iDreamPost
android-app
ios-app

అసలు ఊసు లేదు గానీ.. ఎసరు దాకా ప్రచారం చేస్తున్నారు!

  • Author ajaykrishna Published - 12:29 PM, Wed - 11 October 23
  • Author ajaykrishna Published - 12:29 PM, Wed - 11 October 23
అసలు ఊసు లేదు గానీ.. ఎసరు దాకా ప్రచారం చేస్తున్నారు!

ఇండస్ట్రీలో ఒక సినిమా షూటింగ్ దశలో ఉండగానే దానికి కొనసాగింపు ఉందంటూ.. సీక్వెల్స్ ప్రకటిస్తున్నారు మేకర్స్. ఒక్కోసారి అది ఫ్యాన్స్ కి కొంత ఆనందం కలిగించే విషయమే. అయినా.. మరికొంత ఆందోళన కలిగించే విషయం అని చెప్పక తప్పదు. ఎందుకంటే.. ముందుగా ఒక సినిమా విడుదలై.. అది బ్లాక్ బస్టర్ అయ్యాక సీక్వెల్ అనౌన్స్ చేస్తే ఓకే. కానీ.. సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే పార్ట్ 2, పార్ట్ 3 ఉంటాయని చెప్పడం కరెక్ట్ కాదని కొందరి వాదన. ఎందుకంటే.. ముందుగా షూటింగ్ దశలో ఉన్న సినిమా ఫలితం ఏంటో తేలాలి కదా! అది హిట్టు కొడితే సీక్వెల్ పై ఫ్యాన్స్ లో కూడా ఆసక్తి పెరుగుతుంది. ఆ హైప్ కూడా వేరుగా ఉంటుంది.

ప్రస్తుతం విశ్వనటుడు కమల్ హాసన్.. దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఇండియన్ 2’ సినిమా విషయంలో అలాంటి వార్తలే వినిపిస్తున్నాయి. అదేంటంటే.. 1996లో కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇండియన్'(తెలుగులో భారతీయుడు). ఈ సినిమాకు సీక్వెల్ గా అదే క్యారెక్టర్ కంటిన్యూ చేస్తూ.. డిఫరెంట్ స్టోరీతో ఇండియన్ 2 చేస్తున్నారు. అయితే.. ఈ సీక్వెల్ మొదలై దాదాపు నాలుగేళ్లు అవుతోంది. అయినా.. ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. మధ్యలో సినిమా ఆగిపోవడం, కొన్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం.. ఇలా ఎన్నో జరిగాయి. ఆఖరికి లైకా ప్రొడక్షన్స్ తో రెడ్ జయింట్ వారు కలిసి.. కంప్లీట్ చేసేందుకు పూనుకున్నారు.

కట్ చేస్తే.. ఇండియన్ 2 పట్టాలెక్కి షూటింగ్ జరుపుకుంటుంది. కమల్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. కాగా.. తాజా సమాచారం ప్రకారం.. ఇండియన్ 2 సినిమాకు కొనసాగింపుగా ఇండియన్ 3 ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఇండియన్ 2 షూటింగ్ కంప్లీట్ అయ్యిందని.. మరో 30 రోజులు షూటింగ్ చేస్తే ఇండియన్ 3 కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని.. దానికి కమల్ హాసన్ తో పాటు శంకర్, ప్రొడ్యూసర్స్ కూడా సానుకూలంగా స్పందించినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. దీంతో ఇండియన్ 3 అని ప్రచారం ఊపందుకుంది. అయితే.. అసలు ఇండియన్ 2నే ఇంకా రాలేదు. దానికి సీక్వెల్ గా 3 ఏంటని అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఇండియన్ 2 వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది. మరి ఇండియన్ 2 గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetciomatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekdeneme bonusuJojobetcasibom girişPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetcasibomCasibom Güncel Giriş