Tirupathi Rao
Celebrities Played Key Role Behind Youtuber Praneeth Issue: యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్టు అయిన విషయం తెలిసిందే. బెంగళూరులో ప్రణీత్ హనుమంతును అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్ తీసుకురానున్నారు.
Celebrities Played Key Role Behind Youtuber Praneeth Issue: యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్టు అయిన విషయం తెలిసిందే. బెంగళూరులో ప్రణీత్ హనుమంతును అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్ తీసుకురానున్నారు.
Tirupathi Rao
యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో ఉన్న హనుమంతును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి లోకల్ కోర్టులో ప్రణీత్ హనుమంతును ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ తీసుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రణీత్ హనుమంతును హైదరాబాద్ తీసుకురానున్నారు. అంతేకాకుండా.. మరో ముగ్గురిపై కూడా కేసులు నమోదు అయ్యాయి. వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తారని తెలుస్తోంది. ప్రణీత్ హనుమంతు ఓ వీడియోలో తండ్రీకూతుళ్ల బంధం మీద నీచమైన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తాను చేసింది తప్పే అంటూ వీడియో కూడా రిలీజ్ చేశాడు. హనుమంతు వీడియో ఎప్పుడైతే వైరల్ అయ్యిందో అప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో అతడిని అరెస్టు చేయాలి అంటూ డిమాండ్స్ వచ్చాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు సామాజిక బాధ్యతగా ప్రణీత హనుమంతును అరెస్టు చేయాలి అంటూ డిమాండ్స్ చేశారు.
టాలీవుడ్ హీరోలు, సెలబ్రిటీలు ఇలాంటి సున్నితమైన అంశాలపై ఎప్పుడూ స్పందిస్తూనే ఉంటారు. ముందుగా ఈ ఇష్యూని టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ అడ్రస్ చేశాడు. ఇలాంటి వాళ్లను వదల కూడదు అంటూ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత అసలు ఈ ఇష్యూ ఏంటి అనేది త్వరగా ప్రజల్లోకి వెళ్లింది. అందరూ ఈ సంఘటన గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. సోషల్ మీడియాలో కూడా పోస్టులు వచ్చాయి.
సాయి ధరమ్ తేజ్ తర్వాత అంతే ఎఫెక్టివ్ గా.. బలంగా స్పందించిన హీరో మంచు మనోజ్ అనే చెప్పాలి. మంచు మనోజ్ అయితే ప్రణీత్ హనుమంతుకు నేరుగానే వార్నింగ్ ఇచ్చాడు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేసి రిక్వెస్ట్ కూడా చేశాడు. మంచు మనోజ్ అభ్యర్థనకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు కూడా. కచ్చితంగా ఈ అంశంపై చర్యలు తీసుకుంటాం అంటూ హామీ కూడా ఇచ్చారు. ఇప్పుడు అది అరెస్టు వరకు వచ్చింది.
అలాగే ఈ అంశంపై మరో యంగ్ హీరో కార్తికేయ కూడా రెస్పాండ్ అయ్యాడు. నిజానికి ప్రణీత్ హనుమంతుతో కార్తికేయ తన సినిమా ప్రమోషన్స్ చేయించాడు. కానీ, ఈ సంఘటన తర్వాత తాను ప్రణీత్ హనుమంతును సంప్రదించి చాలా పెద్ద తప్పు చేశాను అంటూ కార్తికేయ రియాక్ట్ అయ్యాడు. కచ్చితంగా కఠిన చర్యలు ఉండాల్సిందే అని వ్యాఖ్యానించాడు.
కేవలం హీరోలు మాత్రమే కాదు.. ఇన్ ఫ్లు ఎన్సర్స్ కూడా ప్రణీత్ హనుమంతు ఇష్యూపై రియాక్ట్ అయ్యారు. డార్క్ కామెడీ పేరిట అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని అంతా తప్పుపట్టారు. సెలబ్రిటీలు మాత్రమే కాకుండా.. ఇన్ ఫ్లుఎన్సర్స్ కూడా ఈ అంశంపై స్పందిస్తుండటంతో ప్రజల్లోకి త్వరగా వెళ్లింది. అలాగే త్వరగా అరెస్టు వరకు వచ్చింది అంటూ అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.