iDreamPost
android-app
ios-app

Sai Dharam Tej: ప్లీజ్ పిల్లల విషయంలో ఈ తప్పు చేయద్దు.. హీరో రిక్వెస్ట్

  • Published Jul 07, 2024 | 5:11 PM Updated Updated Jul 07, 2024 | 5:11 PM

ప్రస‍్తుతం సోషల్‌ మీడియాలో ఎన్ని అనార్థులు, దారుణాలు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ రియాక్ట్‌ అవుతూ సోసల్‌ మీడియాలో తనదైన శైలిలో పిల్లల ఉద్దేశించి రిక్వేస్ట్‌ చేస్తూ ఓ పోస్టు పెట్టారు. కాగా, ప్రస్తుతం ఆ పోస్టు కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

ప్రస‍్తుతం సోషల్‌ మీడియాలో ఎన్ని అనార్థులు, దారుణాలు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ రియాక్ట్‌ అవుతూ సోసల్‌ మీడియాలో తనదైన శైలిలో పిల్లల ఉద్దేశించి రిక్వేస్ట్‌ చేస్తూ ఓ పోస్టు పెట్టారు. కాగా, ప్రస్తుతం ఆ పోస్టు కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

  • Published Jul 07, 2024 | 5:11 PMUpdated Jul 07, 2024 | 5:11 PM
Sai Dharam Tej: ప్లీజ్ పిల్లల విషయంలో ఈ తప్పు చేయద్దు.. హీరో రిక్వెస్ట్

ఇటీవల కాలంలో సోషల్‌ మీడియా వలన ఎన్ని అనార్థలు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సోషల్‌ మీడియా వాడకంలోకి వచ్చిన నుంచి ఆకతాయి పనులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఎవరుకు నచ్చిన విధంగా వారు ఇష్టనుసరంగా ప్రవర్తించడమే కాకుండా.. ఎదుటవారికి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీస్‌, సామాన్యులు అని తేడా లేకుండా.. ప్రతిఒక్కరిపై సోషల్‌ మీడియా ద్వారా నెగెటివ్‌ కామెంట్స్‌, అశ్లీలా వీడియోలు, ఫోటో మాఫింగ్‌ వంటి దారుణాలు చేస్తూ విరుచుకుపడుతున్నారు. కాగా, ఈ విషయం పైనే తాజాగా టాలీవుడ్‌ యంగ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ రియాక్ట్‌ అవుతూ సోసల్‌ మీడియాలో తనదైన శైలిలో పిల్లల ఉద్దేశించి రిక్వేస్ట్‌ చేస్తూ ఓ పోస్టు పెట్టారు. కాగా, ప్రస్తుతం ఆ పోస్టు కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రస్తుతం సోషల్‌ మీడియా ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే.. ఈ సోషల్‌ మీడియాకు మించిన పెను భూతం మరొకటి లేదు. అలా అని సరిగ్గా సోషల్ మీడియాను ఉపయోగిస్తే దీనిని మించిన ఆయుధం లేదు. కానీ, చాలామంది ఆకయితాయి వేధవలు నచ్చని వాళ్లపై నెగెటివిటీ పెంచడం, లేడీస్‌పై ఇష్టమొచ్చినట్లుగా పోస్టులు చేయడం, సెలబ్రెటీలను బూతులు తిట్టడం వంటి లేనిపోని అకృత్యాలకు పాల్పడుతున్నారు. చివరికి చిన్న పిల్లలను సైతం ఈ విషయంలో విడిచిపెట్టడం లేదు.  ఇష్టానుసరంగా కొంతమంది పిల్లలపై కూడా  ట్రోల్స్, మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై స‍్పందిచిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో ఉండే మృగాల నుంచి పిల్లలని కాపాడుకోవాలంటూ తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేశారు.

SaiDharam Tej

ఈ క్రమంలోనే సాయిధరమ్‌ తేజ్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్టు షేర్‌ చేశారు. ఇక ఆ పోస్టులో ఇలా రాసుకొచ‍్చారు.  ‘సోషల్‌ మీడియాలో పిల్లల ఫోటోలు, వీడియోలు షేర్‌ చేసే పేరెంట్స్‌ తస్మాత్‌ జాగ్రత్త. ముఖ్యంగా తల్లిదండ్రులు వాటిని పోస్టు చేసినప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే సోషల్‌ మీడియా మరీ దారుణంగా, భయంకరంగా మారిపోయింది. పైగా ఇక్కడ ఉన్న మానవ మృగాలను  అడ్డుకోవడం చాలా కష్టమైపోయింది. కాబట్టి మీ పిల్లల పిక్స్‌, వీడియోస్‌ పోస్ట్‌ చేసేటప్పుడు ఆలోచించండి. లేదంటే తర్వాత ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది’ అని హెచ్చరించాడు.

ఇకపోతే తాజాగా కొంతమంది తెలుగు యూట్యూబర్స్‌ తండ్రీకూతుర్ల బంధంపై అసభ్య కామెంట్లు చేశారు. డార్క్‌ కామెడీ పేరుతో విచ్చలవిడిగా మాట్లాడారు. ఆత్మీయ బంధాన్ని అవమానించేలా వికృత చేష్టలకు దిగారు. పైగా తండ్రీకూతుర్ల బంధాన్ని చెడు కోణంలో చూపిస్తూ వారి గురించి అత్యంత నీచంగా మాట్లాడారు. కాగా, అందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.  ఈ క్రమంలోనే సాయిధరమ్‌ తేజ్‌ వారిమీద మండిపడుతూ పేరెంట్స్‌ జాగ్రత్తగా ఉండాలని పోస్టు పెట్టాడు. మరి, సాయి ధరమ్‌ తేజ్‌ పోస్టు పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.