iDreamPost
android-app
ios-app

కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ నుంచి వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ సాంగ్ ప్రోమో..

  • Published Aug 18, 2024 | 12:40 PM Updated Updated Aug 18, 2024 | 12:40 PM

Kiran Abbavaram 'KA' Movie Song Promo: ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. తాజాగా ఈ హీరో నటిస్తున్న సినిమా 'క'. ఆల్రెడీ ఈ మూవీ మీద ఇంట్రెస్టింగ్ బజ్ స్టార్ట్ అయింది. ఈ క్రమంలో తాజాగా 'క' మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Kiran Abbavaram 'KA' Movie Song Promo: ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. తాజాగా ఈ హీరో నటిస్తున్న సినిమా 'క'. ఆల్రెడీ ఈ మూవీ మీద ఇంట్రెస్టింగ్ బజ్ స్టార్ట్ అయింది. ఈ క్రమంలో తాజాగా 'క' మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Aug 18, 2024 | 12:40 PMUpdated Aug 18, 2024 | 12:40 PM
కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ నుంచి వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ సాంగ్ ప్రోమో..

రాజావారు రాణిగారు సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు కిరణ్ అబ్బవరం. అలాంటి ఓ కల్ట్ క్లాసిక్ సినిమా తర్వాత కిరణ్ ఖాతాలో సరైన హిట్ పడలేదనే చెప్పి తీరాలి. వచ్చిన ఆఫర్ ను వచ్చినట్లు అందిపుచ్చుకున్నా కూడా.. ఆ సినిమాలు మాత్రం కిరణ్ కు ట్రోలింగ్స్ నే మిగిల్చాయి. ఇక ఇప్పుడు అవన్నీ పక్కపెట్టేసి.. స్వయంగా తానే ఓ సినిమాను నిర్మించబోతున్నాడు కిరణ్. అదే ‘క’ . ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి బజ్ గురించి చూసే ఉంటారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

‘క’ ఇప్పటివరకు ఇలాంటి టైటిల్ ఎక్కడా విని ఉండరు. ఇలాంటి వెరైటీ టైటిల్ ను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి.. మూవీపై భారీ బజ్ నెలకొంది. ఇక ఆ తర్వాత విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అసలు దీని వెనుక కథ ఏమై ఉంటుందా.. అనే ఆసక్తి అందరిలో పెరిగిపోయింది. దీనితో మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో ఆగస్టు 19న ‘వరల్డ్ ఆఫ్ వాసుదేవ్’ అనే ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. కాగా ఈ సాంగ్ ప్రోమోను ఆగస్టు 18న రిలీజ్ చేశారు. 90’s బ్యాక్డ్రాప్ లో.. పల్లెటూరి వాతావరణం చూపిస్తూ వచ్చిన ఈ సాంగ్ ప్రోమో.. బాగానే అనిపిస్తుంది. మరి కంప్లీట్ సాంగ్ ఎలా ఉండబోతుందో చూడాలి.

కాగా ఈ సినిమాకు సుజిత్ అండ్ సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ మూవీ అయినా కిరణ్ కు టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందో లేదో చూడాలి. ఒకవేళ ఈ మూవీ కనుక హిట్ అయితే.. కిరణ్ అబ్బవరం వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఇంకా సినిమా నుంచి క్లియర్ అప్ డేట్స్ రాకముందే.. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు రూ.30 కోట్ల మేర జరిగినట్లు సమాచారం. మరి రిలీజ్ తర్వాత ‘క’ మూవీ ఎలాంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. ఈ సినిమాను సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ త్వరలోనే రివీల్ చేయనున్నారు మేకర్స్. మరి ఈ మూవీ లేటెస్ట్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.