iDreamPost
android-app
ios-app

‘క’సినిమాకు దిమ్మతిరిగే బిజినెస్.. మాయ చేసిన కిరణ్ అబ్బవరం!

  • Published Jul 25, 2024 | 12:51 PMUpdated Jul 25, 2024 | 12:57 PM

Kiran Abbavaram: ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో వరుసగా చిన్న సినిమాలు కమర్షియల్ హిట్ అందుకుంటున్నాయి. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఎలాంటి సినిమాకైనా అద్భుత విజయాన్ని కట్టబెడతారని రుజువు చేస్తున్నారు.

Kiran Abbavaram: ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో వరుసగా చిన్న సినిమాలు కమర్షియల్ హిట్ అందుకుంటున్నాయి. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఎలాంటి సినిమాకైనా అద్భుత విజయాన్ని కట్టబెడతారని రుజువు చేస్తున్నారు.

  • Published Jul 25, 2024 | 12:51 PMUpdated Jul 25, 2024 | 12:57 PM
‘క’సినిమాకు దిమ్మతిరిగే బిజినెస్.. మాయ చేసిన కిరణ్ అబ్బవరం!

ఇటీవల షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన వారు ఇండస్ట్రీలో హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో కొంతమంది సక్సెస్ అవుతున్నారు. అలా 2019లో రాజా వారు రాణి గారు మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. ఈ మూవీ పెద్దగా గుర్తింపు తీసుకురాకపోయినా.. తర్వాత వచ్చిన ‘ SR కళ్యాణ మండపం’కాస్త పరవాలేదు అనిపించింది. తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయినా.. హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల కిరణ్ అబ్బవరం నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోతున్నాయి.  తాజాగా కిరణ్ అబ్బవరం జాక్ పాట్ కొట్టినట్లు ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం చిన్న సినిమాల హవా నడుస్తుంది.. కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమాలైన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా దర్శక ద్వయం సుజీత్- సందీప్ ఇద్దరు కలిసి ‘క’ మూవీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలనే ఆకాంక్షతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలీటీ మూవీగా నిర్మిస్తున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతుంది ఈ చిత్రం. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ ఫిలమ్ సర్కిల్స్ లో మంచి రెస్పాన్స్ సంపాదించింది. విరూపాక్ష టైప్ మిస్టీరియస్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ‘క’ థియేట్రికల్ బిజినెస్ కి సైతం మంచి క్రేజ్ ఏర్పడింది. తాజాగా 30 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. 

ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ అమ్మకాలు ముగిశాయి.. పొలిమేర – 3 నిర్మాత నందిపాటి వంశి రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు కొనుగోలు చేసినట్లు సమాచారం. 13 కోట్ల నుంచి బేరం మొదలు కాగా.. మొత్తానికి 12 కోట్లతో డీల్ ఓకే అయినట్లు ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది.  అలాగే ఇతర భాషల థియేట్రికల్ హక్కులతో పాటు అన్ని భాషల్లో నాన్-థియేట్రికల్ హక్కులు ₹18 కోట్లకు అమ్ముడయినట్లు సమాచారం.  ఇటీవల వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న కిరణ్ ఈ రేంజ్ బిజినెస్ చేయడం మామూలు విషయం కాదు.. ఒక రకంగా మనోడు జక్ పాట్ కొట్టాడని అంటున్నారు. తన మార్కెట్ పరిధి మించి ‘క’ మూవీ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ ఏడాది థియేటర్లోకి రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీకి సామ్ సి యస్ సంగీతం అందిస్తున్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి