iDreamPost
android-app
ios-app

బ్రో మూవీ కలెక్షన్స్! ఫస్ట్ డే ఎంత వసూల్ చేసిందంటే..

  • Author ajaykrishna Published - 12:36 PM, Sat - 29 July 23
  • Author ajaykrishna Published - 12:36 PM, Sat - 29 July 23
బ్రో మూవీ కలెక్షన్స్! ఫస్ట్ డే ఎంత వసూల్ చేసిందంటే..

తెలుగులో కొత్తగా విడుదలైన సినిమాలలో బ్రో ఒకటి. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా.. జులై 28న గ్రాండ్ గా విడుదలైంది. ఓవైపు హీరోల క్రేజ్ తో పాటు మూవీ ప్రమోషనల్ స్టఫ్ కూడా అంచనాలు పెంచేసరికి బ్రోకి ఓపెనింగ్స్ ఊహించని విధంగా ఉంటాయని అందరు అంచనా వేశారు. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సితం మూవీకి ఆఫీషియల్ రీమేక్ గా రూపొందిన బ్రో మూవీని.. ఒరిజినల్ డైరెక్టర్, నటుడు సముద్రఖనినే తెరకెక్కించడం విశేషం. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల నిర్మించిన ఈ సినిమాలో ప్రియా వారియర్, కేతిక శర్మ, ఊర్వశి రౌటేలా, రోహిణి కీలకపాత్రలలో నటించారు.

ఇక బ్రో మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది కాబట్టి.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ఈ సినిమా ఇంతకీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరుపుకుంది? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత సెట్ అయ్యింది? అనే వివరాల్లోకి వెళ్తే.. బ్రో మూవీ ఓవరల్ గా వరల్డ్ వైడ్ సుమారు రూ. 95 కోట్ల వరకు బిజినెస్ జరుపుకోగా.. ఫైనల్ గా రూ. 98 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ సెట్ అయ్యిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. సాంగ్స్ ఎలా ఉన్నప్పటికీ.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టాడు అని టాక్ వచ్చింది. పవన్, తమన్ కాంబినేషన్ లో ఇది వరుసగా మూడోది కావడం విశేషం. ఫస్ట్ డే బ్రో మూవీ మంచి నెంబర్స్ రాబట్టిందని తెలుస్తోంది.

ఫస్ట్ డే బ్రో మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..

  • నైజాం : 8.45 కోట్లు
  • సీడెడ్ : 2.70 కోట్లు
  • ఉత్తరాంద్ర : 2.60 కోట్లు
  • ఈస్ట్ : 2.45 కోట్లు
  • వెస్ట్ : 2.98 కోట్లు
  • గుంటూరు : 2.51 కోట్లు
  • కృష్ణా : 1.21 కోట్లు
  • నెల్లూరు : 71 లక్షలు

ఏపీ+తెలంగాణ: 23.61 కోట్లు షేర్ (35.5 కోట్ల గ్రాస్)

  • కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 2.1 కోట్లు
  • ఓవర్సీస్: 4.30 కోట్లు

వరల్డ్ వైడ్: 30 కోట్లు షేర్(48.5 కోట్లు గ్రాస్)

ఈ లెక్కన బ్రో మూవీ పవన్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిందని సమాచారం. మరి బ్రో మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş