sai
Sai Dharam Tej Helps Pavala Shyamala: టాలీవుడ్ సీనియర్ నటి, కమెడియన్ పావలా శ్యామలకు సాయం చేసి.. తన మంచి మనసు చాటుకున్నారు హీరో సాయి ధరమ్ తేజ్. ఆ వివరాలు..
Sai Dharam Tej Helps Pavala Shyamala: టాలీవుడ్ సీనియర్ నటి, కమెడియన్ పావలా శ్యామలకు సాయం చేసి.. తన మంచి మనసు చాటుకున్నారు హీరో సాయి ధరమ్ తేజ్. ఆ వివరాలు..
sai
పావలా శ్యామల పేరు తరచుగా వార్తల్లో వినిపిస్తుంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందల చిత్రాల్లో నటించిన శ్యామల.. జీవిత చరమాంకంలో ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంది. ఆమె సమస్య గురించి తెలుసుకున్న చిరంజీవి సహా పలువురు సినీ సెలబ్రిటీలు.. శ్యామలకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అలానే మా అసోసియేషన్ కూడా ఆమెకు సాయం చేసింది. ఈ క్రమంలో తాజాగా మరో హీరో పావలా శ్యామలాకు సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. అతడే సాయి ధరమ్ తేజ్. శ్యామలకు ఆర్థిక సాయం చేశారు. ఆ వివరాలు..
ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. ఆమెకు లక్ష రూపాయలు అందజేశారు. సాయి ధరమ్ తేజ్ అందించిన సాయంపై పావలా శ్యామల స్పందిస్తూ.. భావోద్వేగానికి గురయ్యారు. ‘‘మా అమ్మాయికి ఆపరేషన్ అయినప్పుడు సాయిధరమ్ తేజ్ నాకు ఫోన్ చేసి.. ధైర్యం చెప్పారు. వచ్చి కలుస్తానన్నారు. చాలా రోజులైపోయింది. నన్ను మర్చిపోయారేమో అనుకున్నా. కానీ, నన్ను గుర్తుపెట్టుకొని సాయం చేసినందుకు ఆయనకు నా కృతజ్ఞతలు’’ అని తెలిపారు.
ఆ తర్వాత పావలా శ్యామల.. సాయి ధరమ్ తేజ్‌తో వీడియో కాల్ మాట్లాడారు. ఆ సందర్భంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఆమె.. సాయిధరమ్‌తేజ్‌తో వీడియో కాల్‌లో మాట్లాడి భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. చనిపోదామనుకుంటున్న. సమయంలో మీరు సాయం చేసి నాకూ, నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టారు’’ అంటూ శ్యామల కన్నీళ్లు పెట్టుకున్నారు. అది చూసి సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ..‘‘మీరు ఏడుస్తుంటూ.. నాకు కష్టంగా ఉంది. ఏడవకండి’’ అంటూ ఓదార్చారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌కు సాయిధరమ్‌తేజ్ రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇందులో భాగంగా రూ.లక్షను ఆమెకు అందజేయడం జరిగింది.
తెలుగులో పలు చిత్రాల్లో హాస్యనటి, సహాయనటిగా కనిపించారు పావలా శ్యామల. ‘గోలీమార్’, ‘మనసంతా నువ్వే’, ‘ఖడ్గం’, ‘ఆంధ్రావాలా’ వంటి చిత్రాలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ‘మత్తువదలరా’ తర్వాత ఆమె సినిమాల్లో కనిపించలేదు. ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ఆమె తన కుమార్తెతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆమె ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని చిరంజీవి, పవన్‌కల్యాణ్ గతంలో ఆర్థికసాయం అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో సాయి ధరమ్ తేజ్ చేరారు.