iDreamPost
android-app
ios-app

స్టేజీపైనే సాయితేజ్‌ను హగ్ చేసుకుని, ముద్దు పెట్టిన స్వాతి

  • Published Sep 26, 2023 | 5:36 PM Updated Updated Sep 26, 2023 | 6:10 PM
  • Published Sep 26, 2023 | 5:36 PMUpdated Sep 26, 2023 | 6:10 PM
స్టేజీపైనే సాయితేజ్‌ను హగ్ చేసుకుని, ముద్దు పెట్టిన స్వాతి

సినిమాలకు గ్యాప్ ఇచ్చిన చాలా రోజుల తర్వాత మళ్లీ మూవీస్‌తో బిజీగా మారిపోతోంది కలర్స్ స్వాతి. తాజాగా మంత్ ఆఫ్ మధు అనే సినిమాతో రాబోతుంది. నవీన్ చంద్ర, స్వాతి, శ్రేయ నవిలే, వైవా హర్ష ప్రధాన పాత్రలో నటించబోతున్న ఈ సినిమాను యంగ్ డైరెక్టర్, భానుమతి రామకృష్ణ ఫేమ్ శ్రీకాంత్ నాగోతి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ పోస్టర్, టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్‌ను పొందాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను సాయి ధరమ్ తేజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది చిత్ర బృందం. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు సాయి తేజ్ అండ్ స్వాతి. కాగా, వీరిద్దరూ గతంలో సోల్ ఆఫ్ సత్య అంటూ ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడిన సంగతి విదితమే.

అయితే టీజర్ ఈవెంట్‌లో సాయి ధరమ్ మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ యశ్, ధామా తనకు క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పారు. డైరెక్టర్ తొలి సినిమా రామకృష్ణ సినిమాను చూశానని, అందులో కాంప్లెక్స్ ఎమోషన్స్ ఉన్నాయని చెప్పారు. వైవా, శ్రియా, నవీన్ చంద్ర గురించి చెప్పుకొచ్చారు. తర్వాత స్వాతి గురించి ‘మీ అందరికీ కలర్స్ స్వాతి, నాకు మాత్రం స్వాతి గాడు. కాలేజీ నుండే మేము ఫ్రెండ్స్.కలర్ స్వాతి లాగా స్టార్ట్ అయ్యి స్వాతి అయింది, ఆ తర్వాత స్వాతిగా అయ్యింది. ఆ తర్వాత స్వాతి గాడు అయ్యింది. తనకు క్లోజ్ ఫ్రెండ్ అని, ఈ సినిమా స్వాతికి మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ స్వాతి’అని సాయితేజ్ మాట్లాడుతుండగా.. హగ్ చేసుకుని కిస్ పెట్టుకుంది కలర్స్ స్వాతి. ఆ తర్వాత స్వాతి మాట్లాడుతూ..హర్ష, శ్రియా, రాజీవ్, చైతు, భూషణ్ మంచి పాత్రలను పోషించారని అన్నారు. మేము ఇంత బాగా నటించామంటే డైరెక్టర్ శ్రీకాంత్ వల్లేనని అన్నారు.

నవీన్ చంద్ర గురించి మాట్లాడుతూ.. మమ్మల్ని న్యూ కమ్మర్స్‌లా చూడండని అన్నారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఆమెను ముందుకు వెళ్లమని స్వాతిని తోస్తుండగా..‘ముందుకు వెళ్లడం కాదురా.. నువ్వు నా వెనుకాల ఎప్పుడు ఉన్నావ్. మేమిద్దం (స్వాతి, సాయి తేజ్)కలిసి చదువుకున్నాం. మీదరందరూ తనకంటే నేను పెద్దదాన్ని అనుకుంటున్నారు కానీ, నా డెబ్యు ముందైంది అంతే. మేమిద్దం బిఎస్సీ కలిసి చదువుకున్నాం. తను సినిమాల్లోకి లేటుగా వచ్చాడు’ అని అన్నారు. అంతలో సాయి తేజ్ మాట్లాడుతూ.. పేపర్ చూపిస్తావని వెనుకున్నాను అనే సరికి.. అది నిజమేనంటూ స్వాతి నవ్వేసింది. తాను ఏం చూపించలేదు అనే సరికి ఓరేయ్ అంటూ సంభోదించింది. నువ్వు చూపించలేదు కాబట్టి.. బుక్ ఒళ్లో పెట్టుకుని దొరికిపోయానంటూ చెప్పుకొచ్చాడు. తానేమీ చూపించలేదని చెప్పగా.. పాసైందే నా వల్ల అంటూ స్వాతి చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఏదో జోకులు వేస్తున్నాడు కానీ.. సాయి తన సపోర్ట్ సిస్టమ్స్ అని పేర్కొంది స్వాతి.

View this post on Instagram

A post shared by IDream Media (@idreammedia)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio