ఎట్టకేలకు నెలల తరబడి వాయిదా పడుతూ వచ్చిన శంకర్ కమల్ హాసన్ ల ఇండియన్ 2 డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఒకరిమీద ఒకరు నిందలేసుకున్న నిర్మాణ సంస్థ లైకా, దర్శకుడు శంకర్ లు ఫైనల్ గా రాజీ పడ్డారు ఇంకో అరవై రోజులకు పైగా షూటింగ్ జరగాల్సి ఉందని చెన్నై టాక్. ఇప్పుడు దీని ఎఫెక్ట్ నేరుగా రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా మీద పడనుంది. ఇటీవలే పూణే షెడ్యూల్ పూర్తి చేసుకుని […]
లోకనాయకుడు కమల్ హాసన్ ఫ్యాన్స్ కు శుభవార్త. ఆగిపోయాక తిరిగి ప్రారంభం కాదేమోనని భయపడుతున్న ఇండియన్ 2 వివాదం ఎట్టకేలకు పరిష్కారం దిశగా వెళ్తోందని ప్రముఖ తమిళ మీడియా పత్రిక వికటన్ వెల్లడించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లాక్ డౌన్ కు ముందు క్రేన్ ప్రమాదం జరిగి ముగ్గురి ప్రాణాలు పోయాక ఆగిన షూటింగ్ మళ్ళీ రీ స్టార్ట్ కాలేదు. ఈలోగా నిర్మాతలకు దర్శకుడు శంకర్ కు మధ్య ఏవో ఆర్థిక పరమైన లావాదేవీలకు […]
ఇటీవలే ఇండియన్ 2 షూటింగ్ లో జరిగిన క్రేన్ ప్రమాదంలో ముగ్గురు టెక్నీషియన్లు మరణించిన విషాదం యావత్ దక్షిణాది సినీ పరిశ్రమను షాక్ కు గురి చేసింది. హీరో కమల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తృటిలో తప్పించుకున్నారు కానీ దర్శకుడు శంకర్ స్వల్ప గాయాలతో బయట పడటం అదృష్టంగానే భావించవచ్చు. ఇక ఇది జరిగి వారం అవుతోంది. నిర్మాత లైకా సంస్ధను ప్రశ్నిస్తూ కమల్ హాసన్ ఇటీవలే వాళ్ళకో ఓపెన్ లెటర్ రాశాడు. చాలా ఎమోషనల్ గా […]
దీంతో అక్కడిక్కడే ఇద్దరు దుర్మరణం పాలు కాగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ప్రాణాలు వదిలారు. శంకర్ కు సైతం తీవ్ర గాయాలై కాలికి ఫ్రాక్చర్ అయ్యింది. ఆయన వైద్యుల పయవేక్షణలో ఉన్నారు. చనిపోయిన వారిలో శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణలతో పాటు అక్కడి వారికి క్యాటరింగ్ చేసే బృందంలోని చంద్రన్ అనే వ్యక్తి ఉన్నట్టు తెలిసింది. శంకర్ పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్టు, అత్యున్నత వైద్యుల బృందం పర్యవేక్షిస్తున్నట్టు హాస్పిటల్ నుంచి […]
మగధీర సినిమాలో హీరొయిన్ కాజల్ అగర్వాల్ ని వర్ణిస్తూ రామ్ చరణ్ పంచదార బొమ్మా అంటూ ఓ పాట అందుకుంటాడు. నిజంగా ఆ లిరిక్స్ లో చెప్పినట్టే తన అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే. పరిశ్రమకు వచ్చి దశాబ్దం దాటుతున్నా ఇంకా కెరీర్ లో కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ మరో ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక సింగపూర్ టుస్సాడ్ మ్యుజియంలో తన మైనపు బొమ్మను చూసుకుని మురిసిపోతోంది. ఇప్పటిదాకా ఇలాంటి ఫీట్ అందుకున్న మొదటి సౌత్ ఇండియన్ […]