iDreamPost
android-app
ios-app

భారతీయుడు 2 రిలీజ్ అయ్యేది అప్పుడేనా?

  • Published Feb 24, 2024 | 2:11 PM Updated Updated Feb 24, 2024 | 2:20 PM

Indian 2: విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రిలీజ్ కు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి భారతీయుడు 2 రిలీజ్ అయ్యేది అప్పుడేనా?

Indian 2: విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రిలీజ్ కు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి భారతీయుడు 2 రిలీజ్ అయ్యేది అప్పుడేనా?

  • Published Feb 24, 2024 | 2:11 PMUpdated Feb 24, 2024 | 2:20 PM
భారతీయుడు 2 రిలీజ్ అయ్యేది అప్పుడేనా?

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో దక్షిణ భారత సినీ పరిశ్రమ గర్వించే దర్శకులలో ఒకరైన శంకర్ తెరకెక్కిస్తున్న తాజా పాన్ ఇండియన్ చిత్రం భారతీయుడు 2/ఇండియన్ 2. రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, సిద్దార్ధ, బాబీ సింహా, ఎస్ జె సూర్య తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఎన్నో రోజులుగా షూటింగ్ దశలో ఉండింది. తాజా వార్తల ప్రకారం దాదాపు ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకుందని తెలుస్తోంది. కాగా ఈ సినిమాని ఈ సమ్మర్ లోనే విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట.

విలక్షణ సేనాపతి పాత్రలో కమల్ హాసన్ ను మరోసారి చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారతీయుడు 2 టీజర్ కాస్త నిరాశపరిచినా… శంకర్ ఖచ్చితంగా మంచి సినిమా తీస్తారన్న నమ్మకం అటు తమిళ ప్రేక్షకులతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఉంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కి సంబందించి కొన్నాళ్లుగా పలు వార్తలు కోలీవుడ్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం క్రేజీ భారతీయుడు 2 సినిమాని మే లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాల్లో నిర్మాతలు ప్లాన్ ఉన్నట్లు చెప్తున్నారు.

అలానే దీని పై మేకర్స్ నుండి వచ్చే నెలలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. నిజానికి 2024 ఏప్రిల్ లో ఇండియన్ 2, 2024 దీపావళిలో ఇండియన్ 3ని విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా… అటు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో పాటు భారతీయుడు 2 సినిమాకి శంకర్ ఒకేసారి పని చేయాల్సి రావడంతో రెండు సినిమాల షూటింగులకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సారైనా పుకార్లు కాకుండా అఫిషియల్ గా భారతీయుడు 2 సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వాలని కమల్ హాసన్ అభిమానులు కోరుకుంటున్నారు.

ఇదికూడా చదవండి: Malaikottai Vaaliban: మలైకోటై వాలిబన్‌ రివ్యూ.. మోహన్‌లాల్‌ నటించిన ఈ చిత్రం ఎలా ఉందంటే

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş