ఎస్ఆర్ కళ్యాణ మండపం సూపర్ హిట్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం కొత్త సినిమా సమ్మతమే బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. గీతా డిస్ట్రిబ్యూషన్ లాంటి పెద్ద సంస్థ అండతో థియేట్రికల్ బిజినెస్ తక్కువగా చేసినప్పటికీ అంత మొత్తాన్ని షేర్ రూపంలో రాబట్టలేక ఫెయిలయింది. కాకపోతే సెబాస్టియన్ కంటే మెరుగ్గా పెర్ఫార్మ్ చేయడం ఊరట కలిగించే అంశం. ఇప్పుడీ సినిమా ఓటిటి ప్రీమియర్ కి రెడీ అయిపోయింది. జూలై […]
రాజావారు రాణిగారుతో మంచి డెబ్యూ అందుకుని రెండో చిత్రం ఎస్ఆర్ కళ్యాణమండపంతో ఊహించని సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం కొత్త మూవీ సమ్మతమే ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా ఎనిమిది సినిమాలు రావడం ఈ మధ్యకాలంలో జరగలేదు. వాటిలో అంతో ఇంతో అంచనాలు సాఫ్ట్ కార్నర్ ఉన్నది దీనికే. ప్రమోషన్లు కూడా గట్టిగానే చేశారు. సెబాస్టియన్ భారీ ఫ్లాప్ కావడంతో కిరణ్ ఆశలు దీని మీదే ఉన్నాయి. రాబోయే రోజుల్లో అన్ని […]
రాజావారు రాణిగారుతో పరిచయమై ఎస్ఆర్ కళ్యాణమండపంతో సూపర్ హిట్ కొట్టిన హీరో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా సమ్మతమే. గోపినాధ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిన ఈ లవ్ ఎంటర్ టైనర్ కరోనా వల్ల రెండు మూడు తేదీలు మారాల్సి వచ్చింది. ఫైనల్ గా జూన్ 24 విడుదల తేదీని లాక్ చేసుకుంది. ఎక్కువగా వెబ్ సిరీస్ లు ఇండిపెండెంట్ మూవీస్ లో కనిపించే కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి ఇందులో హీరోయిన్. గతంలో […]
రాజావారు రాణిగారుతో డీసెంట్ డెబ్యూ అందుకుని గత ఏడాది ఎస్ఆర్ కళ్యాణమండపంతో సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన సినిమా సెబాస్టియన్. దీని మీద మొదట్లో పెద్దగా అంచనాలు లేవు కానీ ట్రైలర్ వచ్చాక ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. కాన్సెప్ట్ వెరైటీగా ఉండటంతో ప్రమోషన్లు హైప్ పెంచడానికి తోడయ్యాయి. ఆడవాళ్లు మీకు జోహార్లుతో క్లాష్ కి సిద్ధ పడిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కు బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించగా సిద్ధారెడ్డి ప్రమోద్ లు […]
ఎస్ఆర్ కళ్యాణమండపంతో గత ఏడాది సంచలన విజయం అందుకుని అనూహ్యంగా మార్కెట్ తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన సెబాస్టియన్ మార్చి 4న విడుదల కానుంది. శర్వానంద్ ఆడవాళ్ళూ మీకు జోహార్లుతో పాటు హాలీవుడ్ మూవీ బ్యాట్ మ్యాన్ తో నేరుగా క్లాష్ చేయబోతున్న ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఇవాళ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో సిద్ధారెడ్డి-ప్రమోద్ లు దీన్ని నిర్మించారు. టీజర్ […]
థియేటర్లకు సినిమాలు వదలాలా వద్దా అనే సంశయంలో ఉన్న ఇండస్ట్రీకి తగినంత ఉత్సాహాన్ని ఇచ్చింది ముమ్మాటికీ ఎస్ఆర్ కళ్యాణమండపం మూవీనే. మొదటి మూడు రోజులు వచ్చిన కలెక్షన్లు చూసి ట్రేడ్ సైతం షాక్ అవ్వడం అబద్దం కాదు. నాలుగున్నర కోట్ల దాకా బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం ఆల్రెడీ ఆరు కోట్లకు పైగా షేర్ రాబట్టి దాదాపు రెట్టింపు లాభం వైపు దూసుకుపోతోంది. పాగల్ లాంటి కొత్త చిత్రాలు వచ్చిన నేపథ్యంలో ఎస్ఆర్ కళ్యాణమండపం ఇప్పటికే స్లో […]
జనం థియేటర్లో సినిమాలు చూసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేందుకు ఇంత కన్నా మంచి ఉదాహరణ అక్కర్లేదు. మినిమమ్ కంటెంట్ ఉంటే చాలు మూడు నెలల ఎడబాటుని తీర్చుకోవడం కోసం వెండితెర వినోదాన్ని అందుకునేందుకు ఎంతగా వేచి చూస్తున్నారో మొన్న శుక్రవారం విడుదలైన ఎస్ఆర్ కళ్యాణమండపం వసూళ్లు ఋజువుగా నిలుస్తున్నాయి. నిజానికి దీనికి రివ్యూస్ గొప్పగా రాలేదు. పబ్లిక్ లోనూ ఎక్స్ ట్రాడినరి అనే మాటా వినిపించలేదు. నిరాశపరచకుండా టైం పాస్ చేయించి ఎమోషనల్ గా వర్కౌట్ చేశారనే […]
రేపు రాబోతున్న ఎస్ఆర్ కళ్యాణమండపం సాధారణ పరిస్థితుల్లో విడుదలయ్యుంటే ఇప్పుడున్న బజ్ లో సగం రావడం కూడా కష్టమయ్యేది. రాజావారు రాణిగారు అనే చిన్న సినిమాతో ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీధర్ గాదెని దర్శకుడిగా పరిచయం చేస్తూ కొత్త నిర్మాణ సంస్థ రూపొందించిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 400కి పైగా స్క్రీన్లలో రిలీజ్ అవుతోందంటే ఆశ్చర్యం కలగకమానదు. అంతే కాదు థియేట్రికల్ బిజినెస్ సుమారుగా 4 కోట్ల 60 […]