iDreamPost
android-app
ios-app

సంబ‌రాల ఏటిగ‌ట్టు రిలీజ్ ఎప్పుడో ?

  • Published Sep 20, 2025 | 1:39 PM Updated Updated Sep 20, 2025 | 1:39 PM

ఈ మధ్య కాలంలో సాయి ధరమ్ తేజ్ నుంచి సినిమాలు రావడమే తగ్గిపోయింది. అప్పుడెప్పుడో దాదాపు రూ.100 కోట్లు అటూ ఇటుగా ఖ‌ర్చు చేసి రూపొందిస్తున్న సంబరాల ఏటిగ‌ట్టు మూవీని అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 25 ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు కూడా అనౌన్స్ చేసారు.

ఈ మధ్య కాలంలో సాయి ధరమ్ తేజ్ నుంచి సినిమాలు రావడమే తగ్గిపోయింది. అప్పుడెప్పుడో దాదాపు రూ.100 కోట్లు అటూ ఇటుగా ఖ‌ర్చు చేసి రూపొందిస్తున్న సంబరాల ఏటిగ‌ట్టు మూవీని అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 25 ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు కూడా అనౌన్స్ చేసారు.

  • Published Sep 20, 2025 | 1:39 PMUpdated Sep 20, 2025 | 1:39 PM
సంబ‌రాల ఏటిగ‌ట్టు రిలీజ్ ఎప్పుడో ?

ఈ మధ్య కాలంలో సాయి ధరమ్ తేజ్ నుంచి సినిమాలు రావడమే తగ్గిపోయింది. అప్పుడెప్పుడో దాదాపు రూ.100 కోట్లు అటూ ఇటుగా ఖ‌ర్చు చేసి రూపొందిస్తున్న సంబరాల ఏటిగ‌ట్టు మూవీని అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 25 ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు కూడా అనౌన్స్ చేసారు. కానీ ఆ తర్వాత అసలు సినిమా నుంచి ఎలాంటి సౌండ్ లేదు. ఇక ఇప్పుడు మూవీ పోస్ట్ పోన్ అవుతున్నట్లు వెల్లడించారు. స్ట్రైక్ వ‌ల్ల షూటింగ్ ఆస‌ల్య‌మైంద‌ని, సీజీ వ‌ర్క్‌లు కూడా పెండింగ్‌లో ఉన్నాయ‌ని అందుకే వాయిదా వేయాల్సివ‌స్తోంద‌ని చెప్పుకొచ్చారు.

దీనికి గల కారణాలు ఏమైనా కావొచ్చు. కానీ అన్ని సెట్ అయినా సెప్టెంబర్ 25 న రావడం ఇంపాసిబిల్ అని అందరికి తెలుసు. ఇప్పటికే ఆరోజు రానున్న ఓజి కోసం అందరు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సో తేజ్ ఎలాగూ ఆ ధైర్యం చేయడు. సంబ‌రాల ఏటిగ‌ట్టు టీం ఇదేదో అంతకుముందే అనౌన్స్ చేసి ఉంటే బాగుండేదని సోషల్ మీడియాలో టాక్. బడ్జెట్ సమస్యల వలన షూటింగ్ ఆగిపోయిందని ఆ మధ్య కొన్ని వార్తలు వచ్చాయి. ఆ విషయంలో కూడా మూవీ రెస్పాండ్ అవ్వలేదు. ఇక వాటిలో ఎంతవరకు నిజాలు ఉన్నాయో వారికే తెలియాలి. అయితే కాస్త ఆలస్యం అయినా కానీ క్వాలిటీ విష‌యంలో రాజీ ప‌డ‌మ‌ని, లేట్ గా వ‌చ్చినా, అంద‌రికీ న‌చ్చే సినిమా, గుర్తిండిపోయే ప్రాజెక్ట్ ఇస్తామ‌ని మూవీ టీం కాన్ఫిడెంట్ గా చెప్తుంది.

ప్రస్తుతానికైతే మూవీ ఎప్పుడు వస్తుంది అనే విషయంపై క్లారిటీ లేదు. ఈ సినిమాకు రోహిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే 90% షూటింగ్ కంప్లీట్ అయిందట. ఇంకా చాలానే పనులు ఉన్నాయి కాబట్టి 2025 లో అయితే మూవీ వచ్చేలా లేదు. 2026 సమ్మర్ కు రిలీజ్ ఉండొచ్చని టాక్ వినిపిస్తుంది. దీని గురించి టీం ఏ క్లారిటీ ఇవ్వాలి. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.