iDreamPost
android-app
ios-app

అఫీషియల్ రిలీజ్ కి ముందే లీకైన బ్రో ట్రైలర్.. వైరల్ అవుతున్న వీడియో!

అఫీషియల్ రిలీజ్ కి ముందే లీకైన బ్రో ట్రైలర్.. వైరల్ అవుతున్న వీడియో!

పవన్ కల్యాణ్– సాయి ధరమ్ తేజ్ కాంబోలో సముద్రఖని దర్శవకత్వంలో తెరకెక్కుతున్న సినిమా బ్రో. ఈ సినిమా జులై 28న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తోంది. మామా- అల్లుడు యాక్టింగ్ ఎలా ఉండబోతోంది? వీళ్ల కాంబో హిట్టు కొడుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, లిరికల్ సాంగ్స్ అన్నింటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

మూవీ రిలీజ్ కు ముహూర్తం దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ట్రైలర్ ని లాంఛ్ చేసేందుకు మూవీ టీమ్ సిద్ధమైంది. రెండ్రోజుల క్రితమే జులై 22న మూవీ ట్రైలర్ లాంఛ్ చేస్తామని వెల్లడించారు. సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ లాంఛ్ చేస్తాంటూ చెప్పారు. అయితే అంతకన్నా ముందే ఈ సినిమా ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో బ్రో మూవీ ట్రైలర్ ప్రత్యక్షమవడంతో ఫ్యాన్స్ అంతా షాకయ్యారు. థియేటర్లలో ట్రైలర్ రిలీజ్ చేయగా దానిని రికార్డ్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఆ వీడియోకి సౌండ్ లేకుండా ఉంది. అది చూసిన ఫ్యాన్స్ ఒకింత అసహం వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్ లాంఛ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ని ఈ లీకుల వీరులు నిరాశ పరిచారు.

ఇలా మీరు పోస్ట్ చేయకుండా ఉన్నా బాగుడేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్ మీద పెట్టుకున్న అంచనాలను చెడగొట్టారు అంటారు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమా విషయానికి వస్తే.. సముద్రఖని రాసుకుని, డైరక్ట్ చేసి నటించిన వినోదయ సిత్తం మూవీకి రీమేక్ ఇది. తెలుగులో స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ రాయగా.. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నాడు. ఒరిజినల్ సినిమాకి బ్రో మూవీకి ఎలాంటి పోలిక ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఆ సినిమాలో తంబి రామయ్య పెళ్లై.. పిల్లలు ఉన్న పాత్రలో నటించారు. కానీ, ఆ పాత్రను సాయి ధరమ్ తేజ్ పోషిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ స్టోరీ లైన్ మారిపోతుంది. ఆ ఎమోషన్ ని అన్న- చెల్లెలు మధ్య ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetbaba girişgrandpashabet