iDreamPost
android-app
ios-app

ఇండియన్ 2, తంగలాన్ OTT హక్కులు పొందిన ప్రముఖ సంస్థ!

  • Published Jan 17, 2024 | 10:58 PM Updated Updated Jan 17, 2024 | 10:58 PM

ఓటీటీ పుణ్యమా అని కొత్త కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ ఇంట్లో కూర్చొని చూస్తున్నారు. భారతీయ చిత్రాలు, వెబ్ సీరీస్‌లే కాదు.. ఇతర భాషా చిత్రాలు కూడా ఓటీటీలో అలరిస్తున్నాయి.

ఓటీటీ పుణ్యమా అని కొత్త కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ ఇంట్లో కూర్చొని చూస్తున్నారు. భారతీయ చిత్రాలు, వెబ్ సీరీస్‌లే కాదు.. ఇతర భాషా చిత్రాలు కూడా ఓటీటీలో అలరిస్తున్నాయి.

  • Published Jan 17, 2024 | 10:58 PMUpdated Jan 17, 2024 | 10:58 PM
ఇండియన్ 2, తంగలాన్ OTT హక్కులు పొందిన ప్రముఖ సంస్థ!

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంపై పడింది. కరోనా సమయంలో లాక్ డౌన్ తో ఇంటిపట్టున ఉన్న సినీ ప్రేమికులు ఎక్కువగా ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సీరీస్ చూస్తూ టైమ్ పాస్ చేశారు. అది కాస్త అలవాటుగా మారిపోయింది. ధియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు నెల వ్యధిలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇండియన్ మూవీస్ మాత్రమే కాదు కాదు, ఇతర భాషా చిత్రాలు సైతం ఓటీటీలో సందడి చేస్తున్నాయి. కొంతమంది నిర్మాతలు డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2, చియాన్ నటిస్తున్న తంగలాన్ రిలీజ్ కి ముందే ప్రముఖ ఓటీటీ సంస్థ హక్కులు సాధించింది. ఈ మూవీస్ ఎక్కడ స్ట్రిమింగ్ అవుతాయో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

1996 లో ఇండియన్ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు స్టార్ డైరెక్టర్ శంకర్. ఈ మూవీలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయంలో నటించారు. దేశంలో క్యాన్సర్ లా పెరిగిపోతున్న లంచగొండితనం పై స్వతంత్ర సమరంలో పాల్గొన్న యోధుడు చేసిన యుద్దమే ఇండియన్ చిత్ర కథ. ఈ మూవీలో కమల్ హాసన్ నటన అద్భుతం. దాదాపు 27 ఏళ్ల తర్వాత శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 మూవీని లైకా ప్రోడక్షన్ భారీగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటి వరకు భారత్, తైవాన్, సౌత్ ఆఫ్రికా, లాస్ ఏంజిల్స్ లో జరిపారు. ఈ మూవీ ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలతో పాటు గొప్ప మెసేజ్ ఓరియెంట్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు దర్శకులు తెలిపారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ వివరాలు బయటకు వచ్చాయి. ఇండియన్ 2 మూవీ ఓటీటీ హక్కులు ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ బాషల్లో ఇండియన్ 2 రాబోతుంది.

ఇండియన్ 2 మూవీతో పాటు చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ మూవీ హక్కులను సైతం తాము దక్కించుకున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ రెండు సినిమాలు రిలీజ్ అయిన కొద్ది రోజులకు ఓటీటీలో స్ట్రిమింగ్ కి రానున్నాయి. పొన్నియన్ సెల్వం లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత చియాన్ విక్రమ్ నటిస్తున్న తాజా మూవీ ‘తంగలాన్’. కబాలి, కాలా, సర్పట్ట పంరంపర లాంటి చిత్రాలు తెరకెక్కించిన పా రంజిత్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. టీజర్ చూస్తుంటే.. బంగారం, రక్తం, కన్నీరు వీటి చుట్టూ సాగే కథగా కనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్, బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతం ఉన్నాయి. ఒక్క డైలాగ్ కూడా లేకుండా టీజర్ ని రిలీజ్ చేశారు. మొత్తానికి ఇండియన్ 2, తంగలాన్ ఓటీటీ హక్కులు నెట్ ఫ్లిక్స్ దక్కించుకోవడంతో స్ట్రిమింగ్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమాను.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbet