iDreamPost
android-app
ios-app

Kiran Abbavaram: ‘క’ టీజర్ తోనే జాక్ పాట్ కొట్టిన కిరణ్ అబ్బవరం!

  • Published Jul 19, 2024 | 5:48 PM Updated Updated Jul 19, 2024 | 5:48 PM

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ 'క'. ఇటీవలే విడుదలైన టీజర్ కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే అబ్బవరం జాక్ పాట్ కొట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ 'క'. ఇటీవలే విడుదలైన టీజర్ కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే అబ్బవరం జాక్ పాట్ కొట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Jul 19, 2024 | 5:48 PMUpdated Jul 19, 2024 | 5:48 PM
Kiran Abbavaram: ‘క’ టీజర్ తోనే జాక్ పాట్ కొట్టిన కిరణ్ అబ్బవరం!

కిరణ్ అబ్బవరం.. సైలెంట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ స్పెషల్ క్రేజ్ ను ఏర్పరచుకున్నాడు. ‘రాజావారు రాణీ గారు’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం సుజీత్, సందీప్ అనే దర్శకులతో ‘క’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఇటీవలే కిరణ్ అబ్బవరం పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన టీజర్ కు ఊహించని రేంజ్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో థియేట్రికల్ బిజినెస్ కు సాలిడ్ ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాలను చూసే తీరు పూర్తిగా మారిపోయింది. టీజర్, ట్రైలర్ ను చూసి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. దాంతో మేకర్స్ సైతం వీటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభిమానుల అభిరుచులకు అనుగుణంగా టీజర్, ట్రైలర్స్ ను కట్ చేస్తూ.. సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. దాంతో బిజినెస్ కూడా భారీ స్థాయిలో పెరుగుతుంది అన్నది మేకర్స్ ఆలోచన. ప్రస్తుతం ఇదే స్ట్రాటజీని ఫాలో అయినట్లు ఉన్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఇతడు లేటెస్ట్ గా నటించిన ‘క’ చిత్ర టీజర్ ను ఇటీవలే బర్త్ డే కానుకగా విడుదల చేశారు. ఇక ఈ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.

టీజర్ ఇంప్రెసివ్ గా ఉండటంతో.. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు రూ. 10 నుంచి 12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఓ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మూవీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ క్వాలిటీ, జానర్ చూసే ఈ మూవీని సాలిడ్ రేట్స్ కు కోనుగోలు చేశారు. ఇక ఓవర్సీస్, నాన్ థియేట్రికల్, డిజిటల్ హక్కులన్నీ కలిపితే కిరణ్ అబ్బవరంకు తిరుగుండదనే చెప్పాలి. మరి టీజర్ తోనే ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న ఈ కుర్ర హీరో సినిమా వచ్చాక  ఏ రేంజ్ సంచలనం సృష్టిస్తాడో వేచి చూడాలి. ఇక ఈ మూవీలో కిరణ్ కు జోడీగా నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తుండగా సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ‘క’ మూవీకి ఈ రేంజ్ బిజినెస్ జరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio