iDreamPost
android-app
ios-app

వైరల్ అవుతున్న కిరణ్ అబ్బవరం పెళ్లి కార్డు.. ప్రత్యేకత ఏంటంటే..?

  • Published Aug 22, 2024 | 12:53 PM Updated Updated Aug 22, 2024 | 12:53 PM

Kiran Abbavaram- Rahasya Gorak Wedding Card: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నాడు. తన ఫస్ట్ హీరోయిన్ రహస్య గోరఖ్ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. దీనికి సంబంధించిన పెళ్లి కార్డు వైరల్ అవుతుంది.

Kiran Abbavaram- Rahasya Gorak Wedding Card: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నాడు. తన ఫస్ట్ హీరోయిన్ రహస్య గోరఖ్ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. దీనికి సంబంధించిన పెళ్లి కార్డు వైరల్ అవుతుంది.

  • Published Aug 22, 2024 | 12:53 PMUpdated Aug 22, 2024 | 12:53 PM
వైరల్ అవుతున్న కిరణ్ అబ్బవరం పెళ్లి కార్డు.. ప్రత్యేకత ఏంటంటే..?

టాలీవుడ్ టాలెంట్ అండ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరికొన్ని గంటల్లో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. రాజా వారు రాణిగారు మూవీ హీరోయిన్ రహస్య గోరఖ్ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. ఈ సినిమాతో ఏర్పడిన పరిచయం వీరి మధ్య ప్రేమకు దారి తీసింది. ఈ ఏడాది మార్చిలో ఈ జంట ఎంగేజ్ మెంట్ చేసుకోగా.. ఇప్పుడు శ్రావణంలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఆగస్టు 22 అనగా ఈ రోజు రాత్రి వీరి పెళ్లి జరగబోతుంది. కర్ణాటకలోని కుర్గ్‌లో వెల్డ్‌ర్‌నెస్ రిసార్ట్ అండ్ స్పాలో వీరి వివాహం జరగనుంది. గురువారం రాత్రి 9 గంటల 20 నిమిషాలకు వీరి పెళ్లి ముహుర్తం ఖరారయ్యింది. కిరణ్- రహస్య పెళ్లి కార్డు బయటకు వచ్చింది. నెట్టింట్లో వైరల్ అవుతుంది. పెళ్లిలాగానే.. వెడ్డింగ్ కార్డు కూడా సింపుల్ అండ్ స్వీట్‌గా ఉంది. అయితే ఇది అమ్మాయి తరుఫు వెడ్డింగ్ కార్డ్ అని తెలుస్తుంది.

రహస్య గోరఖ్ అసలు పేరు ఐశ్వర్య అనుకుంటా. పెళ్లి కార్డులో ఐశ్వర్య అనే రాసి ఉంది. ఐశ్వర్య వివాహం కిరణ్ కుమార్ రెడ్డితో వివాహం జరగుతున్నట్లు కార్డులో పేర్కొనబడి ఉంది. ఇక రిసెప్షన్ ఆగస్టు 25న వరుడు ఇంట్లో జరగబోతుంది. అంటే ఈ ఆదివారం రాయచోటి జిల్లాలోని కిరణ్ అబ్బవరం నివాసంలో పోస్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఏర్పాట్లు చేశారు. ఈ మధ్య కాలంలో సామాన్యులు సైతం ఆడంబరాలకు పోతూ.. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ రిచెస్ట్ ప్లేసేస్, విదేశాల్లో పెళ్లి చేసుకుంటున్న ఈ తరుణంలో కిరణ్, రహస్య చాలా సింపుల్‌గా వివాహం చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. జీవితంలో ఒక్కసారే జరిగే వివాహాన్ని ఎటువంటి హంగామా, గొడవలు లేకుండా  చేసుకోవాలనుకుంటారు. ఇదే కదా సెలబ్రిటీలు కూడా కోరుకునేది. ఈ నేపథ్యంలో కూర్గ్‌లో ప్లాన్ చేసుకున్నారు ఈ లవ్ బర్డ్స్.  ఎటువంటి ఆర్బాటాలకు పోకుండా సింప్లీగా.. తమ మనస్సుకు నచ్చినట్లు వివాహ తంతును ముగిస్తున్నారు.

kiran abbavaram marriage card

కూర్గ్‌లో వివాహం జరుగుతున్న నేపథ్యంలో కొంత మంది సెలబ్రిటీలు, అలాగే రహస్య కుటుంబ సభ్యుల మధ్యే ఈ వేడుక జరగనున్నట్లు తెలుస్తుంది. కిరణ్ వివాహానికి ఆయన బంధువులు, కొద్ది మంది స్నేహితులు మాత్రమే హాజరవుతారని టాక్. కిరణ్ అబ్బవరం ఇంట్లో జరిగే రిసెప్షన్ వేడుకల్లో స్టార్స్ హాజరు కాబోతున్నారని వినికిడి. లేకుంటే హైదరాబాద్‪లో టాలీవుడ్ స్టార్స్ కోసం ప్రత్యేకమైన ఈవెంట్ నిర్వహిస్తారో తెలియాల్సి ఉంది. ఇక కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే.. ఎస్ కళ్యాణ మండపం, సమ్మతమే మూవీతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యాడు. ‘క’ అనే మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పీరియాడిక్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సుజిత్ అండ్ సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఆగస్టు 19న ‘వరల్డ్ ఆఫ్ వాసుదేవ్’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కిరణ్ అబ్బవరం పోస్టు మ్యాన్‌గా నటిస్తున్నట్లు ఈ పాట చూస్తుంటే అర్థమౌతుంది. 18 నవంబర్ 2024న థియేటర్లలోకి విడుదల కానుంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్లు తెలుస్తుంది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş