iDreamPost
android-app
ios-app

SJ Surya: ఇండియన్ 2 చేయడానికి ఆ టాలీవుడ్ స్టార్ హీరోనే కారణం

  • Published Jul 05, 2024 | 5:59 PM Updated Updated Jul 05, 2024 | 5:59 PM

తమిళ నటుడు, దర్శకుడు సూర్య గురించి అందరికి తెలిసిందే. తన విలక్షణమైన నటనతో ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సూర్య. అయితే తాజాగా ఈయన విలన్ రోల్ గా నటిస్తున్న ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ మూవీలపై ఆసక్తిర కామెంట్స్ చేశాడు.

తమిళ నటుడు, దర్శకుడు సూర్య గురించి అందరికి తెలిసిందే. తన విలక్షణమైన నటనతో ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సూర్య. అయితే తాజాగా ఈయన విలన్ రోల్ గా నటిస్తున్న ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ మూవీలపై ఆసక్తిర కామెంట్స్ చేశాడు.

  • Published Jul 05, 2024 | 5:59 PMUpdated Jul 05, 2024 | 5:59 PM
SJ Surya: ఇండియన్ 2 చేయడానికి ఆ టాలీవుడ్ స్టార్ హీరోనే కారణం

‘ఎస్జే సూర్య’.. ఈ పేరు ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. ఎందుకంటే.. కేవలం ఒక దర్శకుడిగా మాత్రమే కాకుండా.. నటుడిగా కూడా ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు సూర్య. ఈ క్రమంలోనే ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు. అయితే పేరుకు తమిళ్ నటుడు, దర్శకుడు అయిన సూర్య తెలుగులో ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఎందుకంటే.. ఈయన మొదటగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఖుషి మూవీని తెరకెక్కించి టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇలా తెలుగు,తమిళ్ ఇండస్ట్రీలో ఓ వైపు సినిమాల్లో నటిస్తునే మరోవైపు దర్శకుడిగా తనదైన మార్క్ ను వేసుకన్నారు.

ఇకపోతే ప్రస్తుతానికి సూర్య దర్శకుడి కంటే నటుడిగానే ఎక్కువగా బిజీ అయ్యాడు. ఈ క్రమంలోనే సూర్య తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2, గేమ్ఛేంజర్ రెండు సినిమాల్లో విలన్ రోల్స్ చేయబోతున్నారు. అయితే ఈ రెండింటిలో కమల్ హాసన్ హీరోగా నటించిన ఇండియన్ 2 సినిమా ఈనెల అనగా జులై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ టీం జోరుగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. దీంతో తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్ జే సర్య ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ మూవీల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తమిళ నటుడు ఎస్ సూర్య విలక్షణమైన నటనకు ఆడియన్స్ ఎంతగానో ఫిదా అవుతురనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సూర్య శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ మూవీలో విలన్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీ ఈనెల జూలై 12వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఇందులో భాగంగానే మూవీ టీమ్ వరుస ప్రమోషన్స్ లో  పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ రెండు సినిమాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. ‘ఇండియా 2 చాలా పెద్ద సినిమా సినిమా. ఈ సినిమాలో నాకు అవకాశం రావడానికి రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీనే కారణం. ఎందుకంటే.. గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ కు నాకు మధ్య వచ్చే సీన్స్ డైరెక్టర్ శంకర్ కు చాలా బాగా నచ్చాయి. ఆ సీన్స్ రషెష్ చూసిన ఆయన వెంటనే ఇండియన్ 2 సినిమాలో మెయిన్ విలన్ గా తీసుకున్నారు. అలా ఇండియన్ 2 లాంటి సినిమాలో అవకాశం రావడానికి రామ్ చరణ్ సినిమా హెల్ప్ అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చాడు ఎస్జే సూర్య. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి, ఎస్జే చేసిన శంకర్ తెరకెక్కిస్తున్న మూవీస్ పై చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş