iDreamPost
android-app
ios-app

Kamal Hassan: మైండ్ బ్లోయింగ్ న్యూస్.. ఇండియన్-3 షూటింగ్ కూడా పూర్తైందట! మరి పార్ట్ 2 ఎక్కడ?

  • Published Mar 26, 2024 | 7:58 PM Updated Updated Mar 26, 2024 | 7:58 PM

ఇండియన్ 2 మూవీ షూటింగ్ మెుత్తం కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ ఓ ఆటమ్ బాంబ్ పేల్చాడు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇండియన్ 2 మూవీ షూటింగ్ మెుత్తం కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ ఓ ఆటమ్ బాంబ్ పేల్చాడు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Published Mar 26, 2024 | 7:58 PMUpdated Mar 26, 2024 | 7:58 PM
Kamal Hassan: మైండ్ బ్లోయింగ్ న్యూస్.. ఇండియన్-3 షూటింగ్ కూడా పూర్తైందట! మరి పార్ట్ 2 ఎక్కడ?

‘భారతీయుడు’.. విశ్వనటుడు కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ. 1996లో వచ్చిన ఈ చిత్రం సృష్టించిన సంచలనం గురించి ఇప్పటికీ చర్చించుకుంటూనే ఉంటారు సినీ అభిమానులు. అంతలా భారతీయుడు మూవీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు వస్తుందా? అని ఎంతో ఆశగా ఎదురుచూడసాగారు సినీ లవర్స్. వారి ఎదురుచూపులకు తెరదించుతూ.. ఇండియన్ 2 మూవీ ప్రారంభం అయ్యింది. అయితే ఎన్నో అవంతరాలను ఈ చిత్రం చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇండియన్ 2 మూవీ షూటింగ్ మెుత్తం కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ ఓ ఆటమ్ బాంబ్ లాంటి వార్త చెప్పాడు.

భారతీయుడు మూవీకి రెండు దశాబ్దాల తర్వాత సీక్వెల్ ను స్టార్ట్ చేశాడు డైరెక్టర్ శంకర్. అయితే ఇండియన్ 2 మూవీని ఏ ముహుర్తాన ప్రారంభించారో కానీ.. స్టార్టింగ్ నుంచి అన్నీ అవంతరాలే ఏర్పడుతూ వచ్చాయి. సెట్లో క్రేన్ ప్రమాదం, కరోనా ప్రభావం లాంటి అవంతరాలు ఏర్పడంతో షూటింగ్ వాయిదాలు పడుతూ వచ్చింది. దీనికి తోడు రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ మూవీని కూడా పట్టాలపైకి ఎక్కించాడు శంకర్. ఇంకేముంది.. రెండు చిత్రాలను ఒకేసారి కంప్లీట్ చేద్దామని భావించిన స్టార్ డైరెక్టర్ అలాగే ముందుకునడిచాడు. అయితే ఇండియన్ 2 షూటింగ్ పూర్తై.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో కమల్ హాసన్ ఓ షాకింగ్ న్యూస్ చెప్పుకొచ్చాడు. ఇండియన్ 2 షూటింగ్ ఇంత లేట్ అవ్వడానికి వేరే కారణం ఉందట. అదేంటంటే? వారు ఇండియన్ 2 మూవీతో పాటుగా ఇండియన్ 3 చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ చేశారట. ఇదే విషయాన్ని కమల్ హాసన్ వెల్లడించాడు. ఈ న్యూస్ తెలిసిన మూవీ లవర్స్.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్ రా మావ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శంకర్ సర్ లేట్ గా వచ్చినా.. లేటెస్ట్ గా వస్తాడు అంటూ సరదాగా రాసుకొస్తున్నారు. ఒకేసారి మూడు చిత్రాలను ఎలా షూటింగ్ చేశారు శంకర్ సర్ అంటూ మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇండియన్ 2 విడుదల అయ్యాక, పార్ట్ 3కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మెుదలవుతాయని, ఎక్కువ సమయం తీసుకోకుండా.. ఇండియన్ 3 చిత్రాన్ని రిలీజ్ చేస్తామని కమల్ వెల్లడించాడు. మరి సైలెంట్ గా పార్ట్ 3 ని కూడా కంప్లీట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: దసరా సీక్వెల్‌పై ఇంట్రస్టింగ్ అప్ డేట్! సైలెంట్‌గా కానిస్తున్నారా!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş