iDreamPost
android-app
ios-app

పేరు మార్చుకొన్న సాయిధరమ్ తేజ్.. కొత్త పేరు ఏంటో తెలుసా?

  • Published Mar 09, 2024 | 8:04 AM Updated Updated Mar 09, 2024 | 8:15 AM

Sai Dharam Tej Key Announcement: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన తల్లి కోసం సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.. అదేంటంటే..

Sai Dharam Tej Key Announcement: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన తల్లి కోసం సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.. అదేంటంటే..

  • Published Mar 09, 2024 | 8:04 AMUpdated Mar 09, 2024 | 8:15 AM
పేరు మార్చుకొన్న సాయిధరమ్ తేజ్.. కొత్త పేరు ఏంటో తెలుసా?

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతోమంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో చాలా కొద్ది మంది మాత్రమే సక్సెస్ బాటలో పయణించారు. అలాంటి హీరోల్లో ఒకరు సాయి ధరమ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్ ‘రేయ్’ మూవీతో చిత్రపరిశ్రలోకి అడుగు పెట్టినా.. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ మూవీతో తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ మూవీస్ తో బాక్సాఫీస్ విజయం అందుకున్నాడు. డ్యాన్స్, ఫైట్స్, యాక్షన్ తో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. సాయి ధరమ్ తేజ్ మహిళాదినోత్సవం సందర్భంగా ఓ కీలక ప్రకటన చేశారు. ఇంతకీ ఆ ప్రకటన ఏంటీ.. ఏం నిర్ణయం తీసుకున్నాడు? అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి సక్సెస్ అందుకున్న హీరోల్లో ఒకరు సాయి ధరమ్ తేజ్. మొదటి చిత్రంతోనే తనదైన పర్ఫామెన్స్ తో మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. కెరీర్ బిగినింగ్ లో వరుస విజయాలు అందుకున్నా సాయి ధరమ్ తేజ్ తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమయ్యాడు. అదే సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై కొన్ని నెలలో పాటు ఇంటికే పరిమితమయ్యాడు. ప్రమాదం తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష మూవీతో మంచి విజయం అందుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన తల్లిపై తనకున్న ప్రేమను చాటుకుంటూ తన పేరు మార్చుకుంటున్నట్లు వెల్లడించాడు.

మహిళాదినోత్సవం సందర్భంగా శుక్రవారం సాయి ధరమ్ తేజ్ నటించిన సత్య షార్ట్ ఫిలిమ్ స్పెషల్ ప్రీమియర్ షోను ప్రసాద్ ల్యాబ్ లో ప్రదర్శించారు. ఈ షార్ట్ ఫిలిమ్ నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందింది. ఈ షార్ట్ ఫిలిమ్ లో సాయి ధరమ్ తేజ్, స్వాతిరెడ్డి నటించగా.. బలగం నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ.. కీలక ప్రకటన చేశారు. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘ ఇక నుంచి నా పేరులో మా అమ్మ పేరును కూడా చేర్చుకుంటున్నాను. నాన్న ఇంటి పేరు ఎలాగూ ఉంటుంది.. మా అమ్మ ఎప్పటికీ నాతోపాటే ఉండాలి.. అందుకే మా అమ్మపేరు కూడా చేర్చుకొని నా పేరు ‘సాయి దుర్గ తేజ్’గా మార్చుకుంటున్నా’ అని చెప్పుకొచ్చాడు. త్వరలోనే తన సోషల్ మీడియాలో ఖాతాలన్నింటిలోనూ ఇదే పేరు అప్డేట్ చేయబోతున్నట్లు తెలిపాడు. తల్లిపై తనకు ఉన్న ప్రేమా, మమకారం ఈ విధంగా చాటుకున్నందుకు అభిమానులు సాయిధరమ్ తేజ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom