Swetha
అడపా దడపా కిరణ్ అబ్బవరం గురించి ఎదో ఒక న్యూస్ వింటూనే ఉన్నాము. అతని సినిమాలు కూడా ప్రేక్షకులను బాగానే మెప్పిస్తున్నాయి. సొంత బ్యానర్ స్టార్ట్ చేయడం తానె ప్రోడ్యుసర్ గా వ్యవహరించి.. కొత్త వారికి అవకాశాలు ఇవ్వడం ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్తున్నాడు ఈ యంగ్ హీరో
అడపా దడపా కిరణ్ అబ్బవరం గురించి ఎదో ఒక న్యూస్ వింటూనే ఉన్నాము. అతని సినిమాలు కూడా ప్రేక్షకులను బాగానే మెప్పిస్తున్నాయి. సొంత బ్యానర్ స్టార్ట్ చేయడం తానె ప్రోడ్యుసర్ గా వ్యవహరించి.. కొత్త వారికి అవకాశాలు ఇవ్వడం ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్తున్నాడు ఈ యంగ్ హీరో
Swetha
అడపా దడపా కిరణ్ అబ్బవరం గురించి ఎదో ఒక న్యూస్ వింటూనే ఉన్నాము. అతని సినిమాలు కూడా ప్రేక్షకులను బాగానే మెప్పిస్తున్నాయి. సొంత బ్యానర్ స్టార్ట్ చేయడం తానె ప్రోడ్యుసర్ గా వ్యవహరించి.. కొత్త వారికి అవకాశాలు ఇవ్వడం ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్తున్నాడు ఈ యంగ్ హీరో. ఇక మార్చి నెలలో వచ్చిన దిల్ రుబా అంతగా ఆకట్టుకోలేదన్న సంగతి తెలియనిది కాదు. ఆ సమయంలో పెద్ద షాక్ ఏ తిన్నాడు కిరణ్. కానీ ఇప్పుడు కె ర్యాంప్ తో ఆ వెలితిని పోగొట్టడానికి రెడీ అయ్యాడు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన గ్లిమ్ప్స్ రిలీజ్ అయింది.
ఈ సినిమాతో కిరణ్ రూట్ మార్చేశాడేమో అనిపిస్తుంది.అతని బాడీ లాంగ్వేజ్, పెర్ఫార్మెన్స్ , డైలాగ్ డెలివెరి చాలా కొత్తగా అనిపించాయి. అక్టోబర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కేరళలో జరిగే కాలేజీ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి కిరణ్ అబ్బవరం మీద సినిమాలలో సీరియస్ గా కనిపిస్తాడని కంప్లైంట్ ఉండేది. కానీ ఈ ఒక్క టీజర్ తో అది తుడిచిపెట్టుకుపోతుందని చెప్పేయొచ్చు. కంప్లీట్ కామిడి జోన్ లోకి వచ్చేసాడు ఈ యంగ్ హీరో. అలా అని మాస్ టచ్ వదిలేసాడా అంటే లేదు.. మాస్ ప్లస్ కామిడీ రెండిటిని పండించి.. ఫైనల్ గా గ్లిమ్ప్స్ తో వైరల్ అయిపోతున్నాడు కిరణ్ అబ్బవరం. చూడబోతుంటే కిరణ్ అబ్బవరం ఖాతాలో ఇంకో హిట్ రెడీ అయినట్లే అని అనిపిస్తుంది.
ఈ హీరోకు బాక్స్ ఆఫీస్ తత్వం ఎప్పుడో బోధపడింది. దీనితో కె ర్యాంప్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. పైగా చెన్నై లవ్ స్టోరీ గ్లిమ్ప్స్ కూడా అదిరిపోయింది. ఇప్పుడు కిరణ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు రెడీగా ఉన్నాయి. ఇక ఇది కాకుండా కిరణ్ నిర్మాతగా తిమ్మరాజు పల్లె టీవీ అనే ఓ చిన్న సినిమా తీసాడు. చాలా డీసెంట్ బడ్జెట్ తో కొత్తవాళ్లతో ఈ సినిమాను కంప్లీట్ చేసాడు. కె ర్యాప్ కంటే ముందే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుందట. ఇక ముందు ముందు ఈ సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.