K Ramp Movie Review In Telugu : 'క' రూపంలో గత ఏడాది దీపావళి కిరణ్ అబ్బవరంకు బాగానే కలిసి వచ్చింది. ఇక ఈ ఏడాది దీపావళికి కె ర్యాంప్ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో కిరణ్ ఎంట్రీ ఇచ్చాడు. సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తో పాటు కిరణ్ చేసిన మూవీ ప్రమోషన్స్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ఇక సినిమా ప్రేక్షకులకు ఎలా అనిపించిందో రివ్యూలో చూసేద్దాం.
K Ramp Movie Review In Telugu : 'క' రూపంలో గత ఏడాది దీపావళి కిరణ్ అబ్బవరంకు బాగానే కలిసి వచ్చింది. ఇక ఈ ఏడాది దీపావళికి కె ర్యాంప్ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో కిరణ్ ఎంట్రీ ఇచ్చాడు. సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తో పాటు కిరణ్ చేసిన మూవీ ప్రమోషన్స్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ఇక సినిమా ప్రేక్షకులకు ఎలా అనిపించిందో రివ్యూలో చూసేద్దాం.
Swetha
‘క’ రూపంలో గత ఏడాది దీపావళి కిరణ్ అబ్బవరంకు బాగానే కలిసి వచ్చింది. ఇక ఈ ఏడాది దీపావళికి ‘కె ర్యాంప్’ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో కిరణ్ ఎంట్రీ ఇచ్చాడు. సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తో పాటు కిరణ్ చేసిన మూవీ ప్రమోషన్స్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ఇక సినిమా ప్రేక్షకులకు ఎలా అనిపించిందో రివ్యూలో చూసేద్దాం.
కథ :
సాయికుమార్ ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ . అల్లరి చిల్లరిగా తిరిగే కిరణ్ అబ్బవరం అతని కొడుకు. తన కొడుకుకి చదువు అబ్బడం లేదని కేరళలోని ఓ కాలేజ్ లో జాయిన్ చేస్తాడు సాయికుమార్. అక్కడ మొదటి చూపులోనే యుక్తి తరేజా తో ప్రేమలో పడతాడు కిరణ్. అక్కడినుంచి అసలు కథ మొదలవుతుంది. ఆమెకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దానికి వలన కిరణ్ ఇబ్బందుల్లో పడతాడు ? చివరికి కిరణ్ తన నాన్న గురించి తెలుసుకున్న విషయాలు ఏంటి ? ఆమె సమస్యకు కిరణ్ పరిష్కారం చూపించాడా లేదా ? చివరికి ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే వెండితెరమీద ఈ సినిమా చూడాల్సిందే.
నటీనటులు , టెక్నీకల్ టీం పనితీరు :
నటీనటుల విషయానికొస్తే ముందుగా చెప్పుకోవాల్సింది కిరణ్ అబ్బవరం గురించే. తన పాత్రలో చాలా ఈజ్ తో ఒదిగిపోయాడు. ఓ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ గా.. అల్లరి చిల్లరగా తిరిగే ఓ రిచ్ కొడుకుగా.. కామిడి చేస్తూ అందిరిని నవ్వించాడు. ఓవరాల్ గా తన పాత్రకు పూర్తి న్యాయం చేసి సక్సెస్ అయ్యాడు కిరణ్. ఆ తర్వాత చెప్పుకోదగిన పాత్ర , సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర సాయి కుమార్ ది. అలాగే నరేష్ కూడా స్క్రీన్ మీద ఉన్నంత సేపు నవ్వించి అలరించాడు. ఇక హీరోయిన్ యుక్తి విషయానికొస్తే.. తన క్యారెక్టర్ కు కూడా బాగానే స్కోప్ ఉంది కానీ అది కంప్లీట్ గా బయటకు రాలేదనిపించింది. ఇక మిగిలిన వారంతా వారి వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేసి.. మూడు గంటలసేపు ఆడియన్స్ ను ఎంగేజ్ చేశారు.
టెక్నీకల్ టీమ్ విషయానికొస్తే.. రాసుకున్న కథను అలాగే తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. కామిడి విషయంలో అసలు ఎక్కడా కూడా వెనుకడుగు వేయలేదు. సాంగ్స్ , బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కథకు సింక్ లోనే ఉన్నాయి. ఇక విజువల్స్ కూడా మంచిగా చిత్రీకరించారు. సినిమాటోగ్రఫీ కలర్ ఫుల్ గా ఉంది. కాకపోతే ఎడిటింగ్ విషయంలో కాస్త కేర్ తీసుకుంటే బావుండేదనే ఫీల్ కలుగుతుంది. ఓవరాల్ గా టెక్నీకల్ టీం తమ నుంచి పూర్తి ఎఫర్ట్స్ అందించారని చెప్పొచ్చు.
విశ్లేషణ :
కథలో కొత్తదనం ఉందని అనిపించదు కానీ.. కథనంలో మాత్రం కొత్తదనం ఉంది. లాజిక్స్ వెతకకుండా ఓ లవ్ స్టోరీ చూసి నవ్వుకోవాలి అంటే ఈ సినిమా బెటర్ చాయిస్. పైగా లాజిక్స్ వెతకొద్దని సినిమా టీం ముందే అనౌన్స్ చేసేసింది. డైరెక్టర్ కూడా దానికి తగినట్టుగానే కథ రాసుకున్నాడు. బాగా డబ్బు ఉందని తండ్రే కొడుకుని గారాబం చేస్తే.. చివరికి ఆ కొడుకు దారి తప్పుతాడు. ఇలాంటి కథలు ఇప్పటికి చాలా వచ్చాయి. ఇది కూడా దాదాపు అలాంటి ఫార్మాట్ ఏ. అయితే మరీ డీప్ గా వెళ్లకుండా ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా. దీని చుట్టూ కొన్ని కామిడి లేయర్స్ రాసుకున్నాడు దర్శకుడు. వన్ లైనర్స్ కూడా బాగానే ఉన్నాయి. కిరణ్ అబ్బవరం స్టైల్ లు కరెక్ట్ గా సూట్ అయ్యాయి.
మూవీ స్టార్ట్ అయిన మొదటి 15నిముషాల తర్వాత కథ కాలేజ్ కు షిఫ్ట్ అవుతుంది. తర్వాత అంతా ప్రెడిక్టబిల్ గానే ఉంటుంది. హీరో హీరోయిన్ తో ప్రేమలో పడడం. ఆమెను పడేయడం కోసం తిప్పలు పడడం. ఆ తర్వాత హీరోయిన్ కు ఉన్న సమస్య బయటపడడం.. దాని కోసం హీరో పడే పాట్లు , టెన్షన్స్ ఇవన్నీ ఫన్నీ వే లోనే చూపించారు. అలా మొదటి హాఫ్ కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ ఆఫ్ లో కథ కొంచెం సీరియస్ గా సాగి హీరో తన తండ్రి గురించి తెలుసుకోవడం.. లాంటివి జరుగుతాయి. లాజిక్ లు వెతకకుండా సినిమా చూస్తే ఎంజాయ్ చేయొచ్చు. కామిడి కూడా పూర్తిగా కాకపోయినా ఉన్నంతలో బాగానే నవ్వించింది.
ప్లస్ లు :
నటీనటులు
సినిమాటోగ్రఫీ
వన్ లైనర్స్
మైనస్ లు :
ఫస్ట్ హాఫ్ (కొన్ని సీన్స్)
కథ కొత్తగా లేకపోవడం
రేటింగ్ : 2.75/5
చివరిగా : లాజిక్ లేకుండా కామిడిని ఎంజాయ్ చేయాలనుకునేవారి కోసం ఈ కె ర్యాంప్