iDreamPost
android-app
ios-app

‘రాజావారు రాణిగారు’ హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా.?

  • Published Sep 15, 2024 | 12:30 AM Updated Updated Sep 15, 2024 | 12:30 AM

Raja Vaaru Rani Gaaru: ‘రాజావారు రాణిగారు’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. ఈ మూవీ హీరోయిన్ రహస్యతో ప్రేమలో పడి.. ఇటీవల వివాహం చేసుకున్నాడు. కాాగా, ఇదే సినిమలో హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించిన ఈ అమ్మాయి కూడా..

Raja Vaaru Rani Gaaru: ‘రాజావారు రాణిగారు’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. ఈ మూవీ హీరోయిన్ రహస్యతో ప్రేమలో పడి.. ఇటీవల వివాహం చేసుకున్నాడు. కాాగా, ఇదే సినిమలో హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించిన ఈ అమ్మాయి కూడా..

  • Published Sep 15, 2024 | 12:30 AMUpdated Sep 15, 2024 | 12:30 AM
‘రాజావారు రాణిగారు’ హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా.?

ఇటీవల కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. తన తొలి సినిమా రాజా వారు రాణి గారు హీరోయిన్ ఐశ్వర్య అలియాస్ రహస్య గోరఖ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గత నెల 22న వీరి వివాహం జరిగింది. కాగా, ఈ సినిమా చాలా మందికి లైఫ్ ఇచ్చింది. 2019లో విడుదలైన ఈ మూవీ.. ఓకే అనిపించింది. క్లీన్ కామెడీ అండ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్‌ తీసుకుని రిలీజ్ చేయడం విశేషం. ఈ సినిమాలో హీరో హీరోయిన్లే కాకుండా వీరి ఫ్రెండ్స్ పాత్రల్లో నటించిన వారు కూడా బాగా క్లిక్ అయ్యారు. కిరణ్ అబ్బవరం స్నేహితులుగా, చౌదరి, నాయుడు పాత్రలో మెప్పించారు రాజ్ కుమార్ కసిరెడ్డి, యజుర్వేద్ గుర్రం. అలాగే హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో మెరిశారు ఇద్దరు తెలుగు అమ్మాయిలు. వీరిలో ఒకరు.. దివ్య నార్ని.

దివ్య అచ్చమైన తెలుగు అమ్మాయి. గోదావరి పిల్ల. రాజమండ్రిలో పుట్టి పెరిగిన ఆమె.. తొలుత టిక్ టాక్ చేసింది. అలా ఆమెకు రామ్ గోపాల్ వర్మ వంగవీటి చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.  అక్కడ నుండి వరుస ఛాన్సులు స్టార్ అయ్యాయి. కార్తికేయ- అజయ్ భూపతి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ఆర్ ఎక్స్ 100 మూవీలో కూడా యాక్ట్ చేసింది. ఆ తర్వాత రాజావారు రాణివారు చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందులో రాజ్ కుమార్ తనకు లవ్ ప్రపోజ్ చేస్తే.. దివ్య మాత్రం హీరోను ఇష్టపడుతుంది. ఇందులో శ్వేత క్యారెక్టర్ చేసింది ఆమె. ఈ సినిమాకు ఆమెకు ది బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. అలాగే నాని జెర్సీ, తేజ సజ్జా హీరోగా నటించిన అద్భుతం, అడవి శేష్ హిట్ 2, ముఖ చిత్రం, తాజాగా వచ్చిన బుట్టబొమ్మ, బెదురులంక చిత్రంలో కూడా నటించింది. సినిమాలు చేస్తూనే సోషల్ మీడియా ఇన్ప్లుయెన్సర్‌గా రాణిస్తుంది. కేవలం నటి మాత్రమే కాదు.. యాంకర్‌గానూ వ్యవహరించింది.

Rajavaru

ఢీ 15 యాంకర్‌గాను పలు ఎపిసోడ్లలో యాంకర్‌గా వ్యహరించింది దివ్య నార్నే. కాగా, ఆమె ఇటీవల వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. గోపాల్ కృష్ణా రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. గోవాలో అతడికి ప్రపోజ్ చేసి, ఎంగేజ్ మెంట్ సమయంలో టాటూ వేయించుకుని తనకు కాబోయే భర్తకు ఎప్పటికీ గుర్తిండిపోయే గిఫ్ట్ ఇచ్చింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా.. ప్రొడక్ట్ ప్రమోషన్స్ చేస్తుంది ఈ బ్యూటీ. ఓ వైపు యూట్యూబ్ మరో వైపు ఇన్ స్టా వేదికగా..  వీడియోలు,  అలాగే ప్రమోషన్లు చేస్తుంది. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ లీడ్ చేస్తున్న ఈ నటి.. మళ్లీ సినిమాల్లో కనిపిస్తుందో..లేదో తెలియాల్సి ఉంది. చాలా మంది పెళ్లైయ్యాక కూడా తమ కెరీర్ కొనసాగిస్తున్న వేళ.. దివ్య కూడా మరిన్ని మంచి పాత్రలతో అలరించాలని ఆశిద్దాం.

 

View this post on Instagram

 

A post shared by Divya & Krishna (@_twoasone__)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş