iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో నటిని గుర్తు పట్టారా? టాలీవుడ్ యంగ్ హీరో భార్య ఈవిడ..

  • Published Sep 04, 2024 | 5:34 PM Updated Updated Sep 04, 2024 | 5:34 PM

ఈ ఫోటోలో కనిపిస్తున్న నటిని గుర్తు పట్టారా..? ఈ టాలీవుడ్ యంగ్ హీరో భార్య ఈవిడ.. నటి మాత్రమే కాదు సాఫ్ట్ వేర్ ఉద్యోగి కూడా. ఇంతకు ఆమె ఎవరంటే..?

ఈ ఫోటోలో కనిపిస్తున్న నటిని గుర్తు పట్టారా..? ఈ టాలీవుడ్ యంగ్ హీరో భార్య ఈవిడ.. నటి మాత్రమే కాదు సాఫ్ట్ వేర్ ఉద్యోగి కూడా. ఇంతకు ఆమె ఎవరంటే..?

  • Published Sep 04, 2024 | 5:34 PMUpdated Sep 04, 2024 | 5:34 PM
ఈ ఫోటోలో నటిని గుర్తు పట్టారా? టాలీవుడ్ యంగ్ హీరో భార్య ఈవిడ..

ఈ ఫోటోలో కనిపిస్తున్న నటిని గుర్తు పట్టారా..? ఈ మధ్య కాలంలో ట్రెండ్‌లో నిలిచింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి నుండి నటిగా మారి.. ఇటీవల ఓ ఇంటికి ఇల్లాలు కూడా అయ్యింది. ప్రముఖ నటుడిని వివాహం చేసుకుని సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఈమె ఎవరో కాదు.. కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరక్. కానీ రహస్య అసలు పేరు ఐశ్వర్య గోరక్. 2012 నుండి ఆమె ఇండస్ట్రీలో కొనసాగుతుంది. రాజావారు రాణిగారు చిత్రంతో ఆమె పేరు రహస్యగా మారింది. ఈ మూవీలో నటించిన సమయంలో కిరణ్ అబ్బవరంతో ఏర్పడిన స్నేహం.. ప్రేమకు దారి తీసింది. ఈ ఏడాది ఆగస్టు22న కర్ణాటకలోని కుర్గ్‌లో ఈ లవ్ బర్డ్స్ వివాహం చేసుకున్నారు. రాజా వారు రాణిగారు మూవీతోనే రిజిస్టర్ అయిన ఆమె.. చాలా చిత్రాలు చేసిందన్న విషయం తెలియదు.

2012లో మంచు విష్ణు, హన్సిక హీరో హీరోయిన్లుగా వచ్చిన దేనికైనా రెడీ మూవీలో ఓ స్మాల్ రోల్ చేసింది ఐశ్వర్య. ఇందులో మంచు విష్ణుకి కాలేజీ క్లాస్ మేట్‌గా నటించింది. ఆ తర్వాత పలు షార్ట్ ఫిల్మ్స్ చేసింది. హ్యాపీ ఎండింగ్ అనే పొట్టి సినిమా చేసింది. 2016లో ఆకాశమంత అనే షార్ట్ ఫిల్మ్ మంచి గుర్తింపునిచ్చింది. , 2017లో వచ్చిన రెండు రెళ్లు ఆరు చిత్రంలో హీరోయిన్‌గా యాక్ట్ చేసింది రహస్య. ఇప్పుడు మీరు చూస్తున్న పిక్ ఆ చిత్రంలోనిదే. అలాగే ప్రాంక్ అనే మూవీలో కూడా నటించింది. కానీ ఈ సినిమా విడుదలైన దాఖలాలు లేవు. అలాగే సాయి ధరమ్ తేజ్, కరుణాకర్ తేజ్ ఐలవ్ యూలో కూడా నటించింది రహస్య. ఎన్ని చిత్రాలు చేసినా ఆమె క్లిక్ అయ్యింది మాత్రం రాజావారు రాణిగారు. ఇదే ఆమెకు ఐడెంటిటీని ఇచ్చింది.

Gorak rahasya

దీని తర్వాత తమిళంలో కూడా కదిర్ హీరోగా వచ్చిన ఓ మూవీలో యాక్ట్ చేసింది. రహస్య గోరఖ్‌ 1994 మార్చి 26న హైదరాబాద్ లో జన్మించింది.  ఆమె సాఫ్ట్ వేర్ ఉద్యోగి అని కూడా తెలుస్తుంది. అయితే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఐశ్వర్య నుండి రహస్యగా పేరు మార్చుకుని.. ఇప్పుడు వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. అయితే ఇన్ని సినిమాలు చేసిందన్న విషయం సినీ ప్రియులకు బహుశా తెలిసి ఉండకపోవచ్చు. కిరణ్ అబ్బవరం భార్యగా ఇప్పుడు కొత్త ఫేజ్‌లో అడుగు పెట్టింది. ఇక కిరణ్.. కా అనే మూవీతో రాబోతున్నారు. ఇది పాన్ ఇండియన్ లెవల్లో తెరకెక్కుతుంది. తాజాగా ఆయన పుట్టిన రోజున ఓ టీజర్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Rahasya Kiran (@rahasya_kiran)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş