iDreamPost
android-app
ios-app

KA Teaser: ‘క’ టీజర్.. కిరణ్ అబ్బవరం సరికొత్త ప్రయోగం! మనిషి కాదు.. తోడేలు!

  • Published Jul 15, 2024 | 12:12 PM Updated Updated Jul 15, 2024 | 5:19 PM

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం బర్త్ డే సందర్భంగా 'క' మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. పీరియాడికల్, మిస్టరీ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. ఈసారి కిరణ్ కొత్తగా ట్రై చేసి.. పాన్ ఇండియా రేంజ్ లో హిట్టు కొట్టబోతున్నట్లు అనిపిస్తోంది. ఇక టీజర్ ఎలా ఉందంటే?

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం బర్త్ డే సందర్భంగా 'క' మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. పీరియాడికల్, మిస్టరీ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. ఈసారి కిరణ్ కొత్తగా ట్రై చేసి.. పాన్ ఇండియా రేంజ్ లో హిట్టు కొట్టబోతున్నట్లు అనిపిస్తోంది. ఇక టీజర్ ఎలా ఉందంటే?

  • Published Jul 15, 2024 | 12:12 PMUpdated Jul 15, 2024 | 5:19 PM
KA Teaser: ‘క’ టీజర్.. కిరణ్ అబ్బవరం సరికొత్త ప్రయోగం! మనిషి కాదు.. తోడేలు!

ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసిన తర్వాత హీరోలు తమ పంథాను మార్చి.. విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. అలా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఓ పీరియాడికల్, మిస్టరీ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. ఆ సినిమానే ‘క’. కిరణ్ బర్త్ డే(జూలై 15) సందర్భంగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మెస్మరైజింగ్ విజువల్స్, థ్రిల్లింగ్ ఎలివేషన్స్ తో ఆకట్టుకున్నాడు కిరణ్. ఇది అతడి నుంచి సరికొత్త ప్రయోగమనే చెప్పాలి. మరి ఈ సరికొత్త పాన్ ఇండియా ప్రయోగం ఎలా ఉందో ఈ టీజర్ రివ్యూలో చూద్దాం.

కిరణ్ అబ్బవరం.. ‘రాజావారు రాణీగారు’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఎస్ఆర్ కళ్యాణమండపం మూవీతో మంచి సక్సెస్ కొట్టాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ‘క’ అనే ఓ పీరియాడికల్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో రాబోతున్నాడు. కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ జూలై 15న ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు. ‘నువ్వు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావ్? పక్కవాళ్ల ఉత్తరాలు చదివే అలవాటేంటి?’ అంటూ ఆసక్తికరంగా ఈ టీజర్ మెుదలౌతుంది. నువ్వు మనిషివి కాదు.. తోడేలు అనే డైలాగ్ తో ఎండ్ అవుతుంది.

కాగా.. క మూవీలో కిరణ్ అబ్బవరం పోస్ట్ మెన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ముసుగులో అతడు మరికొన్ని దాస్తున్నాడని టీజర్ చూస్తేనే అర్ధం అవుతుంది. అయితే ఆ ఉత్తరాలే అతడి జీవితాన్ని మార్చివేస్తాయా? లేక అతడి జీవితంలో  ఏదైనా మర్చిపోలేని సంఘటనలు ఉన్నాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. సెట్ వర్క్, కెమెరామెన్ పనితనం పీరియాడికల్ లుక్ ను తీసుకురావడంలో పూర్తిగా సఫలం అయ్యారనే చెప్పాలి. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. టీజర్ ఎక్కువ శాతం షాట్స్ చీకట్లో తీసినవే చూపించారు. ఇక ఇందులో కిరణ్ కొత్తగా కనిపించాడు. తన నట విశ్వరూపాన్ని చూపాడు. ‘క’ సరికొత్త ప్రయోగం చేస్తున్నాడని టీజర్ చూస్తేనే అర్ధం అవుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీకి సుజీత్, సందీప్ అనే ఇద్దరు దర్శకులు వర్క్ చేశారు. ‘క’ మూవీని ఏకంగా రూ. 20 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విడుదల చేయనున్నారని సమాచారం. మరి టీజర్ తో ఆకట్టుకున్న కిరణ్.. మూవీ విడుదల అయ్యాక ఏ రేంజ్ సక్సెస్ కొడతాడో వేచి చూడాలి.

 

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio