iDreamPost
android-app
ios-app

రాజకీయాలపై సాయి తేజ్ కామెంట్స్! పవన్ మామ చెప్పింది చేస్తా!

రాజకీయాలపై సాయి తేజ్ కామెంట్స్! పవన్ మామ చెప్పింది చేస్తా!

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన యంగ్ హీరోల్లో సాయి ధరమ్ తేజ్ కు మంచి ఫాలోయింగ్, క్రేజ్ ఉంది. విభిన్న కథలను ఎన్నుకుంటూ సాయి తేజ్ టాలీవుడ్ లో సముచిత స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి తేజ్ జీవితం తలకిందులు అయినట్లు ఉంది. కోమాలో ఉండి.. అసలు బతుకుతాడా? అనే స్థాయికి అతని ఆరోగ్యం క్షీణించింది. అయితే లక్కీగా సాయి తేజ్ కోలుకుని విరూపాక్ష రూపంలో మంచి హిట్టు కూడా ఇచ్చాడు. ఇప్పుడు మామతో కలిసి వినోదయ సిత్తం రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. సముద్రఖని దర్శవకత్వంలో బ్రో పేరిట ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ జులై 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా మొదటిసారి మామా అల్లుళ్లు కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ఆ క్రేజ్ మరింత పెరిగింది. ఈ సందర్భంగా సాయి తేజ్ అన్నీ ఆలయాల్లో దర్శనం చేసుకుంటున్నాడు. తాజాగా కడప అమీన్ పీర్ దర్గాను సాయి తేజ్ దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశాడు. “కడపకు వస్తే పెద్ద దర్గాను దర్శించుకోవడం ఆనవాయితీ. ప్రమాదం నుంచి బయటపడిన నాకు.. ఇది దేవుడు ఇచ్చిన పునర్జన్మ. అందుకే ఆలయాలు అన్నీ తిరుగుతూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

సినిమాల విషయానికి వస్తే.. పవన్ కల్యాణ్ మామయ్యతో నటించడం మరువలేని అనుభూతి. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. జనసేన పార్టీలోకి వస్తారా అని నన్ను అడుగుతున్నారు. రాజకీయాలపై అవగాహన ఉంటే రాజకీయాల్లో ప్రవేశించాలని మామయ్య చెప్పారు. నేను సినిమా ఫీల్డ్ లోనే ఉంటాను. మామయ్య కూడా అదే చెప్పారు. మామయ్య పవన్ కల్యాణ్ అంటే నాకు ప్రాణం. ఆయన ఏది చెబితే అదే చేస్తాను” అంటూ సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సాయి తేజ్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొందరు సాయి తేజ్ సినిమల్లోనే ఉండాలి అంటుంటే.. కొందరు మాత్రం ఆసక్తి ఉంటే కచ్చితంగా రాజకీయాల్లోకి రావాలంటూ కోరుతున్నారు.

సాయి తేజ్ అయితే తన నిర్ణయాన్ని చెప్పేశాడు. తాను సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతాను అని. ఇంక సినిమా విషయానికి వస్తే.. మొదటిసారి మామా అల్లుళ్లు కలిసి సినిమా చేయడంతో అంచనాలు పెరిగిపోయాయి. అయితే వినోదయ సిత్తం కథకు.. బ్రో టీజర్, సాంగ్స్ ఉన్న తీరుకు అస్సలు పొంతన లేకుండా ఉంది. కథను పూర్తిగా మార్చేశారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సాయి తేజ్ కోసం ఆ పాత్ర మొత్తాన్ని కొత్తగా డిజైన్ చేశారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వినోదయ సిత్తం సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. మరి బ్రో మూవీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే జులై 28 దాకా ఆగాల్సిందే.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio