iDreamPost
android-app
ios-app

భారతీయుడు మూవీ అనుకున్నది ఈ తెలుగు స్టార్స్ తోనే!

Interesting Facts About Shankar's Bharateeyudu Movie: డైరెక్టర్ శంకర్- కమల్ హాసన్ కాంబోలో 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు భారతీయుడు 2 వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ జులై 12న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా భారతీయుడు మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం.

Interesting Facts About Shankar's Bharateeyudu Movie: డైరెక్టర్ శంకర్- కమల్ హాసన్ కాంబోలో 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు భారతీయుడు 2 వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ జులై 12న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా భారతీయుడు మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం.

భారతీయుడు మూవీ అనుకున్నది ఈ తెలుగు స్టార్స్ తోనే!

తాను తీసే సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆలోచింపజేయాలి అనే ధోరణి కలిగిన డైరెక్టర్స్ లో శంకర్ ముందు వరుసలో ఉంటారు. తాను తీసే సినిమాలు దాదాపుగా సామాజిక సమస్యలను ప్రశ్నిస్తూనే ఉంటాయి. అందులో భాగంగా వచ్చిందే భారతీయుడు చిత్రం. దాదాపుగా 28 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు 2 తీసుకొస్తున్నారు. ఈ చిత్రం జులై 12న వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్లలో విడుదల కాబోతోంది. సేనాపతి మళ్లీ రావాలి అంటూ యావత్ దేశం ఎదురుచూస్తోంది. ఈ సందర్భంగా భారతీయుడు సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తిర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ భారతీయుడు సినిమాని మొదట ‘పెరియ మనుషున్’ అనే పేరుతో శంకర్ రాసుకున్నారు. అది కూడా రజినీకాంత్ కోసం. జెంటిల్ మెన్ తో సూపర్ హిట్టు అందుకున్న శంకర్ ప్రతిభను గుర్తించి రజినీకాంత్ అవకాశం ఇచ్చారు. అందుకు తగినట్లుగా ఈ కథను రెడీ చేసుకున్నారు. కానీ, అప్పుడు రజినీకాంత్ బిజీగా ఉండటంతో.. ఆ కథనే భారతీయుడుగా మార్చారు అని చెప్తుంటారు. అలాగే ఈ సినిమా కోసం మొదట సేనాపతిగా రాజశేఖర్ ని, ఆయన కుమారుడి క్యారెక్టర్ కోసం నాగార్జునను గానీ.. వెంకటేశ్ ని గానీ తీసుకోవాలి అనుకున్నారంట. కానీ, అది కూడా కుదరలేదు. ఆ తర్వాత మరో కాంబోని సంప్రదించారట. తమిళ్ యాక్టర్స్ కార్తిక్, సత్యరాజ్ కాంబోతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలి అనుకున్నారంట. కానీ, అది కూడా వర్కౌట్ కాలేదు.

ఆ తర్వాతే ఈ కథ కమల్ హాసన్ వద్దకు వచ్చింది అంటారు. అప్పుడు కథ నచ్చడంతో ద్విపాత్రాభినయం చేసేందుకు కమల్ హాసన్ కూడా అంగీకరించాడు. అప్పుడే ఈ భారతీయుడు సినిమా పట్టాలెక్కింది. ఆ తర్వాత సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం వెతుకులాట మొదలు పెట్టారు. మొదట ఆ పాత్రకు ఐశ్వర్యారాయ్ ని అనుకున్నారట. కానీ, యాడ్ ఏజెన్సీతో కాంట్రాక్ట్ పూర్తి కాకపోవడంతో ఆమె చేయడం కుదరలేదు. ఇంక మనీషా కోయిరాలా నటనకు ఫిదా అయిన శంకర్ ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇంక రెండో హీరోయిన్ ను నిర్మాత ఏఎం రత్నం సెలక్ట్ చేశారు. రంగీలాతో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన ఊర్మిళను ఎంపిక చేశారు. సేనాపతి భార్య పాత్ర కోసం కూడా మొదట రాధికను అనుకున్నారంట. ఆఖరికి ఆ పాత్రను సుకన్య చేశారు.

1996 మే 9న భారతీయుడు చిత్రం విడుదలైంది. కోలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. రూ.15 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం రూ.35 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్తారు. బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ కి కూడా ఎంట్రీ పొందింది. కానీ, నామినేట్ కాలేకపోయింది. ఇంక భారతీయుడు చిత్రానికి 3 జాతీయ అవార్డులు కూడా దక్కాయి. 40 ఏళ్ల వయసులో ఎంతో కష్టపడి 70 ఏళ్ల వృద్ధుడి పాత్రతో మెప్పించిన కమల్ హాసన్ కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు కూడా దక్కింది. జాతీయ అవార్డులు, తమిళనాడు స్టేట్ అవార్డ్స్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్, సినిమా ఎక్స్ ప్రెస్ అవార్డ్స్ ఇలా మొత్తంగా భారతీయుడు చిత్రానికి 9 అవార్డులు దక్కాయి. ఇప్పుడు భారతీయుడు 2లో కూడా అలాంటి ఒక మ్యాజిక్ ని అభిమానులు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. జులై 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.