iDreamPost
android-app
ios-app

కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

  • Published Jul 09, 2025 | 10:41 AM Updated Updated Jul 09, 2025 | 10:41 AM

ఇండస్ట్రీలో నెగ్గుగుకుని రావడం అనేది అంత ఈజీ కాదు. దాని వెనుక ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది. ఒక్కోసారి ఎంత హార్డ్ వర్క్ చేసిన కానీ అవకాశాలు అనేవి అరుదుగా వస్తూ ఉంటాయి. అలా ఎన్నో ఆటంకాలను దాటుకుని.. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. సొంతంగా క అనే ప్రొడక్షన్ ను స్టార్ట్ చేసిన సంగతి కూడా తెలిసిందే.

ఇండస్ట్రీలో నెగ్గుగుకుని రావడం అనేది అంత ఈజీ కాదు. దాని వెనుక ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది. ఒక్కోసారి ఎంత హార్డ్ వర్క్ చేసిన కానీ అవకాశాలు అనేవి అరుదుగా వస్తూ ఉంటాయి. అలా ఎన్నో ఆటంకాలను దాటుకుని.. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. సొంతంగా క అనే ప్రొడక్షన్ ను స్టార్ట్ చేసిన సంగతి కూడా తెలిసిందే.

  • Published Jul 09, 2025 | 10:41 AMUpdated Jul 09, 2025 | 10:41 AM
కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

ఇండస్ట్రీలో నెగ్గుగుకుని రావడం అనేది అంత ఈజీ కాదు. దాని వెనుక ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది. ఒక్కోసారి ఎంత హార్డ్ వర్క్ చేసిన కానీ అవకాశాలు అనేవి అరుదుగా వస్తూ ఉంటాయి. అలా ఎన్నో ఆటంకాలను దాటుకుని.. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. సొంతంగా క అనే ప్రొడక్షన్ ను స్టార్ట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. అదే ప్రొడక్షన్స్’లో ‘క’ అనే చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు ఈ హీరో. ఇక ఇప్పుడు అదే బ్యానర్ నుంచి కిరణ్ అబ్బవరం నిర్మాతగా ఓ కొత్త సినిమాతో రాబోతున్నాడు. దానికి సంబందించిన విషయాలు ఇలా ఉన్నాయి.

వరుస సినిమాలతో కిరణ్ అబ్బవరం తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. షాట్ ఫిలిమ్స్ తో మొదలైన తన జర్నీ ఈరోజు ఇండస్ట్రీలో ఓ మంచి హీరోగా పేరు తెచ్చుకునేలా చేసింది. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ కాకపోయినా.. కిరణ్ అబ్బవరం సినిమాలు డీసెంట్ హిట్స్ నే అందుకుంటున్నాయి. ప్రస్తుతానికి కిరణ్ అబ్బవరం రెండు సినిమాలలో హీరోగా బిజీగా ఉన్నాడు. ఓ వైపు హీరోగా బిజీగా ఉంటూనే తన సొంత బ్యానర్ నుంచి మరో సినిమాను అనౌన్స్ చేయబోతున్నట్లు అప్డేట్ ఇచ్చాడు ఈ హీరో. అంటే ఇండస్ట్రీ నుంచి మరో హీరో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడన్నమాట.

మరో విశేషం ఏంటంటే.. తన కొత్త సినిమాలో హీరోగా తన గత చిత్రాలకు కెమెరా అసిస్టెంట్ గా వర్క్ చేసిన అతనిని ఎంచుకున్నాడట కిరణ్ అబ్బవరం. ఏదేమైనా ఈ విషయంలో కిరణ్ ను అభినందించాల్సిందే. తానూ ఎలా అయితే ఎలాంటి సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి నిలదొక్కుకున్నాడో. ఇప్పుడు అలాంటి కసి సంకల్పం పట్టుదల ఉన్న వారిని ఎంకరేజ్ చేస్తూ అవకాశాలు ఇస్తున్నాడు ఈ హీరో. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అసలు ఈ సినిమా ఏంటి అనే దానితో పాటు ఈ సినిమాకు సంబందించిన మరిన్ని విషయాలు జూలై 10న అనౌన్స్ చేయబోతున్నట్లు. సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు కిరణ్ అబ్బవరం. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.