iDreamPost
android-app
ios-app

మెగా హీరో సాయిధరమ్ తేజ్ కి నోటీసులు! గంజాయి పేరుతో

Sai Dharam Tej: తరచూ సినిమాలకు, హీరోలకు, హీరోయిన్లకు ప్రభుత్వం, పోలీసుల నుంచి నోటీసులు వెళ్తుంటాయి. వివిధ అంశాలపై వివరణ కోరుతూ ఈనోటీసులు ఇస్తుంటారు. అలానే తాజాగా మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కు గాంజా శంకర్ సినిమా విషయంలో అధికారుల నోటీసులు ఇచ్చారు.

Sai Dharam Tej: తరచూ సినిమాలకు, హీరోలకు, హీరోయిన్లకు ప్రభుత్వం, పోలీసుల నుంచి నోటీసులు వెళ్తుంటాయి. వివిధ అంశాలపై వివరణ కోరుతూ ఈనోటీసులు ఇస్తుంటారు. అలానే తాజాగా మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కు గాంజా శంకర్ సినిమా విషయంలో అధికారుల నోటీసులు ఇచ్చారు.

మెగా హీరో సాయిధరమ్ తేజ్ కి నోటీసులు! గంజాయి పేరుతో

వివాదలు, పోలీసుల కేసులు, నోటీసులు అనేవి ప్రతి ఒక్కరంగంలో ఉంటాయి. అలానే సినీరంగంలో కూడా ఇలాంటివి సర్వసాధారణం. ముఖ్యంగా సినిమాల కథ, టైటిల్, సాంగ్స్, కొన్ని కొన్ని సన్నీవేశాలకు సంబంధించినవి వివాదాలు అవుతుంటాయి. ఈ క్రమంలో కొన్ని ఇష్యూ పోలీసుల దాక వెళ్లకుండానే మధ్యలో పరిష్కారం అవుతాయి. మరికొన్ని సందర్బాల్లో మాత్రం పోలీసులు కూడా జోక్యం చేసుకుని సంబంధిత వ్యక్తులకు నోటీలుసు జారీ చేస్తుంటారు. తాజాగా మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నగాంజా శంకర్ సినిమా విషయంలో తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో నోటీసులు జారీ చేసింది.

మెగా హీరో సాయి ధరమ్ తేజ, సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాంజా శంకర్’. ఈ సినిమాను నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు. తరచూ ఈ సినిమాపై ఏదో ఒక రూమర్స వస్తూనే ఉంది.  ఈ సినిమా ఆగిపోయినట్లు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అలానే చిత్ర యూనిట్ ఈ ప్రాజెక్టును హోల్డ్‌లో పెట్టారని రూమర్స్ వినిపిస్తోన్నాయి. ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నసమయంలోనే ఈ సినిమాపై మరో వివాదం నడుస్తోంది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సినిమా టైటిల్, కథాంశాన్ని పునఃపరిశీలించాలని మూవీ మేకర్స్ కి నోటీసు జారీ చేసింది. హీరో సాయిధరమ్ తేజ్, డైరెక్టర్ సంపత్ నంది, నిర్మాత సూర్యదేవర నాగవంశీకి పోలీసులు నోటీసులు పంపారు.

గాంజా శంకర్ సినిమా టైటిల్, కథ మీద అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గాంజా అనే పదాన్ని వాడవద్దని, మాదక ద్రవ్యాల వాడకాన్ని చూపించొద్దని, అలానే డ్రగ్స్ వాడకాన్ని హీరోయిజంగా అస్సల చూపించొద్దని నార్కోటిక్ బ్యూరో తెలిపింది. ఇక సినిమాలో డ్రగ్స్ వాడకం, గాంజాయి, డ్రగ్స్ ఎలా వస్తుంది? ఎలా వాడాలి? అనే సీన్లు కూడా చూపించకూడదని చెప్పుకొచ్చింది. సినిమాలో అలాంటి సీన్లు పెడితే అది సమాజం మీద దుష్ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రెస్ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇందులో గాంజా శంకర్ చిత్రం గురించి చాలానే రాసుకొచ్చారు. ఇవన్నీ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ కు నోటీసులు పంపినట్లు సమాచారం. మరి దీనికి గాంజా శంకర్ టీం ఏం రిప్లై ఇస్తుందో చూడాలి. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ , ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నిర్మాత నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ గాంజా శంఖర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరి.. గాంజా శంకర్ మూవీపై వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.