రికల్ బిజినెస్ మార్క్ ని అందుకోలేక ఫ్లాప్ మూటగట్టుకుంది. 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగగా అతి కష్టం మీద ఆరు కోట్ల మార్కుని దాటేసింది కానీ […]
ఆశించినంత బజ్ లేకుండా విడుదలైన సాయి తేజ్ రిపబ్లిక్ కు డివైడ్ టాక్ నడుస్తోంది. కాన్సెప్ట్ మంచిదే అయినప్పటికీ దాన్ని దర్శకుడు దేవ కట్టా ప్రెజెంట్ చేసిన తీరు పట్ల అన్ని వర్గాల ప్రేక్షకులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు. రిస్కీ క్లైమాక్స్ ఉండటంతో అనవసర హంగామా చేసి ప్రచారం చేయడం వల్ల లేనిపోని హైప్ పెరుగుతుందేమోనని భావించిన నిర్మాతలు ప్రీ రిలీజ్ తప్ప పబ్లిసిటీ మీద అంతగా ఫోకస్ చేయకపోవడం మైనస్ గా మారింది. మొదటి […]
గత ఏడాది లాక్ డౌన్ ఎత్తేశాక వచ్చిన మొదటి సినిమా సోలో బ్రతుకే సో బెటరూతో సక్సెస్ అందుకున్న సాయి తేజ్ ఈసారి సీరియస్ పొలిటికల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2010 ప్రస్థానంతో ఇప్పటికీ ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ వచ్చాక అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. గత నెల బైక్ యాక్సిడెంట్ కు గురై ప్రస్తుతం ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్న సాయితేజ్ లేకుండానే ఇటీవలే […]
ఇటీవలే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తాలూకు పరిణామాల వల్ల అసలు సినిమా కంటే రాజకీయ అంశాలు హై లైట్ కావడంతో రిపబ్లిక్ కు హైప్ పరంగా దక్కాల్సిన ప్రయోజనం మిస్ అయ్యిందనే చెప్పాలి. అక్టోబర్ 1న చెప్పుకోదగ్గ పోటీ లేకపోయినా ఈ సినిమాకంటూ కొన్ని రిస్కులు లేకపోలేదు. మొదటిది ఒకరోజు ముందు 30న వస్తున్న జేమ్స్ బాండ్ కొత్త మూవీ ‘నో టైం టు డై’కు భారీ క్రేజ్ ఉండటం. ఇప్పటిదాకా వచ్చిన బాండ్ సినిమాల్లో […]
ఇటీవలే బైక్ యాక్సిడెంట్ కు గురైన సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు. అపోలో డాక్టర్లు ఇస్తున్న సమాచారం మేరకు ఐసియు నుంచి రేపో ఎల్లుండో రెగ్యులర్ రూమ్ కి షిఫ్ట్ చేయబోతున్నారు. కాలర్ బోన్ సర్జరీ కూడా విజయవంతంగా పూర్తవ్వడంతో ఎలాంటి ముప్పు లేదు. ఇంకో వారం పదిరోజుల్లో తను మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. మొదటి రోజు ఈ వార్త కవరేజ్ కి సంబంధించి ఓ రెండు మీడియా ఛానల్స్ చేసిన ఓవరాక్షన్ కి నెటిజెన్లు […]