iDreamPost
android-app
ios-app

మెగా హీరో మూవీ నుంచి తప్పుకున్న పూజా హెగ్డే! కారణం అదేనా?

  • Published Feb 03, 2024 | 9:45 AM Updated Updated Feb 03, 2024 | 9:45 AM

తెలుగులో టాప్ హీరోయిన్ గా వెలిగిన అందాల భామ పూజా హెగ్డే ఈ మద్య కాలంలో యాక్టీవ్ గా లేదు.. ఇటీవల వచ్చిన ఛాన్సులు కూడా మిస్ అవుతుంది.

తెలుగులో టాప్ హీరోయిన్ గా వెలిగిన అందాల భామ పూజా హెగ్డే ఈ మద్య కాలంలో యాక్టీవ్ గా లేదు.. ఇటీవల వచ్చిన ఛాన్సులు కూడా మిస్ అవుతుంది.

  • Published Feb 03, 2024 | 9:45 AMUpdated Feb 03, 2024 | 9:45 AM
మెగా హీరో మూవీ నుంచి తప్పుకున్న పూజా హెగ్డే! కారణం అదేనా?

బాలీవుడ్ లో నటించిన ఎంతోమంది స్టార్ హీరోయిన్లు తెలుగు లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొంతమంది హీరోయిన్ మంచి సక్సెస్ సాధించారు. ఇక తెలుగు లో వరుసగా స్టార్ హీరోల సరసన నటించిన బ్యూటీలు తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ వరుస డిజాసర్టర్స్ తో సతమతమవుతూ తెలుగులోకి రీ ఎంట్రీ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ‘ముకుంద’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను తన క్యూట్ లుక్స్ తో పలకరించింది పూజా హెగ్డే. ఆ తర్వాత వచ్చిన ఒక లైలా కోసం మూవీ పెద్దగా పేరు తీసుకురాలేదు. దువ్వాడ జగన్నాథం మూవీ నుంచి ఎక్కువగా గ్లామర్ పాత్రల్లో నటించింది. ఇటీవల పూజాకు తెలుగు లో పెద్దగా ఛాన్సులు రావడం లేదని టాక్. వివరాల్లోకి వెళితే..

మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి.. 2010లో విశ్వసుందరి పోటీలక భారత్ నుంచి ఎంపిక కోసం జరిగిన పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది పూజా హెగ్డే. ఆ తర్వాత తమిళంలో ‘సూపర్’ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. 2014లో ముకుంద, ఒకలైలా కోసం ఈ అమ్మడికి పెద్దగా పేరు తీసుకురాలేదు. అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం మూవీలో బికినీ సీన్లలో రెచ్చిపోయి నటించింది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ లోకి అడుగు పెట్టి అక్కడ కూడా పలు విజయాలు అందుకుంది. ఇటీవల తెలుగు లో పూజా హెగ్డే అంతగా యాక్టీవ్ లో ఉండటం లేదనే చెప్పాలి. అలా అని బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడికి పెద్దగా ఛాన్సులు లేవు.   త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో వచ్చిన గుంటూరు కారం మూవీలో మొదట శ్రీలీల పాత్రలో పూజా హెగ్డేని తీసుకున్నారు.. కానీ కొన్ని కారణాల వల్ల ఆమెను తప్పించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో పూజాని అనుకున్నప్పటికీ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ అమ్మడి చేతిలో ఒకే తెలుగు  సినిమా మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న గంజా శంకర్. ఈ మూవీలో పూజా హెగ్డే నటిస్తుందని వార్తలు వచ్చాయి. తాజాగా గంజా శంకర్ మూవీ నుంచి కూడా పూజా హెగ్డే తప్పుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ నుంచి పూజా ఎందుకు తప్పుకున్నదీ అన్న విషయానికి వస్తే.. ఈ మూవీలో ఆమె పాత్ర పూర్తిగా డీ గ్లామరస్ గా ఉంటుందని టాక్. అంతే కాదు చాలా వరకు తెల్ల చీర కట్టుకొని ఎప్పుడూ పుజా పునస్కారాల్లో మునిగి తేలే పాత్ర కావడంతో తనకు సెట్ కాదని.. అందుకే ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఈ విషయంపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ లేదు.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetelitcasinofixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet